ఉద్యోగ స్కీములు మోసం-కార్పొరేట్లకే లాభం

ఉద్యోగ స్కీములు మోసం-కార్పొరేట్లకే లాభం

భారత ఆర్థిక వ్యవస్థ చాలా క్లిష్టమైన చౌరస్తాలో వుంది. స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) పెరుగుదల రేటు ఏ విధంగానూ ఉద్యోగ కల్పనా సామర్థ్యాన్ని పెంచలేక పోతున్నది. కల్పించబడిన ఉద్యోగాలలో కూడా 57.3 శాతం స్వయం ఉపాధి రంగానివే. 18.3 శాతం ఏ ప్రతిఫలం లేని ఇంటి పనివారివైతే 45 శాతం పైగా వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నారు. 

ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకం (పిఎల్‌ఐ) పేరిట 2020 మార్చిలో ప్రవేశ పెట్టిన పథకం ఉత్పత్తి రంగంలో ఉపాధి కల్పించడంలో ఘోరంగా విఫలమైంది. ఏడాదికేడాది భారతీయ వస్తూత్పత్తి రంగంలో కొట్టొచ్చినట్టుగా తగ్గిపోతున్న ఉత్పాదకత 2022-23 నాటికి 2.38 శాతానికి చేరింది. అయితే మోడీ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాలు, ఇంకా అనేక రకాలైన నిలువు దోపిడీ వరప్రసాదాలు కలగలసి దేశంలోని లిస్టెడ్‌ కంపెనీలు 2023-24లో అపారంగా 10.1 శాతం నికర లాభాలు పోగు పోసుకున్నాయి.ఇది 2007-08 తర్వాత కాలంలోనే అత్యధికం. 

Read More వరల్డ్ క్లాస్ ఫెసిలీటీస్ తో వందే భారత్ స్లీపర్స్

ఇప్పటికొస్తే భారత ఆర్థిక వ్యవస్థ సగటున ఏటా 78.5 లక్షల ఉద్యోగాలు కల్పించ వలసిన అత్యావశ్యక పరిస్థితిలో వుందని ఆర్థిక సర్వే పేర్కొన్నది. పెరిగే శ్రామిక సంఖ్య ఉద్యోగావస రాలను అందుకోవాలంటే అది తప్పనిసరి.

Read More ఏఐతో ఉద్యోగాలపై ప్రభావం...

ఉద్యోగ రంగంలో నెలకొన్న తీవ్ర సంక్షోభం లోక్‌సభ ఎన్నికలలో ఒక వేడివేడి అంశంగా ముందు కొచ్చింది. ఈ నేపథ్యంలో మోడీ మూడవ ప్రభుత్వ తొలి బడ్జెట్‌ ఉపాధి కల్పనకూ నూతన ఉద్యోగావకాశాలు సృష్టించడానికి అత్యధిక ప్రాధాన్యత నిస్తుందని ఎవరైనా భావిస్తారు.కానీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమర్పించిన బడ్జెట్‌ సంప్రదాయ ఉద్యోగ రంగంలో ఉద్యోగాల కల్పన పేర డొల్లతనపు మోసపూరిత చర్యలకు పాల్పడటమే చూశాం. అదే సమయంలో ఆ పేరిట కార్పొరేట్లకు ప్రభుత్వ నిధులను ఉదారంగా గుమ్మరించడమూ కనిపించింది.

Read More కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగుతాం: మోడీ

ఆర్థిక మంత్రి ఉద్యోగ కల్పన అనుసంధానిత ప్రోత్సాహకాలు (ఇఎల్‌ఐ) పేరిట ప్రకటించిన పథకాల పరంపర కార్పొరేట్‌ పండితులను విశేషంగా ఉత్సాహపర్చింది. ఇందులో మొదటిదైన ఎ స్కీము ఉద్యోగులందరికీ వర్తించేదిగా వుంటే బి, సి లు మాత్రం నిర్దిష్టమైన తరగతులకు వర్తించుతాయి. 

Read More భారత్‌ అభివృద్ధి వేగాన్ని చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతోంది

ఎ స్కీము ప్రకారం ఎవరైనా ఒక యజమాని కొత్తగా ఒక కార్మికుడిని చేర్చుకుంటే లేదా అంతకు ముందు తమ జాబితాలో లేని ఒక కార్మికుడిని ఇఎఫ్‌పివో (ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌)లో చేరిస్తే ఆ కార్మికునికి వచ్చే ఒక నెల జీతాన్ని రూ. 15,000 మేరకు ప్రభుత్వం మూడు కిస్తీల్లో చెల్లిస్తుంది. దీని అర్థమేమంటే యజమాని ఆ కార్మికుడికి చెల్లించే జీతంలో పన్నెండో వంతు నేరుగా ప్రభుత్వమే అందజేస్తుంది.ఉత్పత్తి రంగంలో యాభై మందికి తక్కువ కాకుండా ఇఎఫ్‌పివో యేతర కార్మికులను తీసుకునే యాజమాన్యాలకు బి స్కీము వర్తిస్తుంది. ఈ స్కీము కింద ప్రభుత్వం ఇఎఫ్‌పివోకు అటు ఉద్యోగులు ఇటు యాజమాన్యం చెల్లించ వలసిన వాటాను అంటే జీతంలో 24 శాతాన్ని ప్రజాధనం నుంచి నేరుగా చెల్లిస్తుంది. 

Read More ₹10 కాయిన్ ను తిరస్కరిస్తే చట్టరీత్య నేరమే

ఇక సి స్కీము ప్రకారమైతే ఏదైనా కంపెనీ గనక ఇద్దరు నుంచి ఐదుగురు ఉద్యోగులను తీసుకుంటే నెలకు రూ.3000 వరకూ ఇఎఫ్‌పివో లో యజమాని వాటా అందు కుంటుంది. చాలా స్పష్టంగా ప్రభుత్వం వేతనాల మొత్తంలో 32.33 శాతాన్ని ప్రజల ధనంతో చెల్లు వేస్తుందన్నమాట. 

Read More హత్రాస్ ఘటన... గుండెలు పిండేసే విజువల్స్

ఈ పథకాలలో మరీ ప్రమాదకరమైన అంశమేమంటే ఆ కంపెనీలు ప్రతి ఏటా కొత్త ఉద్యోగులను తీసుకుంటేనే ఈ పథకం అమలవుతుంది. దీనివల్ల జరిగేదేమంటే మొదటి ఏడాది ఉద్యోగులను కేవలం నిర్ణీత కాలానికే తీసుకుని ఏడాది కాగానే పని నుంచి తొలగించేస్తాయి. ప్రభుత్వ సబ్సిడీ పొందడం కోసం రిట్రెంచిమెంటు మరింత తీవ్రం చేసేందుకు ఈ పథకాలు కారణమవుతాయి.

Read More బడ్జెట్ పై సలహాలు ఇస్తారా..

మరో పెద్ద దెబ్బ ఇంటర్న్‌షిప్‌ విధానం.ఈ పథకాన్ని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అగ్రశ్రేణి కంపెనీల కోసం రూపొందించింది. అత్యధిక లాభాలతో నడుస్తున్న ఈ 500 కంపెనీలు తమ మొత్తం ఉత్పత్తినీ సేవలనూ కేవలం ఇంటర్న్‌లు లేదా అంప్రెంటిస్‌లతో నడిపించు కోవడానికి వీలుగా ఈ పథకం తయారైంది. 

Read More ఐఏఎస్ పూజా... సర్వీస్ నుంచి తొలగింపు

వీరికి నెలకు 5000 రూపాయల స్టైఫండ్‌ భారం, ఒక దఫా సహాయంగా రూ. ఆరు వేల చెల్లింపు అన్నీ ప్రభుత్వమే చేస్తుంది. మిగిలిన శిక్షణా వ్యయం కూడా సిఎస్‌ఆర్‌ (కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ) నిధుల నుంచి తీసుకోవచ్చు. ఈ కార్పొరేట్‌ అనుకూల ప్రభుత్వం అపఖ్యాతి కరమైన ఈ పథకం ద్వారా ఉద్యోగ సంబంధాలను మరింత దుర్బల పరిచే దిశలోకి నడిపిస్తుంది. 

Read More ఆసుపత్రిలో చేరిన ఎల్.కె.అద్వానీ

అత్యాధునికమైన యంత్రాలు,సాంకేతికత పరిజ్ఞానంతో వేగంగా నేర్చుకునే సత్తా సంతరించు కున్న కొత్త ఇంటర్న్‌ బ్యాచీలు మొత్తం కీలక ఉత్పత్తి ప్రక్రియకు బాధ్యత వహించాల్సిన పరస్థితి కల్పించ బడుతుంది. ఈ ఉత్పత్తి క్రమంలో పాత బ్యాచీల స్థానంలో రావడం కోసం భారీ నిరుద్యోగ సైన్యాలు లేదా వృత్తి విద్యా సాంకేతిక శిక్షణ పొందిన వారు ఫ్యాక్టరీల గేట్ల దగ్గర పడిగాపులు పడి నిరీక్షించాల్సి వస్తుంది. ఈ విధంగా ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు తరలించి ప్రైవేటు భోషాణాలు నింపడం వల్ల నిరుద్యోగ సమస్య ఇసుమంతైనా పరిష్కారం కాదు. 

Read More యోగికి చెక్ పెడతారా...

లాభార్జనతో ముడిపడిన ఉత్పత్తిని పెంచడ మంటే దాంట్లో ఎలాంటి చెల్లింపులేని శ్రామిక శక్తి వాటా పెంచడమే.ఇఎల్‌ఐ,ఇంటర్న్‌షిప్‌ స్కీములు తీసుకు రావడం ద్వారా కార్పొరేట్లకు ఉచిత శ్రామిక బలగాన్ని సమకూర్చి పెట్టేందుకు మోడీ సర్కారు బరితెగించి ప్రయత్నిస్తున్నది. కానీ మరో వైపున ప్రజల కొనుగోలు శక్తి క్షీణిస్తుండడం వల్ల మొత్తం గిరాకీ నిరంతరాయంగా పడిపోతున్నది. దాంతో నికర అమ్మకాలు తగ్గిపోతున్నాయి. 

ఉత్పత్తితో ముడిపడిన లాభాలూ వాస్తవ రూపం దాల్చడం లేదు. అది ఉత్పత్తి సంబంధమైన ఆలోచనల నుంచి ప్రైవేటు పెట్టుబడులను దెబ్బతీస్తున్నది. కార్పొరేట్‌ ఆదాయం పెరుగుదల స్థిరంగా స్పెక్యులేషన్‌ మార్గంలోనే మళ్లించ బడుతున్నది. ప్రభుత్వం కార్పొరేట్లకు ఈ స్కీములతో సబ్సిడీలు ఇవ్వొచ్చునేమో గానీ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి, ప్రజల జీవన స్థితిగతులు మాత్రం మరింత దిగజారతాయి.

Latest News

ప్రపంచం కమ్యూనిస్టుల వైపు చూస్తున్నది...  ప్రపంచం కమ్యూనిస్టుల వైపు చూస్తున్నది... 
నేడు ప్రపంచ దేశాలలో తమ ఆయుధ  వ్యాపారి కరణ లక్ష్యంతో యుద్ధాలు సృష్టిస్తున్న అమెరికా ఒకవైపు అయితే చిన్న చిన్న మధ్యతరహా దేశాలన్నీ చైనా వైపు మగ్గుచూపుతున్నాయని...
రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులకు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు  కలెక్టర్
ఈనెల 25న జరిగే రవీంద్ర భారతిలో బీసీల సమరభేరిని విజయవంతం చేయండి
భగవాన్ సత్యసాయి పుట్టినరోజు మహిళా వృద్ధుల ఆశ్రమ నిర్మాణమునకు రు. 50,116 విరాళం 
ఘనంగా మాజీ ఎమ్మెల్యే శ్రీ రామావత్ రవీంద్ర కుమార్ దేవరకొండ పుట్టినరోజు వేడుకలు
తెలంగాణ భవన్లో ఘనంగా దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ జన్మదిన వేడుకలు