Chetak Express And Railways I రైలులోని అధ్వాన పరిస్థితులు.. 

వైరల్ అవుతోన్న ఫోటోపై స్పందించిన అధికారులు

Chetak Express And Railways I రైలులోని అధ్వాన పరిస్థితులు.. 

అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో రైలు ప్రయాణం చుక్కలు చూపిస్తుంది. రిజర్వేషన్ బోగీల్లో కూడా జనం ఏక్కేసి సీట్లను ఆక్రమించుకుంటారు. పండగల సమయంలో అయితే ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక, జనరల్ బోగీల్లో కాలుపెట్టడానికి కూడా ఖాళీ ఉండదు. కానీ, కొందరు ఏకంగా ఏసీ కోచ్ల్లోకి ఎక్కేసి.. సీటు రిజర్వు చేసుకున్నవారిని సైతం పక్కకు నెట్టేస్తారు. తాజాగా, ఢిల్లీ నుంచి ఉదయ్పూర్ వెళ్లే ఎక్స్ప్రెస్ రైళ్లో ఓ ప్రయాణికురాలికి ఇలాంటి అనుభవం ఎదురయ్యింది.

రైలు ఏసీ కంపార్టుమెంట్లో అపరిశుభ్ర పరిస్థితులు, ప్రయాణికులు పడుతున్న అవస్థలకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ మహిళా ప్రయాణికురాలు ఈ ఫోటోను ఎక్స్లో (ట్విట్టర్)) షేర్ చేస్తూ.. థర్డ్ ఏసీ బోగీలో జనరల్ కోచ్ కంటే దారుణమైన పరిస్థితి ఉందని వివరించారు. ఢిల్లీలోని సరాయ్ రోహిల్లా నుంచి రాజస్థాన్లోని ఉదయ్పూర్ మధ్య నడిచే చేతక్ ఎక్స్ప్రెస్ రైలులో తనకు ఎదురైన అనుభవాన్ని ఆమె పంచుకున్నారు. ఆ ఫోటోను చూస్తే ఇది నిజంగా ఏసీ కంపార్ట్మెంటేనా? అనే అనుమానం కలుగుతుంది. జనరల్ బోగీలో ఉన్నట్టు అనిపిస్తుంది.

Read More జమ్మూకశ్మీర్‌లో ప్రారంభమైన రెండో విడత ఎన్నికల పోలింగ్‌

‘ఇది రైళ్లలో దుస్థితి.. థర్డ్ ఏసీ పరిస్థితులు ఇంత దారుణంగా తయారయ్యాయి.. జనరల్ బోగీల్లో ప్రయాణిస్తున్నట్లు ఇలా ఇబ్బందులు పడుతూ ఏసీ కోసం మనం ఎందుకు డబ్బు చెల్లించాలి.. పెద్ద మొత్తంలో డబ్బులు పోసి టికెట్ కొన్నా కూర్చోవడానికి కూడా ఇందులో చోటు లేదు’ అని ఆమె వాపోయారు. రైల్వే మంత్రి అశ్విని , ప్రధాని మోదీ, రైల్వే విభాగానికి ఈ ట్వీట్ను ట్యాగ్ చేశారు.

Read More 50 మందిని పెళ్లి చేసుకున్న నిత్య పెళ్లి కూతురు..

ఏసీ త్రీ-టైర్ కోచ్ ఇరుకైన స్థలంలో చాలామంది ప్రయాణికులు నిలబడి ఉండటం ప్రయాణికురాలు షేర్ చేసిన ఫోటో కనిపిస్తోంది. అలాగే, అలసిపోయిన ఓ వ్యక్తి తన చేతిని ఆసరాగా పెట్టుకుని నిద్రపోతున్నాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్ట్కు 2.1 మిలియన్ వ్యూస్ మార్చి 19 రాత్రి 9 గంటలకు చేసిన వచ్చాయి. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఫొటోలోని ఫ్యాన్ను ఓ నెటిజన్ స్పందిస్తూ.. చూపుతూ మీరు నిజంగానే ఏసీ బోగీలో ఉన్నారా? అని ప్రశ్నించారు. తన కోచ్లోని పెద్ద ఏసీ కిటికీకి సంబంధించిన ఫోటోను ఆమె సమాధానంగా షేర్ చేశారు.

Read More ఎవరీ బోలే బాబా...

మరో నెటిజన్ వ్యంగ్యంగా ఇది థర్డ్ క్లాస్ స్లీపర్ బోగి ఏసీ కాదు అని కామెంట్ పెట్టాడు. ‘సామాన్యులు ప్రయాణించే రైళ్లలో కనీస సౌకర్యాలను కల్పించకుండా వందేభారత్, బుల్లెట్ ట్రైన్లను ప్రజలకు అందించడంలో బిజీగా ఉన్నారు.. ప్రతిరోజూ ప్రయాణికులు ఇలాంటి ఫిర్యాదులు చేస్తారు.. కానీ ఏం లాభం లేదు అని’ మరొకరు వ్యాఖ్యానించారు.మేము మంచి రైలు ప్రయాణ అనుభవాన్ని ఎప్పుడు పొందగలం?  ‘అశ్విని వైష్ణవ్ సార్,  మీరు, మీ ప్రభుత్వం చాలా గొప్ప పనులు చేస్తున్నారు.. అలాగే ఈ సమస్యను కూడా పరిష్కరించాలి’ అని మరో నెటిజన్ కోరారు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో రైల్వే అధికారులు స్పందించారు. సౌకర్యాల మెరుగుదలకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహిళా ప్రయాణికురాలి పీఎన్ఆర్ నెంబరు, మొబైల్ నెంబరు, చిరునామాతో ఫిర్యాదు చేయాలని సూచించారు.

Read More బీహార్ ప్రత్యేక హోదాకు తీర్మానం

Latest News

ఫ్రెండ్ రిసెప్షన్ కి వెళ్లి.. తిరిగిరాని లోకానికి వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫ్రెండ్ రిసెప్షన్ కి వెళ్లి.. తిరిగిరాని లోకానికి వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి
జయభేరి, సైదాపూర్  : సైదాపూర్ మండల్ రామచంద్రపూర్ విలేజ్ లో నిన్న రాత్రి రోడ్డు ప్రమాదంలో పొన్నం మహేష్ అనే యువకుడు ఫ్రెండ్ రిసెప్షన్ లో పాల్గొని...
విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం
యాద్గారపల్లి చౌరస్తా లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ నాయకులు
ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు
ప్రజా పాలన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన మొదటి సంవత్సరం అభివృద్ధి పనుల వివరాలు...
ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి 

Social Links

Post Comment