Auto I షౌకత్ గ్యారేజ్
ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును
చేతిలో రూపాయి లేకున్నా.. కష్టపడేతత్వం, ఏదైనా చేయాలనే బలమైన కోరిక ఉంటే సాధించలేనిది ఏదీ అంటూ ఉండదు. అందుకు ఉదాహరణే సయ్యద్ శౌకత్. 12వ వయసులోనే తండ్రి చనిపోయినా, కుటుంబ బాధ్యతలు వెంబడించినా అధైర్యపడకుండా ముందుకు సాగాడు. పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన చేతులతోనే పాన, స్కై డ్రైవర్ చేతపట్టి బతుకు బండిని సమర్థవంతంగా నడిపించాడు. అనుకోకుండా మెకానిక్ ఫీల్డ్ లోకి అడుగుపెట్టి అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. తనతాంటివారికి చేయూత అందిస్తున్న షౌకత్ గురించి తెలుసుకుంటే ఎవ్వరైనా సలాం కొట్టాల్సిందే.
ఎదిగే వయసులోనే తండ్రి చనిపోతే ఆ బాధలు ఎలా ఉంటాయో చెప్పడం కష్టం. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ కు చెందిన శౌకత్ కూడా అలాంటి కష్టాలే పడ్డాడు. శౌకత్ తండ్రి ఐడీపీఎల్ లో ఉద్యోగం. అయితే 12వ వయసులోనే అనారోగ్య సమస్య వల్ల చనిపోవడంతో కుటుంబ బాధ్యతలు షౌకత్ మీద పడ్డాయి. ఒకవైపు కుటుంబానికి అండగా నిలబడేందుకు పేపర్ బాయ్ గా పనిచేశాడు. ఆ డబ్బులు సరిపోకపోవడంతో ఇంటింటికి పాలు కూడా వేశాడు. తాను చదువుకుంటూనే తన తమ్ముడి బాధ్యతలు కూడా తీసుకున్నాడు. మొదట టీవీ మెకానిక్ గా పనిచేసిన షౌకత్ బంధువుల సలహాతో మెకానిక్ ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యాడు.
మొదటి సంపాదన 500
శౌకత్ ఓ కార్లు షోరూంలో పనికి కుదరడంతో 500 మాత్రమే జీతం వచ్చేది. ఆ డబ్బుతోనే ఒకవైపు చదువుకుంటూ మరో వైపు కుటుంబాన్ని పోశించేవాడు. అలా మూడేళ్ల ఓ షోరూంలో పనిచేసి కార్ మెకానిక్ పై పూర్తి పట్టు సాధించాడు. ఇక తానే స్వయంగా ఏదైనా గ్యారేజ్ పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. అమిర్ పేటలో ఓ వీధిలో చిన్నపాటి స్థలంలో గ్యారేజ్ పెట్టాడు. షాపు పెట్టిన 15 రోజులకు తర్వాత ఓ కారు రిపేర్ కు వచ్చింది. ఏదైనా ఫీల్డ్ లో రాణించాలంటే క్వాలిటీ తో పాటు కస్టమర్లతో మర్యాద పూర్వకంగా నడుచుకోవాలి. శౌకత్ కూడా ఇలానే వ్యవహరించేవాడు. షౌకత్ పనితీరు, మాటతీరు కస్టమర్స్ కు నచ్చి క్యూ కట్టడంతో ఒక్కసారిగా బిజీగా అయ్యాడు. అయితే అమిర్ పేటలో షాపు చిన్నదిగా ఉండటంతో బంజారాహిల్స్ తో ప్రధాన రహదారిపై గ్యారేజ్ ఏర్పాటు చేశాడు. 2001లో మొదలైన ప్రయాణం నేటికి సక్సెస ఫుల్ గా సాగుతుంది.
అన్ని కార్లు రిపేర్
ఆల్టో కారు నుంచి బీఎండబ్ల్యూ వరకు అన్ని కార్లును రిపేర్ చేస్తాడు శౌకత్. బిజినెస్ ఎక్కువ కావడంతో 5 మంది యువకులకు పని కల్పించాడు. డేంటింగ్, పెయింటింగ్, మెకానికల్ వర్క్స్, ఏసీ ఫిట్టింగ్ ఇలా రకాల సౌకర్యాలు అందిస్తుండటంతో కస్టమర్స్ క్యూ కడుతున్నారు.. ఇప్పుడు బంజారాహిల్స్ లో బెస్ట్ గ్యారేజ్ ఏదైనా ఉందంటే షౌకత్ గ్యారేజ్ మాత్రమే. సామాన్యుల నుంచి సెలబ్రిటీ వరకు శౌకత్ గ్యారేజీలో తమ కార్లను రిపేర్ కు తీసుకొస్తుంటారు. పెద్ద పెద షోరూం కంటే మంచి సర్వీస్ ఇవ్వడంతో శౌకత్ గ్యారేజ్ నిత్యం సందడిగా కనిపిస్తుంటుంది. మున్మందు కూడా ఎలక్ట్రానిక్ వెహికల్స్ కు రిపేర్ చేసేందుకు స్కిల్స్ నేర్చుకుంటున్నాడు శౌకత్.
నేర్చుకున్నవాళ్లకు నేర్చుకున్నంతా : ఇసాక్, వర్కర్
నేను ఫస్ట్ ఢిల్లీ షోరూంలో పనిచేశాను. కానీ అక్కడ ఒకే రకమైన కార్లు ఉండేవి. దాంతో పని కూడా తక్కువగా ఉండేది. కానీ షౌకత్ దగ్గర చేరడం వల్ల అన్ని రకాలను కార్లను రిపేర్ చేయడం నేర్చుకున్నా.. నాది బిహార్ అయినా ఇక్కడ పనిచేయడమే నాకు ఇష్టం.
- బాలు జాజాల
Post Comment