వర్గల్ క్షేత్రాన్ని... తెలుగు రాష్ట్రాల్లో అగ్రగామి గా తీర్చిదిద్దడమే ఏకైక లక్ష్యం

  • ఆలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్న దాతలు 
  • శ్రీ విద్యాధరి క్షేత్ర వ్యవస్థాపకులు చంద్రశేఖర శర్మ సిద్ధాంతి

వర్గల్ క్షేత్రాన్ని... తెలుగు రాష్ట్రాల్లో అగ్రగామి గా తీర్చిదిద్దడమే ఏకైక లక్ష్యం

జయభేరి. గజ్వేల్, అక్టోబర్ 06 :
దాతలు, భక్తుల సంపూర్ణ సహకారంతోనే ఆలయ అభివృద్ధి సాధ్యపడిoదని వర్గల్ శ్రీ విద్యాధరి క్షేత్ర వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ, యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి పేర్కొన్నారు. ఆదివారం తున్కిమక్త తాజా మాజీ సర్పంచ్ ఎల్కoటి సంతోష వెంకటేష్ రూ లక్షా 11 వేలు ఆలయ అభివృద్ధి నిమిత్తం అందజేశారు. 

ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వేద పండితులు సంతోష వెంకటేష్ దంపతులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు. ముఖ్యంగా ధార్మిక, ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా వర్గల్ క్షేత్రాన్ని తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. అంతేకాకుండా దినదినాభివృద్ధి చెందుతున్న వర్గల్ క్షేత్రం వద్ద నిత్యం వేదగోష వినిపిస్తుండగా, నిత్యాన్న దానం, సామూహిక అక్షర శ్రీకారం, గోశాల ఏర్పాటు తదితర కార్యక్రమాలు ఆలయ ప్రత్యేకతగా నిలుస్తున్నట్టు చెప్పారు.

Read More విజయదశమి సందర్భంగా దుర్గామాతకు ఘనంగా పూజలు

ఎంతో ప్రాముఖ్యత, విశిష్టత కలిగిన శంభూగిరులపై ఆలయ సముదాయ నిర్మాణం తమ పూర్వజన్మ సుకృతమని అన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ప్రతినిత్యం పండగ వాతావరణం నెలకొంటుండగా, అమ్మవారి క్షేత్ర వైభవం నాలుగు దిశలా వ్యాపించి భక్తుల కొంగుబంగారంగా ఆలయ సముదాయం విలసిల్లుతోందని తెలిపారు. తెలుగు రాష్ట్రాలలో వర్గల్ క్షేత్రాన్ని అగ్రగామిగా నిలపడమే ఏకైక లక్ష్యమని, గత మూడు దశాబ్దాలుగా వివిధ రకాలుగా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ఆలయ కమిటీ రుణపడి ఉంటుందని వివరించారు.

Read More మల్లారెడ్డి ఆసుపత్రి యాజమాన్యంపై కేసు నమోదు చేయాలి

Latest News

సైదాపూర్ మండలం మార్కెట్ కమిటీ చైర్మన్గా దొంత సుధాకర్ సైదాపూర్ మండలం మార్కెట్ కమిటీ చైర్మన్గా దొంత సుధాకర్
జయభేరి, సైదాపూర్ : కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొంతు సుధాకర్ నియామకమయ్యారు. ఈ సందర్భంగా...
వచ్చే 20-25 ఏళ్లపాటు భారతదేశం ప్రపంచాన్ని పరిపాలిస్తుంది. ఇదీ మోదీ అనే అసామాన్య వ్యక్తి సాధించిన విజయం. బీజేపీ కాషెట్టి కుమార్ 
collector vijaya krishnan : ప్రజా సమస్యలకు మండల స్థాయిలోనే పరిష్కారం చూపాలి కలెక్టరు విజయ కృష్ణన్
భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొన్న ఎంపీపీ పైల, మాజీ సర్పంచ్ చుక్కా
ఘనంగా బండారు శ్రీను గురుస్వామి అయ్యప్ప పడిపూజ
పరవాడలో ఘనంగా కార్తీకమాస అన్న సమారాధన కార్యక్రమం