ప్రకృతి ప్రకోపానికి బలి కాకుండా ఏమి చేయాలి...

భారీగా మేఘాలు కమ్ముకుని ఒక్కసారిగా కేరళలో కుండపోత వానలు కురిశాయని వివరిస్తున్నారు. తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షపాతం నమోదు కావడానికి ఇదే కారణమని అంటున్నారు. అనూహ్య స్థాయిలో వర్షాలు కురవడం వల్ల కొండ చరియలు విరిగి పడ్డాయి. ఈ విపత్తులో ఇప్పటి వరకూ 200 మందికి పైగా మృతి  చెందగా వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు.

ప్రకృతి ప్రకోపానికి బలి కాకుండా ఏమి చేయాలి...

ఈ మధ్య కాలంలో భారత్‌లో వయనాడ్‌ తరహా విపత్తులు తలెత్తుతూనే ఉన్నాయి. వాతావరణ మార్పులు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఈ ముప్పులు వందలాది మందిని బలి తీసుకోగా ఎంతో మందిని నిరాశ్రయులను చేశాయి. వరుస పెట్టి భారీ వర్షాలు, వరదలు, తుఫాన్లు ముంచుకొచ్చాయి.

ఈ ఏడాది జూన్‌ నుంచే ఈ ప్రకృతి విపత్తులు మొదలయ్యాయి. వయనాడ్‌లో ఈ స్థాయిలో కొండ చరియలు విరిగి పడడానికి  కారణమేంటో సైంటిస్ట్‌లు ఓ ప్రాథమిక అంచనాకు వచ్చారు. అరేబియన్ సముద్రం విపరీతంగా వేడెక్కెడం వల్లే ఈ విపత్తు సంభవించిందని చెబుతున్నారు. భారీగా మేఘాలు కమ్ముకుని ఒక్కసారిగా కేరళలో కుండపోత వానలు కురిశాయని వివరిస్తున్నారు. తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షపాతం నమోదు కావడానికి ఇదే కారణమని అంటున్నారు. అనూహ్య స్థాయిలో వర్షాలు కురవడం వల్ల కొండ చరియలు విరిగి పడ్డాయి. ఈ విపత్తులో ఇప్పటి వరకూ 200 మందికి పైగా మృతి  చెందగా వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద చాలా మంది బాధితులు చిక్కుకున్నారు. దాదాపు రెండు వారాలుగా అక్కడ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఫలితంగా మట్టి బాగా మెత్తబడింది.

Read More అసెంబ్లీ ఉపఎన్నికల ఫలితాలు

వయనాడ్‌తో పాటు క్యాలికట్, మలప్పురం, కన్నూర్ ప్రాంతాల్లోనూ భారీ వర్షపాతం నమోదైంది. ఈ అన్ని చోట్లా కొండ చరియలు విరిగి పడ్డాయి. 2019 సమయంలో కేరళ భారీ వరదలు ముంచెత్తాయి. ఆ సమయంలో మేఘాలు ఎలా అయితే కుండపోత కురిపించాయో ఇప్పుడూ వాతావరణ పరిస్థితి అలాగే ఉందని సైంటిస్ట్‌లు చెబుతున్నారు. అరేబియన్ సముద్రం మీద మేఘాలు కమ్ముకుంటున్నాయని, ఒక్కోసారి ఈ మేఘాలే కేరళ వైపు మళ్లి ఇలా బీభత్సం సృష్టిస్తాయని వివరించారు. అరేబియన్ సముద్రం తీవ్ర స్థాయిలో వేడెక్కుతోంది. అందుకే అక్కడి వాతావరణం పూర్తిగా మారిపోతోంది. మేఘాలు దట్టంగా అలుముకుంటున్నాయి. ఇవే మేఘాలు కేరళ వైపు వస్తున్నాయి. ఆ సమయంలోనే ఇలా కుండపోత వానలు కురుస్తున్నాయి. వాతావరణంలో ఈ స్థాయిలో మార్పులు అందుకే వస్తున్నాయి.

Read More లొంగిపోయిన మావోయిస్టు మోస్ట్ వాంటెడ్ "బిచ్చు"

అంతకు ముందు మంగళూరులో ఈ తరహా వర్షాలు కురిసేవి. భారత్‌లోని పశ్చిమతీరంలో అనూహ్యంగా వర్షపాతం నమోదవుతోంది. ఫలితంగానే కేరళలోని పశ్చిమ కనుమల్లో ఈ ముప్పు ముంచుకొచ్చింది"IMD వెల్లడించిన వివరాల ప్రకారం 24 గంటల్లోనే 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరి కొన్ని చోట్ల 30 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది.  కొండచరియలు విరిగిపడే ప్రాంతాలను మాత్రం ముందుగానే గుర్తించవచ్చు. అది ఎలా అంటే.. నిటారుగా ఉండే కొండప్రాంతాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే లోయల దిగువ భాగాల విషయంలోనూ కేర్ తీసుకోక తప్పదు. ఇక నీటిలో ఎక్కువకాలం ఉండే ప్రాంతాలపైనా కన్నేసి ఉంచాలి. కార్చిచ్చు వల్ల తగలబడిన ప్రాంతాల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. వాగు ప్రవహించే మార్గంలోను, నదీ ప్రవాహ మార్గాల్లోనూ నిర్లక్ష్యం అస్సలు పనికిరాదు.

Read More ఆర్మీ, నేవీ చీఫ్‌లుగా స్నేహితులు

ఎగువప్రాంతాల్లో ప్రకృతి విధ్వంసం వల్ల దాని రిజల్ట్.. ఈ మార్గాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే ఇలాంటి ప్రాంతాల్లో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. మరి కొండచరియలు విరిగిపడిన సందర్భాల్లో తప్పించుకోవడం సాధ్యం కాదా అంటే.. దీనికి సమాధానం.. అప్పుడున్న పరిస్థితులను బట్టి ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి ఘటనలకు ముందు కొన్ని సంకేతాలు ఉంటాయి. రాళ్లు దొర్లుతున్న శబ్దం వింటే వెంటనే అలెర్ట్ కావాలి. అలాగే చెట్లు పడిపోయిన సౌండ్ వచ్చినా జాగ్రత్తపడాల్సిందే. మీకు సమీప ప్రాంతాల్లోని జలవనరుల్లో నీటి మట్టం అకస్మాత్తుగా పెరిగినా, తగ్గినా, ఆ నీరు బురదలా మారినా.. అది ప్రమాద సంకేతమని గుర్తించాలి. వీలైనంత త్వరగా అక్కడి నుంచి బయటపడాలి. నిపుణులు చెబుతున్న ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవడం మంచిది. గతేడాది జులైలో కొండ చరియలు విరిగి పడిన ఘటనలో 27 మంది చనిపోయారు.

Read More కేంద్రానికి రూ.857 కోట్ల డివిడెండ్‌ అందజేసిన బిఒఎం

మహారాష్ట్రలోనూఇదే స్థాయిలో వర్షాలు కురిశాయి. పలు పర్యాటక ప్రాంతాల్లో వరదలు రావడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అటు అసోంలోనూ విపరీతమైన వర్షాలు కురవడం వల్ల నదులు ఉప్పొంగాయి. కొండచరియలు విరిగి పడ్డాయి. ఈ విపత్తుల వల్ల 79 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. 150కి పైగా జంతువులూ నీళ్లలో పడి కొట్టుకుపోయాయి. గతేడాది డిసెంబర్‌లో దక్షిణాదిలో తుఫాన్ గట్టి ప్రభావం చూపించింది. తమిళనాడులో కురిసిన భారీ వర్షానికి 31 మంది బలి అయ్యారు. రోడ్లు జలమయం అయ్యాయి. రైల్వే పూర్తిగా నిలిచిపోయింది. కొద్ది రోజుల పాటు ప్రజా జీవనం అస్తవ్యస్తమైంది. ఈ ప్రభావం నుంచి బయట పడడానికి చాలా సమయమే పట్టింది. గతేడాది అక్టోబర్‌లో భారీ వర్షాలు కురవడం వల్ల హిమాలయాల్లో హిమానీ నదాలు ఉప్పొంగాయి.

Read More ఐఏఎస్ పూజా... సర్వీస్ నుంచి తొలగింపు

ఫలితంగా ఈశాన్య రాష్ట్రమైన సిక్కిమ్‌లో వరదలు ముంచెత్తాయి. 50 ఏళ్లలో ఎప్పుడూ లేని స్థాయిలో వరదలు వచ్చాయి. ఈ విపత్తు కారణంగా 179 మంది మృతి చెందారు. ఇళ్లతో పాటు వంతెనలూ కొట్టుకుపోయాయి. 2021లో ఉత్తరాఖండ్‌లో వచ్చిన వరదల్లో 200 మంది ప్రాణాలు కోల్పోయారు. రెండు భారీ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్‌లూ ధ్వంసమయ్యాయి. 2018 కేరళ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే సంవత్సరం. ఆ స్థాయిలో ఇక్కడ వరదలు విధ్వంసం సృష్టించాయి. 373 మంది ప్రాణాల్ని తీసింది ఈ విపత్తు. సాధారణం కన్నా 40% కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైంది. 10 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. వాళ్లందరినీ షెల్టర్ క్యాంప్‌లలో ఉంచింది ప్రభుత్వం. ఇప్పుడు మరోసారి కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగి పడిన ఘటన పెను విధ్వంసమే సృష్టించింది. వందలాది మంది శిథిలాల కింద నలిగిపోతున్నారు.

Read More హత్రాస్ ఘటన... గుండెలు పిండేసే విజువల్స్

Latest News

గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్ గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలం పాట
తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి
లక్ష 36 వేలకు లడ్డు దక్కించుకున్న సాయి కృష్ణ
పెట్టుబడులకు, నూతన ఆవిష్కరణలకు అనుకూల ప్రాంతం - తెలంగాణ
అద్రాస్ పల్లిలో ఈత వనాల పరిశీలన