యోగాతో ఆరోగ్య దేశ నిర్మాణానికి బాటలు వేయాలి

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్

యోగాతో ఆరోగ్య దేశ నిర్మాణానికి బాటలు వేయాలి

జయభేరి, మేడ్చల్ :

సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణ కోసం మన ఋషులు పూర్వికులు అందించిన యోగాను ప్రతి ఒక్కరు ఆచరించి ఆరోగ్య దేశ నిర్మాణానికి బాటలు వేయాలని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ అన్నారు.

Read More బీరప్పకు బోనమెత్తిన మూత్తిరెడ్డి గూడెం కురుమ, గొల్లలు....

పతంజలి యోగ సమితి ఆధ్వర్యంలో మేడ్చల్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో అంతర్జాతీయ యోగా దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎంపీ ఈ సందర్భంగా మాట్లాడుతూ మనిషికి ఎన్ని ఆస్తులు అంతస్తులు, పదవులు ఉన్న ప్రశాంతత కరువైందని అన్నారు. నేటి ఉరుకు పరుగులు సమాజంలో మనిషి తీవ్ర ఒత్తిడిలోనై రోగాల బారిన పడుతున్నారని తెలిపారు. శారీరిక శ్రమ కరువై చిన్న పెద్ద, పేద గొప్ప అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి అన్నారు.

Read More స్వ‌స్థ న‌గ‌రం నమూనా కార్యక్రమ అమలుపై సమీక్ష

IMG-20240621-WA2054

Read More ప్రభుత్వ  ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ నిర్వహించిన డి సి హెచ్ మాతృ నాయక్ 

ఒత్తిడి తగ్గించుకుంటే ఏదైనా సాధించవచ్చు, ముఖ్యంగా ఆరోగ్యాన్ని కాపాడుకో పచ్చని అందుకు యోగ సాధన ఎంతో ఆవశ్యకత అని అన్నారు. ఆర్థిక అభివృద్ధి తో పాటు ఆరోగ్య దేశంగా భారత్ ఆదర్శవంతంగా తయారు కావాల్సిన అవసరం ఉందన్నారు. మరోసారి ప్రపంచానికి విశ్వ గురువుగా భారత దేశాన్ని నిలిపేందుకు మనకు పరంపరగా వస్తున్న యోగాను ఆచరించి ఆరోగ్యవంతులుగా జీవించాలని కోరారు. ఆరోగ్య దేశాన్ని తయారు చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యోగాను అందరికీ అందించాలని సంకల్పంతో 10 సంవత్సరాల క్రితం అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రారంభించడం గర్వకారణమని అన్నారు.

Read More బిఆర్ఎస్ నాయకులు మౌలానా ఆలీ నవాబ్ జన్మదిన వేడుకలు

ఈ కార్యక్రమంలో ఎంపీపీ రజిత రాజమల్లారెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి, మేడ్చల్ మాజీ జెడ్పిటిసి శైలజా హరినాథ్, జిల్లా రైతు సమితి మాజీ అధ్యక్షుడు నందా రెడ్డి, డబిల్ పూర్ మాజీ సర్పంచ్ రాజమల్లారెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు ఆంజనేయులు, పతాంజలి సమితి జిల్లా అధ్యక్షుడు కిషోర్, మేడ్చల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు హరినాథ్, కోశాధికారి మల్లారెడ్డి, ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ,  పతాంజలి సభ్యులు కవిరాజ్, మురళి, శ్రీనివాస్, తారక్, ప్రవీణ, పుష్పలత నాయకులు ప్రభాకర్ రెడ్డి, కిషన్ రావు, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మణ్, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Read More రాజేంద్రనగర్ లో ఎదురు కాల్పులు

Latest News

గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్ గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలం పాట
తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి
లక్ష 36 వేలకు లడ్డు దక్కించుకున్న సాయి కృష్ణ
పెట్టుబడులకు, నూతన ఆవిష్కరణలకు అనుకూల ప్రాంతం - తెలంగాణ
అద్రాస్ పల్లిలో ఈత వనాల పరిశీలన