దాదాపు 70 వేల కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో చమురు శుద్ధి కర్మాగారం

చంద్రబాబుతన ఎక్స్(ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. దేశానికి తూర్పు తీరంలో వ్యూహాత్మకంగా ఉన్న రాష్ట్రంలో గణనీయమైన పెట్రోకెమికల్ సామర్థ్యం కలిగి ఉందని ఏపీ ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 5,000 ఎకరాల భూమి అవసరమవుతున్నందున 90 రోజుల్లో సాధ్యాసాధ్యాలపై వివరాణ్నత్మాక ప్రణాళికతో కూడిన సమగ్ర నివేదిక కోరినట్లు వెల్లడించారు.

దాదాపు 70 వేల కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో చమురు శుద్ధి కర్మాగారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 70 వేల కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో చమురు శుద్ధి కర్మాగారం,పెట్రోకెమికల్ కారిడార్ ఏర్పాటుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. బుధవారం భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ కుమార్ నేతృత్వంలోని ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు.

ఈ భేటీ అనంతరం వివరాలను చంద్రబాబుతన ఎక్స్(ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. దేశానికి తూర్పు తీరంలో వ్యూహాత్మకంగా ఉన్న రాష్ట్రంలో గణనీయమైన పెట్రోకెమికల్ సామర్థ్యం కలిగి ఉందని ఏపీ ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 5,000 ఎకరాల భూమి అవసరమవుతున్నందున 90 రోజుల్లో సాధ్యాసాధ్యాలపై వివరాణ్నత్మాక ప్రణాళికతో కూడిన సమగ్ర నివేదిక కోరినట్లు వెల్లడించారు. ఇబ్బంది లేని పద్ధతిలో సౌకర్యాలు కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎదురుచూస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

Read More కడప జిల్లా ఎర్ర చందనం స్మగ్లర్ల అడ్డా...

ఇది ఇలావుండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయవలసిందిగా విన్ ఫాస్ట్ సీఈవోను ఆహ్వానించిన్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వియత్నాంకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ విన్‌ఫాస్ట్(Winfast) సీఈవో ఫామ్ సాన్ చౌతో సానుకూల చర్చలు జరిగాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తమ పరిశ్రమ ఏర్పాటుకు అనువైన భూమి పరిశీలించాలని పరిశ్రమల శాఖను సీఎం చంద్రబాబు అదేశించారు. విన్‌ఫాస్ట్ నుంచి సానుకూల సహకారం కోసం ఎదురు చూస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.

Read More జగన్ కు ఆర్ ఆర్ ఆర్ ఉచ్చు

Latest News

గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్ గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలం పాట
తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి
లక్ష 36 వేలకు లడ్డు దక్కించుకున్న సాయి కృష్ణ
పెట్టుబడులకు, నూతన ఆవిష్కరణలకు అనుకూల ప్రాంతం - తెలంగాణ
అద్రాస్ పల్లిలో ఈత వనాల పరిశీలన