ఘనంగా రొట్టెల పండుగ
కోర్కెల రొట్టెలు ఇక్కడ పలు రకాల రొట్టెలు పంపిణీ జరుగుతుంది. ఆరోగ్య రొట్టె, కల్యాణ రొట్టె, విద్యా రొట్టె, వ్యాపార రొట్టె, ఉద్యోగ రొట్టె, సంతాన రొట్టె ఇలా అనేక రకాల రొట్టెలు ఉంటాయి. ఏ కోర్కె కోరుకుంటే ఆరొట్టె తీసుకుంటారు. కోర్కె తీరిన వారు వచ్చే ఏడాది రొట్టెల పండుగ నాడు తిరిగి ఇదే రొట్టెను చెల్లిస్తారు.
నెల్లూరు, జూలై 18 :
మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన నెల్లూరు భార షాహిద్ దర్గా రొట్టెల పండుగ మెదలైంది. ఇప్పటికె రొట్టెల పండుగకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ప్రతి సంవత్సరం మోహరం తరువాత రోజు రొట్టెల పండుగను నిర్వహించడం జరుగుతుంది..
పండుగకు వచ్చే భక్తులకు మంచి నీరు, భోజనం, పార్కింగ్ పై ప్రత్యేక దృష్టి సారించారు అధికారులు. కోర్కెల రొట్టెలు ఇక్కడ పలు రకాల రొట్టెలు పంపిణీ జరుగుతుంది. ఆరోగ్య రొట్టె, కల్యాణ రొట్టె, విద్యా రొట్టె, వ్యాపార రొట్టె, ఉద్యోగ రొట్టె, సంతాన రొట్టె ఇలా అనేక రకాల రొట్టెలు ఉంటాయి. ఏ కోర్కె కోరుకుంటే ఆరొట్టె తీసుకుంటారు. కోర్కె తీరిన వారు వచ్చే ఏడాది రొట్టెల పండుగ నాడు తిరిగి ఇదే రొట్టెను చెల్లిస్తారు. ఎవరికైతే ఆ రొట్టె కావాలో వారు తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇదే రొట్టెల పండుగ పద్ధతి. రొట్టెల పండుగ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడ ఏ రొట్టె అందుబాటులో ఉందో తెలిసేలా స్వర్ణాల చెరువులో ప్రత్యేక ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగురు నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
అందుకు తగ్గట్టు గానే అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గత టీడీపీ ప్రభుత్వంలో మంత్రి నారాయణ, రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిగా ఉన్న సమయంలో రొట్టెల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించారు. అయితే మరోసారి టీడీపీ అధికారంలోకి రావడం నారాయణ మంత్రిగా, శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే గా ఉండడంతో మరోసారి రొట్టెల పండుగను విజయ వంతం చేసేందుకు ఆధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. రొట్టల పండుగకు పది లక్షల మందికి పైగా భక్తులు తరలివస్తారనే అంచనాలతో ఆ దిశగా ఏర్పాట్లు చేశారు అధికారులు.. అధికార యంత్రాంగం తో పాటు టీడీపీ నేతలు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు ఏర్పాట్లు పరిశీలించేలా ప్రణాళిక సిద్ధం చేశారు.
Post Comment