Media : వ్యవసల్థను నిలబెట్టేది మీడియానే...!

సార్వత్రిక ఎన్నికలు`మీడియా పాత్ర’ అనే అంశంపై సదస్సు... ఐజేయూ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డిని సన్మానించిన జర్నలిస్టులు, ప్రజాసంఘాలు.

Media : వ్యవసల్థను నిలబెట్టేది మీడియానే...!

జయభేరి, విజయవాడ:

సమాజంలో మార్పు తీసుకురాగల శక్తి జర్నలిజానికి ఉందని, పతనమవుతున్న వ్యవస్థలను నిలబెట్టేది మీడియాకేనని ఇండియా జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) జాతీయ అధ్యక్షుడు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి ఉద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఏపీడబ్ల్యూజే) ఆధ్వర్యంలో 'సాధారణ ఎన్నికలు- మీడియా పాత్ర' అనే అంశంపై నిర్వహించిన సదస్సుల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. స్థానిక గాంధీనగర్ లోని శ్రీరామ ఫంక్షన్ హాల్ లో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు అధ్యక్షతన ఆదివారం సదస్సు జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి వందల కోట్లు ఖర్చు చేస్తున్నా ఎన్నికల సంఘం కళ్లకు గంతలు కట్టిందన్నారు. మీడియాలో వార్తలు వస్తున్నా వాస్తవాలు వెల్లడించేందుకు వెనుకాడుతున్నారని అన్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కనీస ఖర్చు రూ.10,702 కోట్లు కాగా ఎన్నికల్లో డబ్బుకు ప్రాధాన్యత పెరిగిందన్నారు. ఎన్నికల బ్యాండ్ల ద్వారా రాజకీయ పార్టీలు డబ్బు సంపాదిస్తున్నాయన్నారు.

Read More కొనే వారు లేదు.. అమ్మేవాళ్లు గోళ్లు గిల్లుకుంటున్నారు

అంతేకాకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఐటి, ఇడి, సిబిఐ సంస్థల దాడుల ద్వారా వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాయని అన్నారు. దేశంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న 23 శాతం మంది ఓటు వేయడానికి డబ్బు ఆశ చూపి ఉండవచ్చని, అయితే ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడానికి విద్యావంతులు సైతం డబ్బులు తీసుకోవడం దారుణమని అన్నారు. పత్రికా స్వేచ్ఛ. హక్కుల కోసం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉందని ఎలక్ట్రానిక్ మీడియాకు అలాంటి వ్యవస్థ లేకపోవడం శోచనీయమన్నారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాను ఒకే వ్యవస్థగా తీసుకుని మీడియా కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చామన్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా బయటకు తీసుకురాలేని వాస్తవాలు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వస్తున్నాయన్నారు. స్వీయ నియంత్రణ అవసరమయ్యే సామాజిక మాధ్యమాల్లో అలసత్వం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. వర్కింగ్ జర్నలిస్టుల చట్టాన్ని కేంద్రం రద్దు చేసి జర్నలిస్టులను మెడికల్ రిప్రజెంటేటివ్ కేటగిరీలో చేర్చిందన్నారు. జర్నలిస్టులు యజమానుల పేర్లను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై క్రిమినల్ కేసులు, అభియోగాలు ఉంటే ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉందన్నారు. ప్రజాస్వామ్యానికి మీడియా కళ్లు అని స్పష్టం చేశారు.

Read More జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన, దాడులకు పాల్పడిన పార్టీ నుంచి బహిష్కరిస్తాం

సిటిజన్ ఫర్ డెమోక్రసీ జాయింట్ సెక్రటరీ వి.లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల్లో ధనానికి ప్రాధాన్యత ఉండటంతో 5 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో 25 మంది లోక్ సభ అభ్యర్థులకు 100 కుటుంబాలు, 175 మంది అసెంబ్లీ అభ్యర్థులకు 600 కుటుంబాలు మాత్రమే పోటీ చేస్తున్నాయన్నారు. ఎన్నికల్లో మద్యం ఖర్చు ఎక్కువగా ఉందన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇస్తున్న ఉచిత మద్యానికి చాలా మంది యువకులు మద్యానికి బానిసలుగా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం తీసుకుంటూ వలంటీర్‌ వ్యవస్థకు ఓటేయాలని కోరడం సమంజసం కాదన్నారు. మీడియా ఎప్పుడూ స్వతంత్రంగా పని చేయలేదని, మీడియా యాజమాన్యం ప్రకారం జర్నలిస్టులు పనిచేస్తారని అన్నారు. అయితే సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, మంచి పనులు మీడియా ద్వారానే వెలుగులోకి వస్తున్నాయన్నారు.

Read More బీజేపికి... ఆశాకిరణమేనా

ప్రొఫెసర్ ఎంసీ దాస్ మాట్లాడుతూ.. ఓటు హక్కు, ఓటు బాధ్యతపై మీడియా సంస్థలు ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కొన్ని దేశాల్లో ఓటు వేయకుంటే వారిపై ఆంక్షలు విధించే ఆచారం ఉందన్నారు. మన దేశంలో దాదాపు 60 మోసాలను మీడియా బయటపెట్టిందని అన్నారు. జర్నలిస్టులకు కనీస వేతన చట్టం, రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. రాజ్యాంగ ఉల్లంఘన జరిగిన చోట సుప్రీంకోర్టు న్యాయపరమైన రక్షణ కల్పిస్తేనే జర్నలిస్టులకు ధైర్యం వస్తుందన్నారు.

Read More 11 నుంచి ఏపీ బడ్జెట్ భేటీ

ఐజేయూ కార్యదర్శి డి.సోమసుందర్‌ మాట్లాడుతూ.. మీడియా కమిషన్‌, వేజ్‌ బోర్డు ఏర్పాటు చేసి జర్నలిస్టులకు రక్షణ కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. మీడియాలో రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు ఉన్నాయని, అందులో 86 శాతం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ చేతుల్లోనే ఉందన్నారు. పెయిడ్ న్యూస్ లాగా మీడియాలో జరుగుతున్న అవినీతిని ఐజేయూ, ఏపీయూడబ్ల్యూజే సంఘాలు బట్టబయలు చేశాయన్నారు. ప్రజా సంఘాలు చురుగ్గా ఉంటేనే మీడియాకు స్వేచ్ఛ ఉంటుందన్నారు.

Read More 7న మద్యం షాపుల బంద్

ఐజేయూ కార్యవర్గ సభ్యులు ఆలపాటి సురేశ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి మీడియా యాజమాన్యాలు, జర్నలిస్టులు డబ్బులు తీసుకుని విమర్శిస్తూ వార్తలు రాయడం భావ్యం కాదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓటరుకు మంచి సమాచారం అందించలేక ప్రజాస్వామ్యానికి ద్రోహం చేస్తున్నారన్నారు. విదేశాల్లో డిజిటల్ మీడియా పెరగడం వల్ల ఓటింగ్, ఎన్నికల విధానంపై ప్రజల్లో నమ్మకం పెరిగిందన్నారు.
ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్ మాట్లాడారు. ఏపీయూడబ్ల్యూజే విజయవాడ యూనిట్ అధ్యక్షుడు చావ రవి అతిథులకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ జర్నలిస్టు ఎస్‌కే బాబు, రామసుబ్బారెడ్డి, ఎలక్ట్రానిక్‌ మీడియా అసోసియేషన్‌ అధ్యక్షుడు ఏల్చూరి శివ, విజయవాడ ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు కంచర్ల జయరాజు, కార్యదర్శి దాసరి నాగరాజు, సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి, ఫొటో జర్నలిస్టు యూనియన్‌ అధ్యక్షుడు విజయభాస్కర్‌, ప్రధాన కార్యదర్శి రూబిన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read More మద్యం ధరలపై ఏపీలో చట్ట సవరణ..

2113cf5f-0494-40a3-a58b-6427d1e59191

Read More ఐరాస సమావేశాలకు ఎంపీ శబరికి ఆహ్వానం

శ్రీనివాసరెడ్డికి ఘన సన్మానం:
తెలంగాణ మీడియా అకాడమీ బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా విజయవాడ వచ్చిన కె.శ్రీనివాసరెడ్డిని జర్నలిస్టుల సంఘాలు, ప్రజా సంఘాల ప్రతినిధులు సన్మానించారు. విశాలాంధ్ర ఎడిటోరియల్ బోర్డు చైర్మన్ కె.రామకృష్ణ, విశాలాంధ్ర విజ్ఞాన సమితి చైర్మన్ ముప్పాళ్ల నాగేశ్వరరావు శ్రీనివాసరెడ్డికి పుష్పగుచ్ఛం అందించి దుశ్శాలువాతో సత్కరించారు. విశాలాంధ్ర ఉద్యోగుల సంఘం కార్యదర్శి ఎం.మురళీకృష్ణ ఆధ్వర్యంలో విశాలాంధ్ర ఉద్యోగులను సన్మానించారు. వీరితో పాటు విజయవాడ నగరంలోని వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు శ్రీనివాసరెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా సి.రాఘవాచారి రచించిన సంపాదకీయాలు మూడో సంపుటి ‘రాజ్యాంగం, న్యాయస్థానాలు, చట్టసభలు’ పుస్తకాన్ని సి.రాఘవాచారి ట్రస్టు సభ్యులు బి.జమందర్ , అక్కినేని చంద్రరావు శ్రీనివాసరెడ్డి అందించారు.

Read More రైతు, కార్మికుల సమస్యలపై దేశ వ్యాప్త ఆందోళన జయప్రదం చెయ్యండి 

Latest News

విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం
జయభేరి, మేడిపల్లి : రాచకొండ పోలీస్ కమిషనరేట్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుడమి హై స్కూల్ బోడుప్పల్ లో మేడిపల్లి పోలీస్ వారి ఆధ్వర్యంలో ట్రాఫిక్...
యాద్గారపల్లి చౌరస్తా లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ నాయకులు
ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు
ప్రజా పాలన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన మొదటి సంవత్సరం అభివృద్ధి పనుల వివరాలు...
ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి 
మొద్దు నిద్రలో రేవంత్ సర్కారు

Social Links

Post Comment