Nagole Murder I నాగోల్ హత్య మిస్టరీ, ముగ్గురు నిందితుల అరెస్ట్
హైదరాబాద్ నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 19న జరిగిన హత్య కేసు మిస్టరీ వీడింది.
హైదరాబాద్ నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 19న జరిగిన హత్య కేసు మిస్టరీ వీడింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను నాగోల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. విలేకరుల సమావేశంలో ఎల్బీ నగర్ ఏసీపీ కృష్ణయ్య మాట్లాడుతూ....కేసు వివరాలను వెల్లడించారు. నాగోల్ ఈశ్వరీపుర కాలనీకి చెందిన డేరంగుల మల్లికార్జున కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బోడప్పల్‌కు చెందిన కొప్పుల అర్జున్ యాదవ్‌కు చెందిన మల్లెల మహేష్, మణికంఠ నగర్ న్యూ నాగోల్ సమతి పుర కాలనీకి చెందిన కంచల్ ఓంకార్ అహ్మద్ స్నేహితులు. మద్యానికి బానిసైన మల్లికార్జున తరచూ డబ్బుల కోసం వారిని వేధించేవాడు. డబ్బులు ఇవ్వకుంటే చంపేస్తానని చాలాసార్లు బెదిరించాడు. ఈ క్రమంలో ఓం కార్ పై మల్లికార్జున ఒక్కసారి కత్తితో దాడి చేశాడు. మల్లికార్జున నిత్యం తమకు ముప్పు వాటిల్లుతుందని భావించిన ముగ్గురు స్నేహితులు మల్లికార్జునను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు.
Post Comment