Ayodhya I నాడు అయోధ్య.. నేడు జ్ఞానవాపి మసీదు..!?
బిజెపి మసీదుల నిర్మూలనే ధ్యేయంగా అడుగు ముందుకు వేస్తూ ప్రజల్ని కూడా అదే తోవలో నడిపిస్తుంద? ఈ విషయంపై కడారి శ్రీనివాస్ రాజకీయ సమగ్ర విశ్లేషణ...
జయభేరి, హైదరాబాద్ :
భారతదేశంలోని అయోధ్యలో రామ మందిర నిర్మాణం తర్వాత వారణాసిలో జ్ఞానవాపి మసీదు దగ్గర మసీదు సెల్లార్ లోపల 31 ఏళ్ల తర్వాత కాశీ విశ్వనాధునికి పూజలు చేశారు పూజారులు. 31 ఏళ్ల తర్వాత అంటే అంత మామూలు విషయం కాదు. మన దేశాన్ని ముస్లింలు పరిపాలించినప్పుడు కాశీ విశ్వనాధుని ఆలయంలో మసీదును నిర్మించి నామరూపాలు లేకుండా హిందూ ఆధారాలను భూస్థాపితం చేశారని వాటిపై వారణాసిలోని కొంతమంది మతాధిపతులు కోర్టును ఆశ్రయించగా, కాదు ఇక్కడ మసీదు ఉంది అని చెప్పి మరి కొంతమంది ముస్లింలు పిటిషన్ వేశారు. దీనికి సంబంధించి ఏఎస్ఐ భారత పురావస్తు శాఖ నివేదిక ప్రకారంగా కొన్ని విప్లవాత్మకమైన ఆనవాళ్లు బయటపడడంతో ఇక్కడ పూజ చేసుకోవచ్చు అని కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో మసీదు సెల్లార్ లోపల ఉన్న రాళ్ల మధ్యన పూజా కార్యక్రమాల్ని ఏర్పాటు చేశారు పూజారులు. రామ మందిరం తర్వాత ప్రధానమంత్రి మోడీ యోగి ఆదిత్యనాథ్ వారణాసిలోని కాశీ విశ్వనాధుని ఆలయ నిర్మాణం జరిపించాలి అన్నట్టుగానే యోగి ఆదిత్యనాథ్ పార్లమెంటులో మాట్లాడుతూ.. కృష్ణుడు చాలా మొండివాడు అనే విషయాన్ని చెబుతూ భారతంలో శ్రీకృష్ణుడు యుద్ధం ఆపడానికి కౌరవుల దగ్గరికి వెళ్లి యుద్ధం వద్దు అని చెప్పినప్పుడు వాళ్లు వినలేదు. అనే అంశాన్ని కూడా ప్రస్తావించారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్... అంటే మరొకసారి ఆలయ నిర్మాణం కోసం యుద్ధం చేయాల్సి ఉందనే సంకేతాన్ని హిందూ సోదరులకు అందించినట్టుగానే అనిపిస్తుంది.
వారణాసి 1993లో మూలయం సింగ్ ప్రభుత్వంలో పూజలు అక్కడ ఆపివేశారని, ఆ తర్వాత సుదీర్ఘ పోరాటం తర్వాత ఆలయం మళ్లీ తెలుసుకొని వారణాసిలో ఇప్పుడు పూజలు అందుకుంటుందని భావోద్వేగంగా పూజలు జరిపిన తర్వాత కొంతమంది మాట్లాడడం చేర్చాం శనియం అవుతుంది.
ఏఎస్ఐ సర్వే ప్రకారం గా మసీదు నిర్మాణం కింద హిందూ దేవాలయం యొక్క ఆనవాళ్లు ఉన్నాయని ఔరంగజేబు హయములో 20 ఏటా పర్షియన్లు 17వ శతాబ్దంలో ఇక్కడ దేవాలయాన్ని కూలగొట్టి మసీదును నిర్మించారని పురావస్తు శాఖ 1965 - 66 సంవత్సరాల్లో ఇక్కడ దానికి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయని తమ నాలుగు నెలల పాటు చేసిన సర్వేలో ఏఎస్ఐ అనేక సంచలన నిజాలను బయటపెట్టింది. ఔరంగజేబు తన పరిపాలనలో దేవాలయాలు, పాఠశాలలు అనేకంగా కూల్చివేసి భూస్థాపితం చేశారని 100 అడుగులు ఎత్తైన ఆలయాన్ని కూల్చేసి మసీదును నిర్మించుకున్నారని 34 శాసనాలు, నగిసీలు కూడా ఉన్నాయని, మసీదు నిర్మాణానికి హిందూ దేవాలయపు రాళ్లను కూడా వాడారని పరిశోధనలో తేల్చేసింది. అంతేకాకుండా ఈ మసీదు కింద దేవనాగరి తెలుగు కన్నడ భాషలలో లిపి కూడా శిలా శాసనాలు దొరికాయని ఏఎస్ఐ ఆధారాలను బయటపెట్టింది. 17వ శతాబ్దంలో కాశీ విశ్వనాథుడు నారాయణ బట్టు ఇక్కడ సంచరించినట్టుగా 1585లో కాశీ విశ్వనాథుడు నారాయణ బట్టును ఆజ్ఞాపించినట్టుగా ఆనవాళ్లను కనుగొంది.
1991లో జ్ఞానవాపి కేసును పూజారులు ఇక్కడ దేవాలయం ఉందని వారణాసి కోర్టులో కేసు వేయగా అక్కడ ముస్లింలు కాదు ఇది మసీదు ఉంది అని చెప్పి వాదోపవాదాలు జరిగిన తర్వాత, ఇచ్చిన తీర్పులో మసీదు సెల్లార్ కింద జ్ఞానవాపి కాశీ విశ్వనాథుని ఆలయాన్ని 31 ఏళ్ల తర్వాత శుభ్రం చేసి పూజలు చేయడం ఇక్కడ ఎంతో సంతృప్తినిచ్చిందని పూజారులు తమ ఆనందాన్ని తెలియజేశారు.
ఐదు దశాబ్దాల తర్వాత అయోధ్య రామ మందిరాన్ని ఏర్పాటు చేసిన బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ సారధ్యంలో యోగి ఆదిత్యనాథ్ ప్రోద్బలంతో దేశంలో హిందూ ఆలయాల పునరుద్ధరణ కోసమే బిజెపి అధికారంలోకి వచ్చిందా ?
అన్నట్టుగా అనిపిస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న ఇంకోవైపు బిజెపి ప్రభుత్వం ఎలాగైనా వారణాసిలో శ్రీకృష్ణుని మందిరాన్ని ఏర్పాటు చేయాలని కాశి విశ్వనాధుని ఆలయాన్ని ఏర్పాటు చేయాలని దృఢంగా నిశ్చయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇదే గనక జరిగితే దేశంలోని హిందూ ఆలయాల జాడను కనుగొని కచ్చితంగా ఆలయ నిర్మాణాలను ఏర్పాటు చేసే దిశగా బిజెపి అడుగులు వేస్తోంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.వాస్తవానికి అయోధ్య రామ మందిర నిర్మాణంలో ప్రధాన మంత్రి మోడీ చేసింది ఏమీ లేదు సుప్రీంకోర్టు ఆధారంగానే తీర్పు ప్రకారంగానే అక్కడ అయోధ్య రామ మందిరం ఏర్పాటయిందని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్న మొత్తానికి యోగి ఆదిత్యనాథ్ ప్రధాన మంత్రి మోడీ సారథ్యంలో పూర్తిగా ఆలయం నిర్మాణం మొదలు కాబోతుంది.
ఆలయ నిర్మాణాలు గుళ్ళు గోపురాలు ఎందుకు నిర్మిస్తారు? అని చివరగా మనం ఒకసారి విశ్లేషణ చేసుకుంటే...
దేశంలో మతాధిపత్యం గుత్తాధిపత్యాన్ని సాధించుకోవడానికి పాలకులు గుళ్ళు గోపురాలను ఏర్పాటు చేస్తారు. ఒక మతాన్ని విశ్వవ్యాప్తి చేయడానికి కంకణం కట్టుకుంటారు. ఇలా గుళ్ళు గోపురాలు నిర్మిస్తున్నారు అంటే తమ మతాన్ని ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నారు అనే అనుకోవచ్చు. మొత్తానికి రామ మందిరం నిర్మాణం తర్వాత వారణాసిలోని కాశి విశ్వనాధుని ఆలయానికి తలుపులు తెరిచిన బిజెపి ప్రభుత్వం త్వరితగతిన జ్ఞానవాపి మసీదు దగ్గర మసీదును తీసేసి జ్ఞానవాపి కాశీ విశ్వేదనాధుని ఆలయం నిర్మించే దిశగా పావులు కలుపుతోంది...
...కడారి శ్రీనివాస్
కాలమిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, కవి, రచయిత
Post Comment