Health : మన ఆరోగ్యం మన చేతుల్లోనే.... ఆవగాహన తప్పనిసరి
జిల్లా ఆరోగ్య శాఖ అధికారి డా. పుష్పాల శ్రీధర్
- ప్రపంచ మలేరియా దినోత్సవం -2024 పురస్కరించు కొని గురువారం స్థానిక మోతేవాడ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి కీటక జనిత వ్యాధుల నియంత్రణ విభాగం, పట్టణ ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు సిబ్బందితో కలిసి పాత బస్ స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు.
జగిత్యాల, ఏప్రిల్ 25 :
వ్యాధులు ప్రబలకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా వైద్యాధికారి పుప్పాల శ్రీధర్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.. ప్రపంచ మలేరియా దినోత్సవం -2024 పురస్కరించు కొని గురువారం స్థానిక మోతేవాడ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి కీటక జనిత వ్యాధుల నియంత్రణ విభాగం, పట్టణ ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు సిబ్బందితో కలిసి పాత బస్ స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మోతేవాడ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా వైద్యాధికారి పుప్పాల శ్రీధర్ మాట్లాడుతూ మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందన్నారు. దోమ కాటు ద్వారా మలేరియా, డెంగూ, చికెన్ గున్యా, బోదకాలు మరియు మెదడు వాపు వంటి వ్యాధులు వచ్చి సామాజికంగా ఆర్థికంగా ప్రాణనష్టం జరుగుతుందన్నారు. జిల్లాలోని అన్నిశాఖల వారు కలిసి కట్టుగా పని చేసి దోమలను నివారించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా కీటక జనిత వ్యాధుల నివారణకు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఇంటింటా సర్వే ద్వారా బాధితులను గుర్తించి రక్త నమోనాలు సేకరించడంతోపాటు ఉచితంగా మందులు పంపిణీ చేయాలని సూచించారు. జిల్లాలో కేసులు ఎక్కువగా గుర్తించిన సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా వైద్యాధికారి అన్నారు.
దోమల నివారణ ప్రతి ఒక్కరి బాద్యత అని, ప్రతి కుటుంబం వారి వారి పరిధిలో దోమల నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ఇంటి లోపల మరియు ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి మంగళవారం మరియు శుక్రవారం డ్రైడేగా పాటిస్తే ఇంటి లోపలగాని, ఇంటి పరిసరాలలో గాని దోమలు తయారు కాకుండా ఉండడానికి చర్యలు తీసుకోవడం వలన దోమల అభివృద్ధిని పూర్తిగా నివారించ వచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి డీఎంహెచ్ వో, జిల్లా మలేరియా ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఎన్. శ్రీనివాస్, జిల్లా ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ఆకుల శ్రీనివాస్, డాక్టర్ జైపాల్ రెడ్డి, వైద్యాధికారులు డా.స్వాతి, డా.సంతోష్, డా.చైతన్య రాణి, జిల్లా అసిస్టెంట్ మలేరియా అధికారి సత్యనారాయణ, సబ్ యూనిట్ అధికారి శ్రీధర్, సూపర్వైజర్లు మురళి, శ్యాం, వేణుగోపాల్, మధుకర్, పట్టణ ఆరోగ్య కేంద్రాల వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Post Comment