ముఖ్యమంత్రి సహాయ నిది నిరుపేదలకు వరం.. 

మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్

ముఖ్యమంత్రి సహాయ నిది నిరుపేదలకు వరం.. 

జయభేరి, గజ్వేల్, అక్టోబర్ 06 : గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామానికి చెందిన పలువురికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సహకారంతో గతంలో అనారోగ్యంతో బాధపడి ఉండగా వారికి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం సిఎంఆర్ నిధుల నుండి మంజూరు అయిన చెక్కులను లబ్ధిదారులైన శిగుళ్ల మల్లేశం 50000, కె వినోద 34500  రూపాయలు వారికి ఆదివారం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు ఒక వరం లాంటిదాని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమలు అమలు చేసి స్వర్గయుగం తీసుకోచిందని నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కానీ హామీలను  ప్రజలకు గుప్పించి అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతున్న ఇచ్చిన హామీలను విస్మరిస్తుందని విమర్శించారు. వెంటనే  ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల చేసిన రుణమాఫీ తూతూ మంత్రంగా చేసిందని ఇంకా చాలా మంది రైతులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్న పట్టనట్టు రేవంత్ ప్రభుత్వం ఉందని తెలిపారు.

Read More ఐయన్టీయుసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మొగుళ్ల రాజి రెడ్డి నియామకం.

వెంటనే ప్రతి ఒక్కరికి లబ్ది చేకూరే విదంగా చర్యలు తీసుకోవాలని కోరారు. వానాకాలం పంటకు సంబంధించి ఇప్పటివరకు  రైతు బంధు నిధులు వేయలేదని వెంటనే రైతుల ఖాతాలలో జామచేయాలని డిమాండ్ చేశారు. రైతులకు పంట పెట్టుబడి సహాయం గురించి కాంగ్రెస్ నోరు మెదపడం లేదని అన్నారు ప్రజా ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్నా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేస్తోందని దుయ్యబట్టారు.

Read More 2027లో దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు..!!

మీడియా సాక్షిగా మంత్రులే పూటకు ఓక మాట మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. సభా సంప్రదాయాలను తుంగలో తొక్కుతూ,  ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరి గర్హనీయమని  విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రతిపక్ష హోదాలో ఉన్న మేము అందరం అమలు చేసే వరకు ప్రజా పోరాటాలు చేస్తామని అన్నారు.  

Read More TGPSC Group-1 2024: రేపటి నుంచి టీజీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ హాల్‌టికెట్లు.. మరి పరీక్షలు..!!

అధికారం ఎవరికీ శాశ్వతం కాదనే విషయాన్ని కాంగ్రెస్ నేతలు విస్మరించారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను గుర్తు చేస్తూ ప్రజల తరపున ఉంటామని అన్నారు.తెలంగాణ రాష్ట్రనికి ఎన్నికలు ఎప్పుడు జరిగినా కేసీఆర్ సీఎం అవుతారని అన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల కుటుంబీకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావుకు  కృతజ్ఞతలు తెలిపారు.

Read More 20,72,5000 రూపాయల సిఎంఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే

ఈ కార్యక్రమంలో రైతుబందు మాజీ మండల అధ్యక్షుడు మద్ది రాజిరెడ్డి, ప్యాక్స్ డైరెక్టర్ చడా శ్రీనివాస్ రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్, మాజీ కో అప్షన్ అహ్మద్, గ్రామ పార్టీ అధ్యక్షుడు నిజామోద్దీన్, నాయకులు రామగౌడ్, బాలయ్య, సత్యగౌడ్, ఆగయ్య, శ్రీనివాస్, రాములు గౌడ్, నాంపల్లి, ముత్యం గౌడ్,కిష్టారెడ్డి, లచ్చిరెడ్డి, అశోక్ రెడ్డి, బుచ్చిరెడ్డి, రాజు, స్వామి, లబ్ధిదారుల కుటుంబాలు పాల్గొన్నారు..

Read More అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతదేహం లభ్యం

Latest News

సైదాపూర్ మండలం మార్కెట్ కమిటీ చైర్మన్గా దొంత సుధాకర్ సైదాపూర్ మండలం మార్కెట్ కమిటీ చైర్మన్గా దొంత సుధాకర్
జయభేరి, సైదాపూర్ : కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొంతు సుధాకర్ నియామకమయ్యారు. ఈ సందర్భంగా...
వచ్చే 20-25 ఏళ్లపాటు భారతదేశం ప్రపంచాన్ని పరిపాలిస్తుంది. ఇదీ మోదీ అనే అసామాన్య వ్యక్తి సాధించిన విజయం. బీజేపీ కాషెట్టి కుమార్ 
collector vijaya krishnan : ప్రజా సమస్యలకు మండల స్థాయిలోనే పరిష్కారం చూపాలి కలెక్టరు విజయ కృష్ణన్
భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొన్న ఎంపీపీ పైల, మాజీ సర్పంచ్ చుక్కా
ఘనంగా బండారు శ్రీను గురుస్వామి అయ్యప్ప పడిపూజ
పరవాడలో ఘనంగా కార్తీకమాస అన్న సమారాధన కార్యక్రమం