School : పాఠశాలల్లో చదవడం తప్పనిసరి సబ్జెక్టుగా మార్చాలి
మంచి పుస్తక పఠనం లో మునిగి పోవడానికి రీడింగ్ కార్నర్లు సరైన ప్రదేశాలు: టి.ఆల్ఫోన్స్ రెడ్డి, పాఠశాల కరస్పాండెంట్.
పుస్తక పఠనం ముందెన్నడూ ఇంత ఆసక్తి కరంగం అనిపించలేదు : చాలా మంది పిల్లలు, తల్లిదండ్రులు వ్యాఖ్యానించారు
సెయింట్ పీటర్స్ హై స్కూల్ మొత్తం క్యాంపస్ను బీచ్ రీడింగ్ కార్నర్, రెయిన్బో రీడింగ్ కార్నర్, అడ్వెంచర్ రీడింగ్ కార్నర్ మొదలైన సృజనాత్మక, ఉత్తేజకరమైన రీడింగ్ కార్నర్లుగా మార్చింది.
చాలా ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు అందుబాటులో ఉన్నందున 'టీనేజర్లు' 'స్క్రీనేజర్లుగా' మారుతున్నారు
'DEAR' నగరంలోని ఓ పాఠశాల ద్వారా రూపొందించబడిన ఒక వినూత్న చొరవకు అద్భుతమైన స్పందన లభించింది, 1200 మంది పిల్లలు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. డియర్ -డ్రాప్ ఎవ్రీథింగ్ అండ్ రీడ్(అన్ని వదిలేసి పుషక పఠనం చేయండి అనే చొరవతో ) , బోవెన్పల్లిలోని సెయింట్ పీటర్స్ హైస్కూల్ యొక్క వినూత్న చొరవ కు విశేష స్పందన లభించింది.
1200 కంటే ఎక్కువ మంది నర్సరీ నుండి 5వ తరగతి వరకు పిల్లలు తల్లిదండ్రుల తో కలిసి శనివారం ఉదయం ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. డియర్ అనగా "ప్రతిదీ వదలండి.. చదవండి" అని అర్ధం, ఇది పుస్తక పఠన వేడుక, ఇది వారి పిల్లల జీవితాలలో పఠనాన్ని ప్రాధాన్యతా కార్యకలాపంగా మార్చాలని తల్లిదండ్రులకు గుర్తు చేయడానికి ఉద్దేశించబడింది.
ఈ కార్యక్రమం విద్యార్థులకు అక్కడ కూర్చుని చదవడం కంటే చాలా ఎక్కువ అనుభవం అందించింది. మొత్తం పాఠశాల ప్రాంగణం అనేక సృజనాత్మక పఠన రంగాలు, మూలలు, ప్రదేశాలుగా మార్చబడింది. అన్నీ చాలా ఆకర్షణీయంగా అలంకరించబడ్డాయి.
విరామ రీడింగ్ కోసం బీచ్ కార్నర్ ఉంది, దాని కోసం ఒక ఊయల, తాడు ఊయల ఏర్పాటు చేయబడింది. జంగిల్ రీడింగ్ కార్నర్ మరో ఆకర్షణ. ఇది సాహసోపేతమైన పఠన అనుభవం కోసం ఏర్పాటు చేయబడింది. పాఠశాల, ఉపాధ్యాయులు పఠన మూలలను సాధ్యమైనంత సృజనాత్మకంగా చేయడానికి, పిల్లలను దీర్ఘకాలిక పఠన అనుభవాన్ని కలిగి ఉండేలా ప్రోత్సహించడానికి వీలైనంతగా స్ఫూర్తిదాయకంగా చేయడానికి చాలా కృషి చేశారు.
మంచి పుస్తకంలో దూరేందుకు, నిమగ్నమై పోయేందుకు రీడింగ్ కార్నర్స్ సరైన ప్రదేశమని పాఠశాల కరస్పాండెంట్ టి.అల్ఫోన్స్ రెడ్డి అన్నారు. థీమ్ ఆధారిత రీడింగ్ కార్నర్లు ఏర్పాటు చేయబడ్డాయి, ఇక్కడ పిల్లలు వారి తల్లిదండ్రులతో కలిసి పుస్తక పఠనం చేశారని పాఠశాల కరస్పాండెంట్ Mr T. ఆల్ఫోన్స్ రెడ్డి తెలిపారు. ఉపాధ్యాయులు కష్టపడి సృష్టించిన కలలు కనే రీడింగ్ కార్నర్లు ఊహించలేని రీడింగ్ కార్నర్లను ఏర్పాటుచేయడం వల్ల పిల్లలు సమయాన్ని గడపడానికి ఇష్టపదినారు.
పఠన అనుభవంలో మునిగిపోయారు, అని Ms లిల్లీ రెబెక్కా, ఓ పిల్లవాడి తల్లి అన్నారు. పఠనం ఎప్పుడూ అంత ఉత్తేజకరమైనది నాకు ఎప్పుడు లేకుండుంది అని నాల్గవ తరగతి చదువుతున్న అలిన్ అనే పిల్లాడు చెప్పాడు. పరికరాలు, డిజిటల్ గాడ్జెట్ల నుండి పిల్లల దృష్టిని మరల్చడానికి, వారికి చాలా ముఖ్యమైన నైపుణ్యాన్ని నేర్పడానికి, పాఠశాలల్లో చదవడం తప్పనిసరి సబ్జెక్ట్గా ప్రవేశపెట్టాలని చాలా మంది తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు.
చదవడం ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. కాబట్టి, పిల్లలు తమ పుస్తకాల ద్వారా అన్వేషించడానికి ఎదురుచూడడానికి బహిరంగ ప్రదేశాలను అద్భుతమైన రీడింగ్ కార్నర్లుగా మార్చడం ద్వారా వారు పఠనాన్ని సరదాగా చేసారు, అని ఒక బిడ్డ తల్లి పావని తెలిపారు. కొన్ని రీడింగ్ కార్నర్లలో పుస్తకాలు, మ్యాగజైన్లు, పీరియాడికల్స్ తో కూడిన లైబ్రరీ ఏర్పాటుచే చేయబడింది. పిల్లలు, తల్లిదండ్రుల నుంచి వస్తున్న స్పందన, ఉత్సాహాన్ని చూసి ఇక నుంచి ప్రతి నెలా మొదటి శనివారం దీన్ని పుస్తక పఠన దినోత్సవం నిర్వహిస్తామని పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె సువర్ణ తెలిపారు.
సెయింట్ పీటర్స్ హైస్కూల్ బహుశా భారతదేశంలో 'చదవడాన్ని' ఒక సబ్జెక్ట్గా లేదా "పఠనం'ని దాని పాఠ్యాంశాల్లో ఒక పీరియడ్గా పరిచయం చేసిన ఏకైక పాఠశాల. మొబైల్, టీవీలు, టాబ్లెట్లు, PC, ల్యాప్టాప్లు, నోట్బుక్లు, OTT, మూవీ స్క్రీన్లు, ఇతర అనేక ఎలక్ట్రానిక్ పరికరాలతో, "టీనేజర్లు" "స్క్రీనేజర్లు" అయ్యారు. ఇది మారాలి అని, చొరవలో పాల్గొన్న చాలా మంది తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు.
Post Comment