Married : సాఫ్ట్‌వేర్ వివాహిత మర్డర్ కేసులో విస్తుపోయే వాస్తవాలు..!
హైదరాబాద్ మహానగరం శివారు బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసిన హత్య కేసులో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన మధులతకు అదే జిల్లాకు చెందిన నాగేంద్ర భరద్వాజ్‌తో 2020లో వివాహం జరిగింది.
జయభేరి, హైదరాబాద్, మే 25 :
చిన్న గొడవ నేపథ్యంలో భార్యను అత్యంత దారుణంగా కత్తితో హత్య చేశాడు ఓ భర్త.. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కోయాలని పథకం వేశాడు.
వారికి ఏడాదిన్నర కుమారుడు ఉన్నాడు. వీరు బాచుపల్లిలోని సాయిల్ అనురాగ్ కాలనీలో ఎమ్మెస్సార్ ప్లాజాలో నివాసం ఉంటున్నారు. దంపతులిద్దరూ కూడా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. అయితే పెళ్లయిన మొదటి రోజు నుండి మొదలైన చిత్రహింసలు ఆమె మరణం దాకా కొనసాగినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. కనీసం కుమారుడు పుట్టినా, చూడడానికి కూడా వెళ్లలేదట. ఆ తర్వాత పెద్దల సమక్షంలో ఎన్నిసార్లు మాట్లాడించిన నాగేంద్ర తీరు మాత్రం మారలేదు. మే నెల 4వ తేదీన మధులతను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసి బాచుపల్లి పోలీసులకు దొరికిపోయాడు.
Post Comment