Telangan I నవశకానికి నాంది పలుకుదాం.. భవితవ్యం ప్రశ్నార్ధకం... రోజురోజుకు పడిపోతున్న చిన్నపిల్లల వృద్ధి..

దంపతుల్లో ఆర్థిక భారం అనేక సమస్యల ఒత్తిడి వల్ల పిల్లలు కనే సమయాన్ని వాయిదా వేస్తూ సంతోషాల పేరిట జీవితాన్ని గడిపేస్తున్నారు. ఇలా చేయడం వల్ల గత దశాబ్దం నుంచి ఈనాటి వరకు పిల్లల వృద్ధిలో భారతదేశo వెనుకబడిపోతుంది.

Telangan I నవశకానికి నాంది పలుకుదాం.. భవితవ్యం ప్రశ్నార్ధకం... రోజురోజుకు పడిపోతున్న చిన్నపిల్లల వృద్ధి..

జయభేరి, హైదరాబాద్ :

నవీన నాగరిక సమాజంలో ఆర్థిక భారంతో నలిగిపోతున్న కుటుంబాలు నూటికి ఎనభై శాతం మంది ఉన్నట్టు సర్వేలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఆయా దంపతుల్లో ఆర్థిక భారం అనేక సమస్యల ఒత్తిడి వల్ల పిల్లలు కనే సమయాన్ని వాయిదా వేస్తూ సంతోషాల పేరిట జీవితాన్ని గడిపేస్తున్నారు. ఇలా చేయడం వల్ల గత దశాబ్దం నుంచి ఈనాటి వరకు పిల్లల వృద్ధిలో భారతదేశo వెనుకబడిపోతుంది. ఇదే విషయంపై 'జయభేరి' కౌంటర్ విత్ కడారి శ్రీనివాస్ సమగ్ర విశ్లేషణ....

Read More బీరప్పకు బోనమెత్తిన మూత్తిరెడ్డి గూడెం కురుమ, గొల్లలు....

మన జీవన విధానం గ్రామీణ వాతావరణం నుంచి పట్టణ నగర జీవన విధానానికి అలవాటు పడిపోతుంది. ప్రతి ఇంటిలో ఆర్థిక అవసరాలు పెరిగిపోయి మానసిక ఉల్లాసం కొరవడుతోంది. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ 4g 5g సేవలు వినియోగిస్తున్న నాగరికత సమాజంలో అనాగరిక పోకడలకు ఎగబడుతూ నూతన దాంపత్య జీవితంలో సంతోషాలకు సంతృప్తికి వాయిదాలు వేసుకుంటూ సమస్య ల వలలో చిక్కుకుంటున్నారు. దశాబ్దం క్రితం పోల్చుకుంటే నూటికి 60 నుంచి 80% వరకు పిల్లల వృద్ధి జరుగుతున్న మన భారత దేశంలో 2021 నాటికి పిల్లల జనాభా తగ్గుతూ వస్తుందని ఓ సర్వే ప్రకారంగా వెళ్లడవుతోంది. ఒక్కసారి మనం ఆలోచిస్తే నవీన నాగరిక సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న ఈ సమాజంలో చిన్న చిన్న కుటుంబాలుగా ఏర్పడి ఉమ్మడి కుటుంబాలు సమూలంగా దూరమవుతున్నాయి. అమ్మమ్మ నాన్నమ్మ తాతయ్య అత్తమ్మ వదిన మామ చిన్నమ్మ పెద్దమ్మ బాబాయ్ పిన్ని ఇలాంటి రావి వరుసలన్నీ ఉమ్మడి కుటుంబాల్లో ఉండేవి. కానీ ఇప్పుడు అమ్మానాన్న అక్క తమ్ముడు ఇవే కుటుంబాలుగా మిగిలిపోతున్నాయి. దీనికి తోడు ఆర్థిక జీవన విధానం పూర్తిగా మారిపోయి నాగరిక సమాజంలో పల్లె వాతావరణాన్ని విడిచిన జనం పట్టణ వాతావరణంలోకి అలవాటు పడి ఆర్థిక భారంతో కుదేలైపోతున్నారు.. నిన్నటికి నిన్న క్రెడిట్ కార్డు భారంతో అప్పు పెరిగిపోయి వేధింపులు ఎక్కువ ఇద్దరు భార్యాభర్తలు తమకు తామే ఆత్మహత్యకి పాల్పడ్డారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో ఎన్నెన్నో... రోజురోజుకీ ఆత్మహత్యల భారం పెరుగుతూ ఉంటే దంపతుల్లో ఆందోళన మొదలై ఆర్థిక భారం పెనుభూతమై పిల్లలను తర్వాత కందాములే అనే ఆలోచనలతో సంతోషాలకు సుఖాలకు అలవాటు పడిపోతున్నారు.

Read More రాష్ట్ర ఉత్తమ ఆర్టీసీ డ్రైవర్ గా వీవీరెడ్డి

అందరితో ఆగకుండా జీన్స్ పాయింట్ లతో పాశ్చాత్య నాగరికతతో మన ఆధ్యాత్మిక సంస్కృతికి దూరంగా ఉంటూ పెడదూరనితో ఆహారపు అలవాట్లను మార్చి వేస్తూ తమకు తామే పిల్లలు కనే యంత్రాన్న నేను అనే ఒక ఆలోచనకు వచ్చి ఇప్పుడు నాకెందుకులే పిల్లలు అనుకుంటూ జీవితాన్ని నాలుగుపదుల వయసుల్లోకి నెట్టేస్తున్నారు. దీంతో గత దశాబ్ద కాలం నుంచి భారతదేశంలో పసిపిల్లల వృద్ధి అమాంతంగా పడిపోయింది. దీంతో భారతదేశం ఆందోళనలో పడిపోతుంది. ఒకవైపు పేదరికం భారతదేశాన్ని పట్టిపీడిస్తున్న అభివృద్ధి చెందుతున్న దేశంగా భారతదేశం ప్రపంచ దేశాల్లో ప్రత్యేకంగా ప్రజాస్వామ్యం పేరుతో నిలుస్తూ వస్తోంది. ఇది చెప్పుకోవడానికి బాగానే ఉన్నా 75 సంవత్సరాల స్వతంత్ర భారత అవనిలో పేదరికం ఇంకా నిరుపేదలుగా మిగిలిపోతున్న ప్రజలను చూస్తే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి ఏం లాభం అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది...

Read More వినాయక నవరాత్రులు భక్తి, సాంప్రదాయం, సమైక్యతకు ప్రతీకలు...

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరిగి నప్పటి నుంచి రాష్ట్ర జనం రువుదల శాతం తగ్గి ఆత్మహృతి కేసులే ఎక్కువవుతున్నాయి. అలా కావడానికి అనేక కారణాలు ఉన్న ముఖ్యంగా నూతన దంపతుల్లో జీవనపు అలవాట్లు ఆహారపు అలవాట్లు మానసిక ఒత్తిడితో క్రమేపి దంపతుల్లో సంతానోత్పత్తి భారీగా తగ్గుతూ వస్తోంది. నిజానికి ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటే కచ్చితంగా నూతన దంపతుల్లో పెళ్లయిన సంవత్సరంలోపే పిల్లల్ని కనేవారు. కానీ నేడు మారుతున్న కాలానికి మానవ జీవన విధానం మార్పు చెంది ఇప్పుడే పిల్లలు ఎందుకు? కాస్త ఎంజాయ్ చేయనీయండి అంటూ ఆహారపు అలవాట్లు నిద్రలేమి ఆర్థిక భారం మానసిక ఒత్తిడి పెరిగిపోయి అమాంతం నాలుగు పదులు దాటిన పిల్లలు కనే ఓపిక ఈనాటి యువతి యువకుల్లో పూర్తిగా తగ్గుతూ వస్తుంది. అంటే ఇప్పుడే ఎందుకు పిల్లలు అన్న ఆలోచన నుంచి ఈనాటికైనా మనం మార్పు చెందకపోతే ఆధునిక స్వతంత్ర భారత అవనిలో భవిష్యత్తు వృద్ధ భారతదేశంగా మారిన ఆశ్చర్యపోనక్కర్లేదు.

Read More లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ 

ఒకప్పుడు మన భారతదేశం యువత శక్తితో ముందంజలో నడుస్తూ వస్తున్న ఈనాడు తగ్గిపోవడం ఒక కారణం అయితే ప్రస్తుతం ఉన్న యువత చెడు అలవాట్లకు బానిసలై మద్యానికి దగ్గరగా వెళుతూ మత్తు పానీయాలకు అలవాటు పడిపోయి జీవితాన్ని బుద్ధి చేసుకుంటున్న తరం ఒకవైపు ఉంటే మరుగువైపు అసలు చిన్న పిల్లల వృద్ధి తగ్గిపోతుంది అనే ఆందోళన ఇప్పుడు దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యగా మారుతుంది. ఇదిలాగే కొనసాగితే 2100 నాటికి చిన్నపిల్లల వృద్ధి తగ్గిపోయి పూర్తిగా వయసు మళ్ళీన మెదడు కుళ్ళిన జనాభాతో ఈ దేశం పేదరికంతో ఆర్థిక భారంతో పెను సవాళ్లతో దేశం ముందుకి పోతుందా అనే ఆలోచనలకు తెరలేపుతుంది.

Read More రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్‌ మను సింఘ్వీ ఏకగ్రీవ ఎన్నిక

స్వేచ్ఛ స్వాతంత్రాలు ఒకవైపు సంతోషం సుఖం సంతృప్తి ఆనందం మరొకవైపు ఆర్థిక భారం మానసిక ఒత్తిడి సవాళ్లు ప్రతి సవాళ్లు అనేక సమస్యలు పెరిగిపోయి మానవ జీవన విధానం పూర్తిగా గతి తప్పుతోంది.. ఇది మంచి పద్ధతి కాదు. మనం మారకపోతే మన సమాజం మారదు. ముందు మనం మారాలి. మన ఆలోచనలు మారాలి. మీరు నేను మనందరం కలిస్తేనే ఈ సమస్యకు ఓ పరిష్కారం దొరుకుతుంది. భారతదేశంలోని ప్రజలు కూడా ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి కచ్చితంగా చిన్న పిల్లల వృద్ధి పెరిగేలా చూసుకోవాలి వారి భవిష్యత్తుకు బంగరు బాట వేసే లాగున ప్రభుత్వంతో ప్రజలు మమేకమై భారతదేశం అభివృద్ధికి నడుం కట్టాలి.... అప్పుడే దేశం అన్ని రంగాల్లో ముందుకు పోతూ విజయ తీరానికి తెర లేపుతోంది.... ఆ దిశగా మనం మారుతూ మన ఆలోచనలకు పదును పెడుతూ నలుగురికి ఈ విషయాన్ని తెలియజేస్తూ మరో నవశకానికి నాంది పలుకుదాం...

Read More దేవరకొండ ఆసుపత్రిలో ఆరుగురు సిబ్బంది తొలగింపు

...కడారి శ్రీనివాస్ 
కాలమిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, కవి, రచయిత

Read More అద్రాస్ పల్లిలో ఈత వనాల పరిశీలన

Latest News

గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్ గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలం పాట
తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి
లక్ష 36 వేలకు లడ్డు దక్కించుకున్న సాయి కృష్ణ
పెట్టుబడులకు, నూతన ఆవిష్కరణలకు అనుకూల ప్రాంతం - తెలంగాణ
అద్రాస్ పల్లిలో ఈత వనాల పరిశీలన