Ranji Trophy 2024 I సెంచరీకి చేరువైన అయ్యర్.. ముషీర్ సెంచరీ.. విదర్భ ఆశలు ఆవిరయ్యాయా..?
వాంఖడే స్టేడియంలో జరుగుతున్న రంజీ ఫైనల్లో ముంబై భారీ ఆధిక్యం దిశగా పయనిస్తోంది.
జయభేరి, హైదరాబాద్ :
వాంఖడే స్టేడియంలో జరుగుతున్న రంజీ ఫైనల్లో ముంబై భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. విదర్భ బౌలర్లను ఉతికి ఆరేస్తూ యువ ఆటగాడు ముషీర్ ఖాన్ (116 నాటౌట్) సెంచరీతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన శ్రేయాస్ అయ్యర్ (86 నాటౌట్) హాఫ్ సెంచరీ సాధించాడు. ముంబై జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. అంజిక్య రహానే జట్టు ప్రస్తుతం 429 పరుగుల ఆధిక్యంలో ఉంది. దాంతో ట్రోఫీపై విదర్భ ఆశలు ఆవిరైనట్లే.
తొలి ఇన్నింగ్స్ లో ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ (75) హాఫ్ సెంచరీతో ముంబై పరువు కాపాడాడు. అనంతరం ధవల్ కులకర్ణి, సామ్స్ ములానీల విజృంభణతో విదర్భ జట్టు 105 పరుగులకే కుప్పకూలింది. దీంతో ముంబైకి తొలి ఇన్నింగ్స్‌లో 119 పరుగుల ఆధిక్యం లభించింది.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ముంబైకి ఓపెనర్లు పృథ్వీ షా (11), భూపెన్ లల్వానీ (18) శుభారంభం అందించారు. వీరిద్దరూ స్వల్ప స్కోరుకే వెనుదిరిగినా అండర్-19 హీరో ముషీర్ ఖాన్, కెప్టెన్ రహానే (73) క్రీజులో నిలిచి విదర్భ బౌలర్లను నిరాశపరిచారు. బౌండరీలతో పాటు సింగిల్స్, డబుల్స్‌తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మూడో రోజు రహానే ఔటైన తర్వాత వచ్చిన అయ్యర్ జోరుగా ఆడాడు. హాఫ్ సెంచరీతో ఫామ్ కనబరిచి ముంబైని పటిష్ట స్థితిలో నిలిపాడు.
Post Comment