మణిపుర్ ఎన్నటికీ భారత్‌లో అంతర్భాగమే..
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన..
జయభేరి, న్యూ డిల్లీ మే 3 :
మణిపుర్ ఎన్నటికీ భారత్‌లో అంతర్భాగమేనని .. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేసారు. ఎవరి ఎన్ని కుట్రలు చేసినా మణిపుర్ ను దేశం నుంచి వేరు చేసేందుకు తాము ఎన్నటికీ ఒప్పుకోబోమని స్పష్టం చేశారు.చొరబాటు ద్వారా మణిపుర్ జనాభాను మార్చే ప్రయత్నాలు జరిగాయని అన్నారు.. మణిపుర్ ను విచ్ఛిన్నం చేసే శక్తులు, ఐక్యం చేసే శక్తుల మధ్య లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. ఇంఫాల్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్ షా ఈ కామెంట్లు చేశారు. రాష్ట్రంలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ వెల్లడించారు.షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) హోదా కోసం మైతేయి డిమాండ్‌కు వ్యతిరేకంగా కొండ జిల్లాల్లో గిరిజన సంఘీభావ యాత్ర జరిగింది. గతేడాది మే 3న జరిగిన ఈ సంఘటన తీవ్ర హింసాత్మకంగా మారింది.
Latest News
విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం
11 Dec 2024 15:37:30
జయభేరి, మేడిపల్లి : రాచకొండ పోలీస్ కమిషనరేట్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుడమి హై స్కూల్ బోడుప్పల్ లో మేడిపల్లి పోలీస్ వారి ఆధ్వర్యంలో ట్రాఫిక్...
Post Comment