సోషల్ మీడియాను ఊపేస్తోన్న అమ్మపాడే జోలపాట సాంగ్..
ఈ సింగర్ ఎవరో తెలుసా.. ?
మనసుకు హత్తుకునే లిరిక్స్.. అద్భుతమైన వాయిస్ కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఏం సాంగ్ రా బాబు అసలు మైండ్ లో నుంచి పోవడం లేదు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మిట్టపల్లి సురేందర్ రాసిన ఈ పాటను ఎంతో అందంగా ఆలపించిన ఆ అమ్మాయి వీడియోస్ తెగ షేర్ చేస్తున్నారు. జూనియర్ శ్రేయ ఘోషల్ అంటూ ఆ అమ్మాయి పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక్కపాటతో ఫేమస్ అయిన ఆ అమ్మాయి ఎవరో తెగ ఆసక్తి చూపిస్తున్నారు.
అమ్మపాడే జోలపాట.. అమృతానికన్నా తియ్యనంట..
అమ్మపాడే లాలిపాట.. తేనెలూరి పారే ఏరులంట..
నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి..
నిండు జాబిలి చూపించి.. గోటితో బుగ్గను గిల్లేసి..
ఉగ్గును పట్టి ఊయలలూపే అమ్మ లాలన ఊపిరిపోసే నూరేళ్ల నిండు దీవెన..
మిట్టపల్లి సురేందర్ రాసిన ఈ పాటను ఎంతో అందంగా ఆలపించిన ఆ అమ్మాయి వీడియోస్ తెగ షేర్ చేస్తున్నారు. జూనియర్ శ్రేయ ఘోషల్ అంటూ ఆ అమ్మాయి పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక్కపాటతో ఫేమస్ అయిన ఆ అమ్మాయి ఎవరో తెగ ఆసక్తి చూపిస్తున్నారు. మనసుకు హత్తుకునే అమ్మపాట పాడిన ఆ అమ్మాయి పేరు జాహ్నవి ఎర్రం. మహారాష్ట్రకు చెందిన అమ్మాయిగా ఉంది. తెలుగు మూలాలున్న అమ్మాయి అని మరోసారి క్లారిటీ వచ్చింది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాహ్నవి మాట్లాడుతూ.. తాను తెలుగమ్మాయినే కానీ. తెలుగు మాట్లాడం రాదని అన్నారు. మిట్టపల్లి స్టూడియో యూట్యూబ్ ఛానల్ కోసం అమ్మ పాటను పాడింది జాహ్నవి. మిట్టపల్లి సురేందర్ ఈ పాటను రాయగా.. సిస్కో డిస్కో సంగీతం అందించారు. సులభంగా ఎంతో మధురంగా ఉన్న అమ్మ పాట మ్యూజిక్, లిరిక్స్ కు ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా తెలుగు రాకపోయిన ఎంతో అందంగా అమ్మ పాటను పాడిన సింగర్ జాహ్నవిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం జాహ్నవికి ఇన్ స్టాలో 126 వేల మంది ఫాలోవర్స్ ఫాలో అవుతున్నాయి.
Post Comment