IPL : 1000 దాటేసిన సిక్సర్లు

ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ జట్టు అరుదైన ఘనతను సృష్టించుకుంది.

  • హైదరాబాద్ జట్టయితే ఈ ఐపీఎల్ లో ఏకంగా ముంబై పై 277, బెంగళూరు పై 287 రన్స్ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలో ఏ ప్రకారం చూసుకున్నా 17వ సీజన్ అన్ని రికార్డులను బద్దలు కొడుతోంది. ఈ సీజన్లో 13,079 బంతుల్లో బ్యాటర్లు 1000 సిక్సర్లు కొట్టారు.

IPL : 1000 దాటేసిన సిక్సర్లు

జయభేరి, హైదరాబాద్, మే 9 :
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ జట్టు అరుదైన ఘనతను సృష్టించుకుంది. లక్నో, హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో 1000 సిక్సర్ ల మార్క్ దాటింది. దీంతో ఈ సరికొత్త రికార్డుకు హైదరాబాద్ ఉప్పల్ మైదానం వేదికయింది.. వాస్తవానికి ఈ సీజన్లో ఆటగాళ్లు దూకుడుగా ఆడుతున్నారు.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. ఫోర్లు, సిక్స్ లు ఎడా పెడా కొడుతూ బౌలర్లకు నిద్రలేని రాత్రులు పరిచయం చేస్తున్నారు.. హైదరాబాద్ జట్టయితే ఈ ఐపీఎల్ లో ఏకంగా ముంబై పై 277, బెంగళూరు పై 287 రన్స్ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలో ఏ ప్రకారం చూసుకున్నా 17వ సీజన్ అన్ని రికార్డులను బద్దలు కొడుతోంది.

ఈ సీజన్లో 13,079 బంతుల్లో బ్యాటర్లు 1000 సిక్సర్లు కొట్టారు. అంతకుముందు 2022లో 1000 సిక్సర్లు కొట్టేందుకు బ్యాటర్లు 16,269 బంతులను వినియోగించారు. 2023లో 15,390 బంతులను ఎదుర్కొని 1000 సిక్సర్లు బాదారు. ఇప్పటివరకు 57 మ్యాచులు పూర్తయ్యాయి. ఇంకా కొన్ని మ్యాచ్లు మిగిలి ఉన్న నేపథ్యంలో బ్యాటర్లు మరెన్నో సిక్సర్లు కొట్టే అవకాశం ఉంది. ఈ సిక్సర్ల జాబితాలో హైదరాబాద్ జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు ఆటగాళ్లు దూకుడుగా బ్యాటింగ్ చేస్తుండడంతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఫోర్లకంటే సిక్సర్లే ఎక్కువగా కొడుతుండడంతో హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు ఈసారి ప్రత్యేకంగా నిలుస్తున్నారు.

Read More Virat Kohli Century : విరాట్ వీరవిహారం..

హైదరాబాద్ జట్టు ఈసారి 138 సిక్స్ లు కొట్టింది. ఢిల్లీ జట్టు 120 సిక్స్ లు బాదింది. కోల్ కతా 116, ముంబై ఇండియన్స్ 116, బెంగళూరు 114, పంజాబ్ 95, రాజస్థాన్ 94, చెన్నై 82, లక్నో 77, గుజరాత్ 54 సిక్స్ లు కొట్టి తమ సత్తా చాటారు. అయితే ఈసారి ఆటగాళ్లు దూకుడుగా ఆడటం వల్లే ఈ స్థాయిలో సిక్స్ లు నమోదవుతున్నాయని మాజీ క్రికెటర్లు చెబుతున్నారు. అయితే ఈసారి ఇంకా కొన్ని మ్యాచ్లు మిగిలి ఉన్న నేపథ్యంలో.. మరిన్ని సిక్స్ లు నమోదవుతాయని తెలుస్తోంది. బ్యాటర్లు అంతకంతకు దూకుడుగా ఆడుతున్న నేపథ్యంలో సరికొత్త రికార్డులు నెలకొల్పే అవకాశం ఉంది.

Read More భారత్ వి'జయభేరి'

Latest News

గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్ గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలం పాట
తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి
లక్ష 36 వేలకు లడ్డు దక్కించుకున్న సాయి కృష్ణ
పెట్టుబడులకు, నూతన ఆవిష్కరణలకు అనుకూల ప్రాంతం - తెలంగాణ
అద్రాస్ పల్లిలో ఈత వనాల పరిశీలన

Social Links

Related Posts

Post Comment