ఐఏఎస్ పూజా... సర్వీస్ నుంచి తొలగింపు
మనోరమ తల్లి గతంలో ఓ వ్యక్తిని తుపాకీతో బెదిరించిన వీడియోలు అందరినీ షాక్‌కు గురిచేసేలా ఉన్నాయి. కొందరు గ్రామస్థులను మనోరమ చిన్న రివాల్వర్‌తో బెదిరించారు. వీడియోల్లో ఈ విషయం స్పష్టంగా కనిపించింది. చేతిలో తుపాకీ పట్టుకొని గ్రామస్థుల దగ్గరకు వెళ్లిన పూజా ఖేద్కర్ తల్లి.. వారితో దురుసుగా వ్యవహరించింది. తన పేరిట ఆ భూమి పత్రాలు ఉన్నాయని మనోరమ వాదించింది.
ముంబై, జూలై 13 :
ట్రెయినీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగులో చూస్తున్నాయి. పూజా ఖేద్కర్ కుటుంబసభ్యులు కూడా గతంలో అనేక అక్రమాలకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఆమె తల్లి మనోరమ గతంలో అనేక అరాచకాలకు పాల్పడిన విషయాలు బయటకొచ్చాయి.
ఈ విషయంపై రైతులు పుణెలోని పౌడ్ పోలీస్‌స్టేషన్‌లో దిలీప్ కుటుంబంపై ఫిర్యాదు చేశారు.పుణేలో అసిస్టెంట్ కలెక్ట్‌కర్‌గా ఉద్యోగంలో చేరకముందే తనకు ఎన్నో సౌకర్యాలు కావాలని పూజా డిమాండ్ చేయడంతో వివాదం చెలరేగింది. తన ప్రైవేట్ ఆడి కారుకు రెడ్-బ్లూ బీకన్ లైట్లు, వీఐపీ నంబర్‌ప్లేటు పెట్టారు. మహారాష్ట్ర ప్రభుత్వం అనే స్టిక్కర్ అమర్చారు. తనకు ప్రత్యేక వసతి సౌకర్యాలు కల్పించాలని, తగినంత సిబ్బందితోపాటు ఓ కానిస్టేబుల్‌తో అధికారిక ఛాంబర్‌ను కేటాయించాలని పట్టుబట్టారు. అధికారులకు ఆమె పంపించిన వాట్సాప్ సందేశాలు బయటపడ్డాయి.ఉద్యోగం కోసం ఓబీసీ సర్టిఫికేట్‌తో పాటు కంటి సమస్యకు సంబంధించి తప్పుడు పత్రాలు సమర్పించినట్టు ఆరోపణలు వచ్చాయి. నకిలీ అంగవైకల్యం సర్టిఫికేట్‌తో ఆమె ఉద్యోగం పొందారా ? అన్న విషయంపై కూడా సందేహాలు కలుగుతున్నాయి.
సివిల్స్‌లో 841 ర్యాంక్ వచ్చినప్పటికి ఓబీసీ సర్టిఫికేట్ తోనే ఆమె ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. పూజా తండ్రి మహారాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నతాధికారిగా పనిచేసి రిటైర్ అయ్యారు. క్రిమీలేయర్ కిందకు రావడంతో ఆమెకు ఓబీసీ రిజర్వేషన్ వర్తించదన్న వాదన కూడా ఉంది. పూజా ఓబీసీ సర్టిఫికేట్‌పై ఐఏఎస్ అకాడమీ దర్యాప్తు చేపట్టింది. పూజా ఖేద్కర్ వ్యవహారంపై ప్రధాని కార్యాలయం ఇప్పటికే దర్యాప్తుకు ఆదేశించింది. ఒక సభ్యుడితో ఏర్పాటుచేసిన ఈ కమిటీ రెండు వారాల్లో నివేదిక ఇవ్వనుంది. ఇందులో పూజా ఖేద్కర్ అవకతవకలకు పాల్పడినట్టు తేలితే.. ఆమెను విధుల నుంచి తొలగించే అవకాశం ఉంది.మరోవైపు తమ ఇంటి సమీపంలో ఉన్న ఫూట్ పాత్‌ను పూజా ఖేద్కర్ ఆక్రమించిందనే ఆరోపణలపై పుణే మున్సిపల్ అధికారులు స్పందించారు. ఆక్రమణలు నిజమే అని తేలడంతో వాటిని తొలగించాలని నిర్ణయించారు. జేసీబీలను తరలించి వాటిని కూల్చే ప్రక్రియను మొదలుపెట్టారు.
Post Comment