ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి....
ఎంఈఎఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేబర్తి యాదగిరి మాదిగ
జయభేరి, గజ్వేల్, అక్టోబర్ 06 :
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణం లో విలేకరుల సమావేశంలో ఎంఈఎఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేబర్తి యాదగిరి మాదిగ మాట్లాడుతూ ప్రస్తుతం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ప్రక్రియ వెంటనే అమలు చేయాలని. ఎస్సీ ఉప కులాలు సహకరించాలన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని వర్గీకరణ అమలు చేసి తన చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు.
దళితులలోని మేధావి వర్గం వివిధ సంఘాలు అలాగే మాదిగ,మాదిగ ఉపకులాల సంఘాలు అందరూ గౌరవ శ్రీ మంద కృష్ణమాదిగ నాయకత్వంలో ముందుకు సాగాలని తెలిపారు. దాదాపుగా 18 నుండి 20 శాతం ఉన్నటువంటి దళితులంతా ఒక్కటై రాజ్యాధికారం దిశగా కలిసి రావాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాదిగ ఉద్యోగుల సమాఖ్య తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉప్పరిపల్లి నాగభూషణం మాదిగ, ఆర్గనైజింగ్ సెక్రటరీ పోతగల్ల మహేష్ మాదిగ, ఎర్రోళ్ల గంగాధర్ మాదిగ, మాచపురం యాదయ్య మాదిగ, గజ్వేల్ నియోజకవర్గం నాయకులు పాల్గొన్నారు.
Post Comment