సినిమాలపై రాజకీయాలా..?

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఆధారంగా "ఎమర్జెన్సీ" మూవీని తెరకెక్కించారు. ఇందులో కంగనా రనౌత్‌ కథానాయిక. అనుపమ్‌ ఖేర్‌, మహిమా చౌదరి కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబర్‌ 6న మూవీని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది.

సినిమాలపై రాజకీయాలా..?

నటి కంగనా రనౌత్ ఉన్నచోటుకు వివాదాలు వస్తాయో లేక వివాదాలను వెతుకుంటూ కంగనా వెళ్తారో కానీ.. కంగనా, కాంట్రవర్శీలు ఎప్పుడూ కలిసే ఉంటాయి. తాజాగా ఆమె స్వీయదర్శకత్వంలో నటించిన ఎమర్జెన్సీ మూవీ..వివాదాలకు కేరాఫ్‌గా మారింది. నిత్యం వివాదాలతో సహవాసం చేసే కంగనా.. ఎమర్జెన్సీ మూవీతో మారోసారి కంట్రావర్సీకి కేరాఫ్‌గా మారారు.

ఈ మూవీని ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటామని ఓ వర్గం హెచ్చరిస్తుంటే.. కంగనా మాత్రం తగ్గేదే లేదంటూ కౌంటర్‌ ఇస్తున్నారు. మరోవైపు తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో "ఎమర్జెన్సీ" మూవీని బ్యాన్‌ చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఆధారంగా "ఎమర్జెన్సీ" మూవీని తెరకెక్కించారు. ఇందులో కంగనా రనౌత్‌ కథానాయిక. అనుపమ్‌ ఖేర్‌, మహిమా చౌదరి కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబర్‌ 6న మూవీని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ చిత్రంలో తమని తప్పుగా చూపించారని సిక్కులు ఆరోపిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్‌పై బ్యాన్‌ విధించాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు సినిమాను రిలీజ్‌ చేస్తే చంపేస్తామంటూ కంగనకు బెదిరింపులు కూడా వస్తున్నాయి. అయితే ఎన్ని ఆరోపణలు ఎదురైనా.. బెదిరింపులు వచ్చినా భయపడే ప్రసక్తే లేదంటున్నారు కంగనా. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను రిలీజ్‌ చేసి తీరుతానని, ఎవరు అడ్డుకుంటారో చూస్తానంటూ కౌంటర్‌ ఇస్తున్నారు.

Read More కార్తి, పిఎస్ మిత్రన్, ప్రిన్స్ పిక్చర్స్ 'సర్దార్ 2'

365532-web-image-copy

Read More 50 మందిని పెళ్లి చేసుకున్న నిత్య పెళ్లి కూతురు..

ఇంత జరుగుతున్నప్పటికి బాలీవుడ్‌ నుంచి తనకు మద్దతు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కంగనా. బాలీవుడ్‌లో టాలెంట్‌ ఉన్నవారికి  ఎలాంటి గుర్తింపు లభించదని, ఇదొక నిస్సాహాయ ప్రదేశమని సంచలన వ్యాఖ్యలు చేశారు. కంగనా తెరకెక్కించిన ఎమర్జెన్సీ చిత్రాన్ని.. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇందిరాగాంధీ కుటుంబాన్ని ప్రజలకు దూరం చేయాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని, కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్‌ను నేరుగా ఎదుర్కోలేక కంగనా రూపంలో బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపిస్తున్నారు హస్తం పార్టీ నేతలు.కెరీర్‌ ఆరంభంలో ఆఫర్స్‌ లేక తాను తీవ్ర ఇబ్బందులు పడ్డానని, ఓ దశలో విదేశాలకు కూడా వెళ్లిపోవాలనుకున్నానంటూ కామెంట్స్‌ చేశారు.

Read More వరల్డ్ క్లాస్ ఫెసిలీటీస్ తో వందే భారత్ స్లీపర్స్

అలాగే తన సినిమాకు ఇంకా సెన్సార్‌ సర్టిఫికేట్‌ రాకపోవడంపై కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు కంగనా. తన సినిమా కోసం ఎలాంటి పోరాటం చేయడానికైనా సిద్ధమేనని..అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని ప్రకటించారు.యాక్టర్‌ నుండి పొలిటిషియన్‌గా మారిన కంగనాకు వివాదాలు కొత్త కాదు. బంగ్లాదేశ్‌ ఆందోళకారులతో రైతులను కంగనా పోల్చడంపై ఇటీవల దుమారం చెలరేగింది. గతంలో కూడా సాగు చట్టాలను వ్యతిరేకించిన వాళ్లను, ఉగ్రవాదులతో పోల్చారు కంగనా. రైతుల నిరసనల వెనుక విదేశీ కుట్ర ఉందంటూ ఆరోపించారు. ప్రభాస్ ఏక్ నిరంజన్ తో మనకు పరిచయమైనా పూర్తిగా హిందీ సినిమాలకే పరిమితమైన కంగనా రౌనత్ క్రిష్ దర్శకత్వం వహించిన మణికర్ణికతో మనకు మరింత దగ్గరయ్యింది. ఫైర్ బ్రాండ్ గా పేరున్న ఈ ఉంగరాల జుత్తు అమ్మాయి స్వంతంగా డైరెక్ట్ చేసిన మూవీ ఎమర్జెన్సీ. సెప్టెంబర్ 6 విడుదల కావాల్సిన ఈ చిత్రానికి వివాదాలు చుట్టుముట్టాయి.

Read More 'డార్లింగ్' లో నా డ్రీమ్ రోల్ చేశాను.

kanganaranaut-1724768009

Read More దిగొస్తున్న బంగారం ధరలు

ఇందిరాగాంధీ 1975 నుంచి 1977 వరకు విధించిన అత్యయిక పరిస్థితి దేశంలో తీవ్ర అలజడికి దారి తీసింది. పౌర హక్కులను అడ్డుకునే చట్టం కావడంతో పాటు ఎన్నికలను సైతం నిలిపేసే వ్యవస్థను తేవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.ఎమర్జెన్సీ నడిచిన 21 నెలల పాటు ఎదురుకున్న ఆనాటి స్థితిగతులను కళ్ళకు కట్టినట్టు చూపాలనే ఉద్దేశంతో కంగన రౌనత్ దాన్ని అదే టైటిల్ తో తెరకెక్కించింది. అప్పట్లో పలు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన ఇందిరాగాంధీ కొడుకు సంజయ్ గాంధీ గురించి కూడా ఇందులో కీలక ప్రస్తావన ఉందట. సదరు నటుడికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. సహజంగానే కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ సినిమా పట్ల తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. పలు మైనారిటీ వర్గాలతో పాటు పంజాబ్ కు చెందిన కుల సంఘాలు ఎమర్జెన్సీని నిషేదించాలని ఆర్జీలు పెట్టుకున్నాయి. సెన్సార్ బోర్డు సైతం ఇందులో సున్నితత్వాన్ని గుర్తించింది.గతంలో ఇదే తరహాలో ఇందూ సర్కార్ అనే మూవీ వచ్చింది.

Read More 10 లక్షల వరకు ఆయుష్మాన్ భారత్

కానీ స్టార్ క్యాస్టింగ్ లేకపోవడంతో పాటు తీసిన విధానం ఆసక్తికరంగా లేకపోవడంతో ఫ్లాప్ అయ్యింది. అందుకే ఎక్కువ కాంట్రావర్సికి చోటు దక్కలేదు. కానీ ఇప్పుడు కంగనా రౌనత్ లాంటి పేరున్న ఆర్టిస్ట్ తీయడంతో ఎక్కడ లేని ప్రచారం వచ్చేసింది. అధికారంలో ఉన్నది బిజెపి ప్రభుత్వం కాబట్టి క్లియరెన్స్ వస్తుందనే కామెంట్ల నేపథ్యంలో ఒకవేళ వివాదం కోర్టు మెట్లు ఎక్కితే ఎలాంటి తీర్పు వస్తుందో చూడాలి. మోక్షం దక్కించుకుని బయటికి వచ్చాక నిజంగా ఊహించినట్టు వివాదాస్పద అంశాలు ఉంటే మాత్రం కంగనాకు ఇబ్బందే.కేంద్ర తీసుకున్న చర్యల వల్లే పరిస్థితి అదుపులో ఉందని, లేకుంటే దేశంలో బంగ్లాదేశ్‌ తరహా పరిస్థితికి దారి తీసేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు కంగనా.కంగనా వ్యాఖ్యలతో భగ్గుమన్నారు కాంగ్రెస్‌ నేతలు. రైతులను ఉగ్రవాదులతో పోల్చిన కంగనాను, బీజేపీ నుంచి బహిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

Read More జర్నలిస్టుల రక్షణకు చట్టాన్ని తీసుకురావాలి..

దీంతో రంగంలోకి దిగిన బీజేపీ హైకమాండ్‌.. కంగనా వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని వివరణ ఇచ్చింది. రైతులపై కంగనా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ, భవిష్యత్‌లో ఇలాంటి కామెంట్స్‌ చేయవద్దని హెచ్చరించింది. ఆ వివాదం సద్దుమణిగిందో లేదో, ఎమర్జెన్సీ మూవీతో మరోసారి కాంట్రవర్సీలో చిక్కుకున్నారు నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్.ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను రిలీజ్‌ చేసి తీరుతానని, ఎవరు అడ్డుకుంటారో చూస్తానంటూ కౌంటర్‌ ఇస్తున్నారు.

Read More చుక్కలు చూపిస్తున్న టమాటా...

Latest News

మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి విజయం పట్ల హర్షం   మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి విజయం పట్ల హర్షం  
జయభేరి, జమ్మికుంట : మహారాష్ట్రలో ఎన్డీఏ విజయం పట్ల బిజెపి మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి 225 సీట్లు కైవసం చేసుకోవడం దేశంలో బిజెపి అప్రతిహత విజయానికి నిదర్శనం....
సైదాపూర్ మండలం మార్కెట్ కమిటీ చైర్మన్గా దొంత సుధాకర్
వచ్చే 20-25 ఏళ్లపాటు భారతదేశం ప్రపంచాన్ని పరిపాలిస్తుంది. ఇదీ మోదీ అనే అసామాన్య వ్యక్తి సాధించిన విజయం. బీజేపీ కాషెట్టి కుమార్ 
collector vijaya krishnan : ప్రజా సమస్యలకు మండల స్థాయిలోనే పరిష్కారం చూపాలి కలెక్టరు విజయ కృష్ణన్
భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొన్న ఎంపీపీ పైల, మాజీ సర్పంచ్ చుక్కా
ఘనంగా బండారు శ్రీను గురుస్వామి అయ్యప్ప పడిపూజ