Sri Lanka vs Bangladesh : ఒక్క సెంచరీ లేకుండా 500 పరుగులు!
48 ఏళ్ల టీమ్ ఇండియా రికార్డు బ్రేక్..
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక జట్టు 48 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. టీమ్ ఇండియా పేరిట ఉన్న రికార్డు బద్దలైంది.
శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ టెస్టు..
మార్చి 30న చిట్టగాంగ్ వేదికగా శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 159 ఓవర్లలో 531 పరుగులు చేసి ఆలౌటైంది. కానీ ఆ జట్టులో ఎవరూ సెంచరీ చేయలేదు. ఆరుగురు బ్యాట్స్‌మెన్ హాఫ్ సెంచరీ చేశారు అంతే! జట్టులో కుశాల్ మెండిస్ అత్యధిక పరుగులు (93) చేశాడు. కమిందు మెండిస్ 92 పరుగులు చేశాడు.
48 ఏళ్ల క్రితం భారత్ నెలకొల్పిన రికార్డును తాజాగా శ్రీలంక జట్టు బద్దలు కొట్టింది. 1976లో కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 9 వికెట్ల నష్టానికి 524 పరుగులు చేసింది. సెంచరీ నమోదు చేయకుండానే జట్టు స్కోరు 500 దాటింది. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక ఆలౌటైన తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన బంగ్లాదేశ్ జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 55 పరుగులు చేసింది.
శ్రీలంక బ్యాటర్ల స్కోర్లు ఇలా..
నిషాన్ మదుష్క- 57, కరుణరత్న- 86, కుశాల్ మెండిస్- 93, మాథ్యూస్- 23, చండిమాల్- 49, ధనుంజయ డి సెల్వ- 70, కమిందు మెండిస్- 92 (నాటౌట్), ప్రభాత్ జయసూర్య- 28, విశ్వ ఫెర్నాండో- 11, లహిరు కుమార- 6, అషితా ఫెర్నాండో- 0
కమిందు మెండిస్‌కు సెంచరీ చేసే అవకాశం లభించింది. కానీ ఆఖరి బ్యాట్స్ మెన్ అషిత డకౌట్ కావడంతో సెంచరీ కొట్టలేకపోయింది. 92 పరుగుల వద్ద స్థిరపడ్డాడు.
ఎక్స్ ట్రాలు కూడా తక్కువే (6) కావడం విశేషం!
బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబ్ ఉల్ హసన్ మూడు వికెట్లు తీశాడు. హనాస్ మహ్మ్ 2 వికెట్లు తీశాడు. ఖలీద్ అహ్మద్, మెహదీ హసన్ చెరో వికెట్ తీశారు. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో శ్రీలంక ఇప్పటికే ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది. రెండో మ్యాచ్‌లో గెలిస్తే బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను బంగ్లాదేశ్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది.
Post Comment