పులస క్రేజ్... మాములుగా లేదుగా 2 కేజీల పులస - రూ. 24 వేలు…

కేవ‌లం రెండు కేజీల పుల‌స చేప‌ను ఆ మ‌త్స్య‌కారులు ఏకంగా రూ.24 వేల‌కు అమ్మారు. కోన‌సీమ జిల్లా మ‌లికిపురం మండ‌లం రామ‌రాజులంక బాడవ‌లో శ్రీ‌ను అనే మ‌త్స్య‌కారుడు, మ‌రో మ‌త్స్య‌కారుడితో క‌లిసి చిన్న బోటుపై శుక్ర‌వారం చేప‌ల వేట‌కు గోదావ‌రి న‌దిలోకి వెళ్లాడు.

పులస క్రేజ్... మాములుగా లేదుగా 2 కేజీల పులస - రూ. 24 వేలు…

కాకినాడ, జూలై 13 :
రెండు కేజీల చేప ధ‌ర ఎంతుంటాది…! మ‌హా అయితే 300 లేదా 400 ఉంటుంది. కానీ రెండు కేజీల చేప‌ ఏకంగా రూ.24 వేలంట‌…!  నిజ‌మే రెండు కేజీల చేప ధ‌ర ఏకంగా రూ.24 వేల ధర పలికింది. అది మామూల చేప కాదు… పుల‌స చేప‌.

కోన‌సీమ‌ జిల్లాలో గోదావ‌రి న‌దిలో చేప‌ల వేట‌లో మ‌త్స్య‌కారుల‌కు చిక్కింది. ఆ మ‌త్స్యకారుల పంట పండింది.గోదావ‌రి వ‌ర‌ద‌ల స‌మ‌యంలో మాత్ర‌మే అరుదుగా దొరికే పుల‌స చేప శుక్ర‌వారం కోన‌సీమ జిల్లాలో మ‌త్స్య‌కారుల వ‌ల‌కు చిక్కింది. దీంతో ఆ మ‌త్స్యకారుల ముఖాల్లో ఆనందం అంతుప‌ట్ట‌ని విధంగా ఉంది సంతోషంతో గోదావ‌రి న‌ది ఒడ్డుకు వ‌చ్చిన వెంట‌నే చేప‌ను బేరం పెట్టారు. త‌మ‌కు తెలిసిన వాళ్ల‌కు ఫోన్ చేసి మ‌రి బేరం ఆడారు. కేవ‌లం రెండు కేజీల పుల‌స చేప‌ను ఆ మ‌త్స్య‌కారులు ఏకంగా రూ.24 వేల‌కు అమ్మారు. కోన‌సీమ జిల్లా మ‌లికిపురం మండ‌లం రామ‌రాజులంక బాడవ‌లో శ్రీ‌ను అనే మ‌త్స్య‌కారుడు, మ‌రో మ‌త్స్య‌కారుడితో క‌లిసి చిన్న బోటుపై శుక్ర‌వారం చేప‌ల వేట‌కు గోదావ‌రి న‌దిలోకి వెళ్లాడు.

Read More అంతుచిక్కని రోజా వ్యూహం....

వేటకు వెళ్లిన కొద్ది స‌మ‌యానికే వారికి గోదావ‌రి వ‌ర‌ద‌ల స‌మ‌యంలో మాత్ర‌మే దొరికే అత్యంత అరుదైన పుల‌స చేప దొరికింది. దీంతో ఆ మ‌త్స్యకారులు  చేప‌లు వేట వేయ‌కుండా అదృష్టం క‌లిసి వ‌చ్చింద‌నుకొని ఒడ్డుకు చేరుకున్నారు. అప్ప‌టికే  పుల‌స చేప దొరికిందని ఓ వ్యక్తికి స‌మాచారం ఇవ్వ‌డంతో అతను త‌న‌కు తెలిసిన వారికి ఫోన్ చేసి బేరం ఆడుతూ… ఆ పుల‌స చేప‌తో మ‌త్స్య‌కారులు వ‌స్తున్న బోటు వైపు వెళ్లాడు. మ‌త్స్య‌కారుల బోటు ఒడ్డుకు వ‌చ్చింది. బోటు మీద నుంచి మ‌త్స్య‌కారులు ఇంకా దిగ‌నే లేదు. చేప బేరం ఆడుతూ వచ్చిన వ్యక్తి అక్క‌డికి చేరుకున్నాడు.

Read More ఆస్తుల కోసం గొడవలు పెట్టుకోవాలన్న ఉద్దేశం నాకు లేదు.

ఒడ్డున బోటు నిలిపివేసి ఇద్ద‌రు మ‌త్స్య‌కారులు బోటుపైనే ఉన్నారు. వారి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన మ‌త్స్యకారుడు ఫోన్‌లో చేప కేజీన్న‌ర వ‌స్తుంద‌ని… అంత‌కంటే దాటుతుంద‌ని, చేప బాగుంద‌ని అవ‌త‌ల వ్య‌క్తికి ఫోన్‌లో చెప్పాడు. అలాగే మ‌త్స్య‌కారుల‌ను ధ‌ర ఎంత‌ని అడిగాడు. దీంతో ఏముందీ రూ.30 వేల అని పుల‌స చేప ధ‌ర చెప్పాడు.ఇదే మొద‌టి చేప అని…. ఎక్క‌డ ప‌డ‌లేద‌ని, ఇక్క‌డే ప‌డింద‌ని మ‌త్స్య‌కారులు చెప్పారు. మీకు తెలుసు క‌దా పుల‌స చేప ధర ఎంత ఉంటుందో అని మ‌త్స్య‌కారులు అన్నారు. అయితే ఫోన్ మాట్లాడుతూ వ‌చ్చిన వ్య‌క్తి మొద‌ట రూ.23 వేలుకి అడిగాడు. వారు అలా కుద‌ర‌ద‌న్న అనే స‌రికి… మ‌రో వెయ్యి క‌లిపి రూ.24 వేలుకి ఇచ్చేయండి అడిగాడు. దీంతో మ‌త్స్య‌కారులు ఆ చేప‌ను రూ.24 వేల‌కు అమ్మారు. అయితే ఈ చేప‌ను అప్ప‌న‌రామునిలంక మాజీ స‌ర్పంచ్ కొనుగోలు చేశారు. దీని బ‌రువు తూకం వేస్తే రెండు కేజీలు వ‌చ్చింది.

Read More జగన్ కు ఆర్ ఆర్ ఆర్ ఉచ్చు

పులస చేప ప్రత్యేకతలు
వ‌ర‌ద‌ల స‌మ‌యంలో స‌ముద్రం నుంచి పుల‌స‌లు గోదావ‌రి నీటిలోకి ఎదురు ఈదుకుంటూ వ‌స్తాయి. పులస చేప వర్షాకాలంలోని గోదావ‌రి న‌దిలో మాత్రమే దొరుకుతుంది. ఇది చాలా రుచిగా ఉంటుంది. పుస్తెలు అమ్మి అయినా పుల‌స తినాల‌నే సామెత కూడా బాగా ప్రాచుర్యం పొందింది. ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో ఈ చేప ప్రసిద్ధి చెందింది. అయితే ఇదే చేప స‌ముద్రంలో దొరికితే దానిని వ‌ల‌స చేప అంటారు. హుగ్లీ న‌దిలో కూడా ఈ చేప దొరుకుతుంది. అక్క‌డ హిల్సా అని పిలుస్తారు.

Read More దువ్వాడ.. యుగపురుషడు... వైరల్ గా  మాధురి కామెంట్స్

Latest News

నేడు మహాకవి దాశరథి కృష్ణమాచార్య వర్ధంతి నేడు మహాకవి దాశరథి కృష్ణమాచార్య వర్ధంతి
మహాకవి దాశరథి కృష్ణమాచార్య దాశరథిగా ఆయన సుప్రసిద్ధుడు. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన దాశరథి ప్రాతఃస్మరణీయుడు. నా తెలంగాణ కోటి రతనాల...
Reba Monica John
Rashmika Mandanna
Rashi Singh
గోదావరి పుష్కర ఏర్పాట్లు షురూ...
స్మార్ట్ కార్డుల్లో ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్సులు