కేసిఆర్, జగన్ పయనం ఎటు?

ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు కూడా రాలేదు. దీంతో తెలంగాణలో కెసిఆర్ పార్టీ మనుగడ కూడా కష్టమవుతోంది. ఆ పార్టీ నుంచి ఇతర పార్టీలోకి చేరికలు పెరిగాయి. ఏకంగా ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లోకి క్యూపడుతున్నారు. మరోవైపు కుమార్తె కవిత అవినీతి కేసుల్లో చిక్కుకొని జైలు జీవితం అనుభవిస్తున్నారు. ఏపీలో కూడా జగన్ పరిస్థితి అలానే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైంది. 11 అసెంబ్లీ సీట్లకే పరిమితమైంది. కనీసం జగన్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.

కేసిఆర్, జగన్ పయనం ఎటు?

రాజకీయ స్నేహితులు కేసిఆర్, జగన్ పయనం ఎటు? ఎన్డీఏ కూటమిలో చేరుతారా? ఇండియా కూటమిని ఆశ్రయిస్తారా? ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకుంటారా? లేకుంటే వేర్వేరు మార్గాల్లో వెళ్తారా?తెలుగు రాష్ట్రాల్లో ఇదే చర్చ నడుస్తోంది. దాదాపు ఇద్దరి పరిస్థితి అలానే ఉంది. 2018 ఎన్నికల్లో ఓడిపోయారు కేసీఆర్.

ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు కూడా రాలేదు. దీంతో తెలంగాణలో కెసిఆర్ పార్టీ మనుగడ కూడా కష్టమవుతోంది. ఆ పార్టీ నుంచి ఇతర పార్టీలోకి చేరికలు పెరిగాయి. ఏకంగా ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లోకి క్యూపడుతున్నారు. మరోవైపు కుమార్తె కవిత అవినీతి కేసుల్లో చిక్కుకొని జైలు జీవితం అనుభవిస్తున్నారు. ఏపీలో కూడా జగన్ పరిస్థితి అలానే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైంది. 11 అసెంబ్లీ సీట్లకే పరిమితమైంది. కనీసం జగన్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు అక్రమాస్తుల కేసులు, బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య అంశం తెరపైకి వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులపై దాడులు,కేసులు ఎదురవుతున్నాయి. ఈ తరుణంలో పార్టీని కాపాడుకోవడం ఇబ్బందికరమే. అధికారంలో ఉన్న సమయంలో రాజకీయ శత్రువులను పెంచుకున్నారు ఈ ఇద్దరు నేతలు. సొంత రాష్ట్రాలతో పాటు జాతీయస్థాయిలో నమ్మదగిన స్నేహాన్ని కొనసాగించలేకపోయారు. దాని ప్రభావం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. తాము ఇబ్బందుల్లో ఉన్న పట్టించుకునే వారు కరువయ్యారు.

Read More కష్టంలో తోడుగా.. కన్నీళ్లలో అండగా…

కనీసం మద్దతు తెలిపేందుకు కూడా ముందుకు రాని పరిస్థితి. అందుకే వీరిద్దరూ పునరాలోచనలో పడ్డారు. జాతీయస్థాయిలో స్నేహం పెంచుకోవాలని చూస్తున్నారుఈ ఇద్దరు నేతలకు ఇప్పుడు జమిలి ఎన్నికల భయం పట్టుకుంది. 2019 నుంచి కార్యాచరణ ప్రారంభించింది బిజెపి. కానీ 2024 ఎన్నికలకు ఒక ఏడాది ముందు జమిలి ఎన్నికలకు సంబంధించి కార్యాచరణ ప్రారంభమైంది. సాధ్యాసాధ్యాలపై ఒక కమిటీని వేసింది కేంద్రం. ఈ కమిటీకి అధ్యక్షుడిగా మాజీ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ని నియమించింది. ఆయన నాయకత్వంలో కమిటీ ఇప్పటికే చాలాసార్లు భేటీ అయింది. 2029 నాటికి దేశంలో జమిలి ఎన్నికలు జరుగుతాయని చెబుతున్నారు. అదే జరిగితే దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. జాతీయ పార్టీల ప్రభావం ప్రాంతీయ పార్టీలపై తప్పకుండా పడుతుంది.ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ కంటే.. కూటమిల మధ్య గట్టి ఫైట్ నెలకొనే అవకాశం ఉంది.

Read More ఆది దేవుడి ఆశీస్సులు అందరిపై ఉండాలి

తెలుగు రాష్ట్రాల్లో జగన్, కెసిఆర్ ఏదో ఒక కూటమిలో చేరక తప్పని పరిస్థితి. ఇప్పటికే ఏపీలో ఎన్డీఏ కూటమిలో టిడిపి, బిజెపి, జనసేన ఉన్నాయి. ఇండియా కూటమిలో కాంగ్రెస్, వామపక్షాలు కొనసాగుతున్నాయి. ఏ కూటమిలో చేరకుండా వైసిపి ఉంది. రెండు రాష్ట్రాల్లో కూడా బలమైన ప్రతిపక్ష పార్టీ నేతలు రాకుండా డుమ్మా కొడుతున్నారు. కేసీఆర్ దాదాపు 40 అసెంబ్లీ సీట్లు గెలుచుకొని బలమైన ప్రతిపక్ష నేతగా కనిపిస్తున్నారు కానీ ఆయన అసెంబ్లీలోకి వెళ్లిన సందర్భమే లేదు మరోవైపు జగన్ ప్రతిపక్ష హోదా లేదు అయినా ఆయన వెళ్లొచ్చు. కానీ ఆయన కూడా అసెంబ్లీని పూర్తిగా బహిష్కరించారు. బయట మాట్లాడుతున్నారు తప్ప అసెంబ్లీలోకి వెళ్లి ఎన్నికల ప్రచార సమయంలో మాట్లాడినట్లు మాట్లాడలేకపోతున్నారు.ఏపీలో బడ్జెట్ సమావేశాలు మొదలైన రోజు జగన్ ఢిల్లీకి వెళ్లి ధర్నా చేశారు.

Read More ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని క‌లిసిన పీర్జాదిగూడ మేయ‌ర్ అమ‌ర్ సింగ్‌

మరోవైపు కేసీఆర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు చుట్టపు చూపుగా వచ్చి వెళ్లిపోయారు. తర్వాత మీడియా సమావేశంలో కొద్దిసేపు మాట్లాడారు అనంతరం ఆయన కనిపించిన దాఖలాలు లేవు. సాధారణంగా ప్రతిపక్ష హోదా అంటే ఒక క్యాబినెట్ మినిస్టర్ తో సమానమైనది. దానిని సద్వినియోగం చేసుకుంటూ ప్రజల కోసం మాట్లాడాల్సిన అవసరం ఉంది. కానీ ఓడిపోతే ఇక తమకు రాష్ట్రంతో సంబంధం లేనట్లు, అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేసినా తమకు అనవసరం క్వశ్చన్ చేయమన్నట్లు కెసిఆర్ ప్రవర్తిస్తున్నారు. మరోవైపు జగన్ కూడా అలాగే తయారయ్యారు.కెసిఆర్ జగన్ పార్టీల నుంచి వెళ్ళిపోతున్నావా ఎమ్మెల్యేల సంఖ్య కూడా పెరుగుతోంది.

Read More తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి

కేసీఆర్ వారిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు జగన్ మాత్రం ఆ ప్రయత్నాలు చేయనట్లే కనిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు తమ ఎమ్మెల్యేలతో జగన్ గాని కెసిఆర్ గానీ మాట్లాడలేదు ఇప్పుడు ఉండమంటే వాళ్ళు ఉంటారా అనేది కూడా ప్రశ్నార్థకమే. ఏపీలో వైసీపీ పట్ల సానుభూతి ఇప్పట్లో కనిపించేలాగా కనిపించడం లేదు. కెసిఆర్ పరిస్థితి కూడా అలానే తయారయింది. లోక్‌సభ ఎన్నికల్లో అతను ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయారు. రైతుబంధు, దళిత బంధు, బీసీ బంధు అంటూ కేవలం కొన్ని వర్గాల ప్రజలకు మాత్రమే డబ్బులు ఇస్తానని కేసీఆర్ అంటున్నారు కానీ పేద ప్రజలకు మాత్రం ఇల్లు కట్టిస్తానని చెప్పడం లేదు. కొన్ని హామీలను నెరవేర్చిన కీలకమైన హామీలను నెరవేర్చడంలో ఫెయిల్ అయ్యారు. అందుకే ప్రజల్లో ఆగ్రహం ఎక్కువగా ఉంది. మరి వచ్చేసారి కాంగ్రెస్ కంటే కేసీఆర్ ఏ బెటర్ అని ఒక నిర్ణయానికి వస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Read More 7న మద్యం షాపుల బంద్

తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇండియా కూటమికి చెందినది. బిజెపి ఎన్డీఏ కు నేతృత్వం వహిస్తోంది. దీంతో అక్కడ ఏ కూటమికి చెందినది కేసీఆర్ పార్టీ2029లో జమిలి ఎన్నికలు జరిగితే.. జగన్ ఇప్పటినుంచే కార్యాచరణ ప్రారంభించాలి. ఎన్డీఏలో టిడిపి, జనసేనలు బలమైన పక్షాలు కావడంతో ఆ కూటమిలో చేరేందుకు జగన్ కు చాన్స్ లేదు. అందుకే ఆయనకు ఏకైక ఆప్షన్ ఇండియా కూటమి. కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి ఎన్నికలకు సిద్ధం కావడమే ఆయన ముందున్న కర్తవ్యం. కెసిఆర్ ది మరీ విచిత్ర పరిస్థితి. తెలంగాణలో ఆ పార్టీ ఏ కూటమిలో చేరాలనుకున్నా అధికారం ఆశించే పరిస్థితిలో లేదు. కేవలం సర్దుబాటు వరకు మాత్రమే చేయగలదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కెసిఆర్ తో పాటు జగన్ రాజకీయ కార్నర్ లో ఉన్నట్టే...

Read More అమ్మో... ఎంత హడావిడి చేసిందో...

Latest News

గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్ గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలం పాట
తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి
లక్ష 36 వేలకు లడ్డు దక్కించుకున్న సాయి కృష్ణ
పెట్టుబడులకు, నూతన ఆవిష్కరణలకు అనుకూల ప్రాంతం - తెలంగాణ
అద్రాస్ పల్లిలో ఈత వనాల పరిశీలన