రత్నాలయంలో చోరీ... విలువైన బంగారు వెండి ఆభరణాలు, పంచలోహ విగ్రహాలు అపహరణ

క్లూస్ టీమ్, ఆధారంగా కేసు నమోదు చేసినట్లు పోలీసుల వెల్లడి

రత్నాలయంలో చోరీ... విలువైన బంగారు వెండి ఆభరణాలు, పంచలోహ విగ్రహాలు అపహరణ

జయభేరి, జులై 24:- గుర్తు తెలియని దుండగులు ఆలయంలోకి ప్రవేశించి బంగారు, వెండి ఆభరణాలు అపహరించుకు పోయారు. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ మండలం అలియాబాద్ లోని రత్నాలయం లో చోటుచేసుకుంది.

ఈ నెల 23న రాత్రి రోజువారి మాదిరిగా ఆలయ పూజారులు స్వామి వారి నిత్య కార్యక్రమాలు పూర్తయిన ఆనంతరం గుడి తలుపులు మూసి వెళ్ళిపోయారు. అర్థరాత్రి  సుమారు 1 గంట సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆలయం వెనుక భాగంలో ఉన్న డోర్ యొక్క ఐరన్ గ్రిల్ ను కట్ చేశారు. అనంతరం ఆలయంలోకి ప్రవేశించి బంగారు వెండి ఆభరణాలు అపహరించుకు పోయారు. ఉదయం ఆలయం తెరవడానికి పూజారి విచ్చేయగా ఆలయ ద్వారం తెరిచి ఉండడంతో అనుమానం వచ్చి లోనికి వెళ్లి చూడగా స్వామి వారి ఆభరణాలు కనిపించలేదు. దీంతో ఆలయ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు.

Read More రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులకు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు  కలెక్టర్

fa56733d-f301-40c4-9e37-cc308d6f3ca2

Read More నేత్రపర్వం నాచగిరి క్షేత్రం...

దీంతో పోలీసులు క్లూస్ టీమ్ మరియు డాగ్ స్క్వాడ్ బృందాలతో అక్కడికి చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. కాగా ఆలయంలో సుమారు 10 తులాల బంగారు ఆభరణాలు, 13.5 కిలోల వెండి ఆభరణాలు, 60 కిలోల పంచలోహ విగ్రహాలు చోరీ అయినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. సీసీ పుటేజి ఆధారంగా నిందితులను అతి తొందర్లోనే పట్టుకుంటామని శామీర్ పేట్ పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Read More రామకోటి రామరాజు చిత్రకళ అమోఘం 

df16f849-a9e3-40ec-8b5e-9bc27a8ca5ef

Read More మొద్దు నిద్రలో రేవంత్ సర్కారు

Latest News

విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం
జయభేరి, మేడిపల్లి : రాచకొండ పోలీస్ కమిషనరేట్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుడమి హై స్కూల్ బోడుప్పల్ లో మేడిపల్లి పోలీస్ వారి ఆధ్వర్యంలో ట్రాఫిక్...
యాద్గారపల్లి చౌరస్తా లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ నాయకులు
ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు
ప్రజా పాలన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన మొదటి సంవత్సరం అభివృద్ధి పనుల వివరాలు...
ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి 
మొద్దు నిద్రలో రేవంత్ సర్కారు