కడప జిల్లా ఎర్ర చందనం స్మగ్లర్ల అడ్డా...

కడప జిల్లా ఎర్ర చందనం స్మగ్లర్ల అడ్డా...

కడప, సెప్టెంబర్ 13 :
కడప జిల్లాలో మూడు లక్షల హెక్టార్ల అటవీ ప్రాంతముంది. అందులో రెండు లక్షల హెక్టార్లలో ఎర్ర చందనం విస్తరించి ఉన్నది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అత్యంత అరుదైన, విలువైన ఎర్ర చందనం జిల్లా అటవీ విస్తీర్ణంలో మూడువ వంతు విస్తరించి ఉన్నదని.

అందులోనూ లంకమల, పాలకొండలు, శేషాచలం అడవులు మూడు అటవీ ప్రాంతాలూ కడప జిల్లాలో ఉన్నాయి. ఇక్కడ దొరికే ఎర్రచందనంపైనే స్మగ్లర్ల కన్ను. ఎంతో మంది అక్రమార్కులు విలువైన ఎర్ర చందనాన్ని ఎత్తుకెళ్లిపోతున్నారు. కడప జిల్లా పోలీస్‌ శాఖ, అటవీశాఖ సిబ్బంది, విజిలెన్స్‌ తనిఖీల్లో ప్రతి రోజూ ఎర్ర చందనం అక్రమ రవాణా పట్టుబడుతూనే ఉన్నది. అయినా రోజూ స్మగ్లింగ్‌ మాత్రం ఆగడం లేదు. స్మగ్లర్లు కొత్త పుంతలు తొక్కుతున్నారు.విజిలెన్స్‌ శాఖ అధికారులు జరిపిన తనిఖీల్లో స్మగ్లర్ల ఎత్తుగడలు వెలుగు చూస్తున్నాయి. మూడు నెలల క్రితం పోలీస్‌ సిబ్బంది ట్రాన్స్‌పోర్ట్‌ కారులను అద్దెకు తీసుకుని స్మగ్లర్లకు అప్పచెప్పి ఎర్రచందనం రవాణాకు సహకరించిన వైనం బయటపడింది.

Read More జగన్ కు ఆర్ ఆర్ ఆర్ ఉచ్చు

రెండు నెలల క్రితం అటవీశాఖకు సంబంధించిన కొంత మంది వాచర్లు అటవీ సంపదకు కాపలాగా ఉండాల్సింది పోయి హాయిగా ఎర్రచందనం దుంగలను రవాణా చేస్తూ దొరికిపోయారు. ఉమ్మడి కడప జిల్లాలోని మైదుకూరు, బద్వేలు, రైల్వే కోడూరు, రాజంపేట ప్రాంతాల్లోని అటవీ భాగంలో ఎర్ర చందనం ఎక్కువగా ఉన్నది. లంకమల, పాలకొండలు, నల్లమల శేషాచలం అడవులు ఇవన్నీ కూడా కడప పరిసర ప్రాంతాలు కావడంతో ఈ నియోజకవర్గాల్లోని పోలీసులు, అటవీశాఖ సిబ్బందికి ఇదే ఆదాయ వనరుగా మారిపోయింది. స్మగ్లర్లతో చేతులు కలిపి హాయిగా అక్రమ దందా కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి.

Read More స్మార్ట్ కార్డుల్లో ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్సులు

కడప జిల్లాలో 9 ఫారెస్ట్‌ రేంజ్‌లు ఉన్నాయి. కడప, సిద్ధవటం, ఒంటిమిట్ట, బద్వేలు, ప్రొద్దుటూరు, ముద్దనూరు, వనిపెంట, పోరుమామిళ్ల, వేంపల్లెలో ఫారెస్ట్ రేంజ్‌లున్నాయి. ఎర్ర చందనం పరిరక్షణకు ఇద్దరు సబ్‌ డీఎఫ్‌వోలు ఉంటారు. స్వ్కాడ్‌ డివిజన్‌ కూడా ఉంటుంది. ఎర్ర చందనాన్ని పరిరక్షించేందుకు 2వందలకు పైగా అటవీ సిబ్బంది పని చేస్తుంటారు. ఇవిగాక 27 బేస్‌ క్యాంపులున్నాయి. ఒక్కో బేస్‌ క్యాంపులో ఐదుగురు చొప్పున ప్రొటెక్షన్‌ వాచర్లు ఉంటారు. వీరంతా ఎర్ర చందనం స్మగ్లింగ్‌ కాకుండా పెట్రోలింగ్‌ చేస్తుంటారు. జిల్లాలో మొత్తమ్మీద 9 చెక్‌ పోస్టులు ఉన్నాయి. అలాగే ఎస్‌ఈబీ, పోలీస్‌ శాఖ నిఘా కూడా ఉంటుంది.

Read More ఆస్తుల కోసం గొడవలు పెట్టుకోవాలన్న ఉద్దేశం నాకు లేదు.

పగటి పూట బేస్‌ క్యాంప్‌ సిబ్బంది పెట్రోలింగ్‌ చేస్తుంది. నైట్‌ టైం కూడా పెట్రోలింగ్‌ చేస్తూ ఉంటారు. ఇలా ఎంత గట్టి నిఘా పెట్టినా ఎర్రచందనం స్మగ్లింగ్‌ మాత్రం ఆగడం లేదు. లంకమల, పాలకొండల్లో ఎంత నిఘా ఉంచినా.. ఎంట్రీ పాయింట్స్‌ ఎక్కువగా ఉన్నాయని, ఫారెస్ట్‌ ఏరియాల్లో డ్రోన్‌ కెమెరాలను వినియోగిస్తే చాలా హెల్ప్‌ అవుతుందని చెప్పారు. ఈ ఏడాది రెడ్‌ శాండల్‌ ప్రొటెక్షన్‌ స్కీమ్‌లో కూడా డ్రోన్లను ప్రపోజ్‌ చేశామన్నారు. డ్రోన్‌ వాడటం వల్ల ఎంత మంది స్మగ్లర్లు ఉన్నారనేది సులభంగా తెలుసుకోవచ్చని తెలిపారు.

Read More కుప్పంలో వైసీపీ ఖాళీ

ఎర్రచందనం రవాణాలో ఫారెస్ట్‌ సిబ్బంది సహకారం ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటామని గతంలో కొంత మంది సిబ్బందిపై యాక్షన్‌ తీసుకున్నట్టు వెల్లడించారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి కడప జిల్లాకు కొత్తగా వచ్చిన ఎస్‌పీని అడిగితే.. టాస్క్‌ఫోర్స్‌ టీం పనిచేస్తుందని చెప్పారు. నిరంతరం దాడులు చేస్తున్నానమని, ఫారెస్టు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎర్రచందనం అక్రమ రవాణాను అరికడతామన్నారు. పాత స్మగ్లర్లపై నిఘా పెట్టామని, జైలుకు వెళ్లి వచ్చిన వారందరినీ పిలిచి కౌన్సిలింగ్‌ ఇస్తున్నామని తెలిపారు.

Read More వైసీపీలో మండలి చిచ్చు

ఎర్రచందనం మీద కంటిన్యూగా నిఘా పెట్టి అక్రమ రవాణాలో పోలీసు సిబ్బది పాత్ర ఉన్నట్టు తేలితే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడని పెద్దలు ఊరికే చెప్పలేదు.. నిఘా వ్యవస్థలున్నా స్మగ్లింగ్‌ ఆగడం లేదంటే అందుకు ముమ్మాటికి ఇంటిదొంగల సహకారమన్నది సుస్పష్టం. ఈ నిజాన్ని ఎంత త్వరగా గుర్తించి అందుకు తగ్గ చర్యలు తీసుకుంటే అంత మంచిది. లేదంటే పుష్పరాజులే రూల్‌ చేసే ప్రమాదముంది.

Read More తెలంగాణ మంత్రికి వైసీపీ కీల‌క నేత కౌంట‌ర్

Latest News

సైదాపూర్ మండలం మార్కెట్ కమిటీ చైర్మన్గా దొంత సుధాకర్ సైదాపూర్ మండలం మార్కెట్ కమిటీ చైర్మన్గా దొంత సుధాకర్
జయభేరి, సైదాపూర్ : కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొంతు సుధాకర్ నియామకమయ్యారు. ఈ సందర్భంగా...
వచ్చే 20-25 ఏళ్లపాటు భారతదేశం ప్రపంచాన్ని పరిపాలిస్తుంది. ఇదీ మోదీ అనే అసామాన్య వ్యక్తి సాధించిన విజయం. బీజేపీ కాషెట్టి కుమార్ 
collector vijaya krishnan : ప్రజా సమస్యలకు మండల స్థాయిలోనే పరిష్కారం చూపాలి కలెక్టరు విజయ కృష్ణన్
భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొన్న ఎంపీపీ పైల, మాజీ సర్పంచ్ చుక్కా
ఘనంగా బండారు శ్రీను గురుస్వామి అయ్యప్ప పడిపూజ
పరవాడలో ఘనంగా కార్తీకమాస అన్న సమారాధన కార్యక్రమం