ఉచిత గుండె వైద్య శిబిరానికి విశేష స్పందన
కేర్ ఆసుపత్రి మలక్ పేటలో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత గుండె శస్త్ర చికిత్సలు
బీపీ, బ్లడ్ షుగర్, ఈసీజీ, 2డి ఏకో, డయాబెటిక్, హైపర్హిన్షవ్ మొదలైన పరీక్షలు నిర్వ హించారు. కొందరు గుండె సంబంధిత వ్యాధులతో తీవ్రంగా బాధపడుతు న్నారని తెల్లరేషన్ కార్డు ఉన్న వారితో పాటు మరి కొందరికి కేర్ ఆస్పత్రి మలక్ పేటలో ఆపరేషన్లు ఉచితంగా చేయనున్నట్లు వైద్యులు తెలిపారు.
కేర్ ఆసుపత్రి మలక్ పెట్, మిధాని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వయించిన ఉచిత గుండె వైద్య శిబిరానికి విశేష స్పందన లభించదని ఆసుపత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కృష్ణమూర్తి తెలిపారు.
ఉచిత గుండె వైద్య శిబిరం నిరు పేదలకు ఉచితంగా వైద్యం అందించినప్పుడే సమాజంలో ఆ డాక్టర్లు రాణించగలుగుతా రని కేర్ ఆసుపత్రి గుండె వైద్య నిపుణుడు శ్రవణ్ కుమార్ ఈ సందర్బంగా తెలిపారు. గుండెకు ఎలాంటి చిన్న సమస్య వచ్చినా తడబడుతుంది. లయ తప్పుతుంది. ఛాతీలో నొప్పి రాగానే గుండె నొప్పి అని భావించలేం. కానీ, వయసు పెరుగుతున్న కొద్దీ గుండెకు సంబంధించిన సమస్యలు ఏం ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఆహార నియమాలు, దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఏ మాత్రం అనుమానం ఉన్నా వైద్యులను కలుసుకోవాలని ఆయన సూచనలు చేశారు. గుండె జబ్బులు ఎలా వస్తాయి.. జబ్బులు ఎలా వస్తాయో ముందుగానే పసిగట్టడం చాలా కష్టం. ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానంతో గుండె జబ్బులను తెలుసుకోవడానికి వీలవుతుంది.
ఈసీజీ, ఏకో, ట్రెడ్మిల్ పరీక్షలతో గుండె రక్త సరఫరాలో పూడికలుంటే తెలిసిపోతాయి. ఛాతీ నొప్పి వస్తే గుండె నొప్పి కాకపోవచ్చు. కండరాలు పట్టేయడం, ఎసీడీటీతో కూడా వస్తుంది. ట్రోపనిన్ పరీక్షతో ఈ నొప్పి ఎందుకు వస్తుందో తెలిసి పోతుంది. లిపిడ్ ప్రొఫైల్తో కూడా గుండె సమస్యలు పసిగట్టవచ్చు అని ఆయన ఈ సందర్బంగా రోగులకు తెలిపారు. ఆసుపత్రి వైద్యులు సిబండ్డి ప్రమోద్ కుమార్ కూడా ఈ శిబిరంలో పాల్గొన్నారు.
Post Comment