బెయిల్ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న కవిత

రౌస్ ఎవెన్యూ కోర్టులో దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌ను కవిత వెనక్కి తీసుకున్నారు. ఈ కేసులో పదే పదే బెయిల్ కోసం వాయిదాలు తీసుకోవడంతో రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

బెయిల్ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న కవిత

న్యూ ఢిల్లీ, ఆగష్టు 6 :
తీహార్ జైలులో బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవితతో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు కెటిఆర్, హరీష్‌రావు ములాఖాత్ అయ్యారు. ఢిల్లీ మద్యం కేసులో ఐదు నెలలుగా ఆమె తీహార్ జైలులో ఉంటున్నారు. ఢిల్లీ మద్యం కేసులో ఇడి, సిబిఐ కేసుల్లో ఆమెను అరెస్టు అయిన విషయం తెలిసిందే. రౌస్ ఎవెన్యూ కోర్టులో దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌ను కవిత వెనక్కి తీసుకున్నారు. ఈ కేసులో పదే పదే బెయిల్ కోసం వాయిదాలు తీసుకోవడంతో రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీంతో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌ను కవిత విత్ డ్రా చేసుకున్నట్టు సమాచారం. ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆప్ మాజీ మంత్రి మనీష్ సిసోడియాతో సహా పలువురు ప్రముఖులు అరెస్టు అయిన విషయం విధితమే.

Latest News

గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్ గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలం పాట
తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి
లక్ష 36 వేలకు లడ్డు దక్కించుకున్న సాయి కృష్ణ
పెట్టుబడులకు, నూతన ఆవిష్కరణలకు అనుకూల ప్రాంతం - తెలంగాణ
అద్రాస్ పల్లిలో ఈత వనాల పరిశీలన