మతసామరస్యానికి ప్రతీక మొహరం
ఇరగదిండ్ల శ్రీశైలం
చందంపేట :
చందంపేట మతసామరస్యానికి ప్రతీకగా మొహరం పీర్ల పండుగని, కుల మతాలకతీతంగా ఈ పండుగను నిర్వహించడం మన సాంప్రదాయమని చందంపేట మండలానికి చెందిన ఇరగ దిండ్ల శ్రీశైలం అన్నారు.
ముస్లిం సోదరులతో పాటు హిందూ సోదరులు కూడా ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. చందంపేట గ్రామంలో ఈ పండుగను ఉత్సాహంగా జరుపుకుంటామని, ఈ మొహరం పండుగ కోసం బతుకుతెరువు కోసం వలస వెళ్లిన ప్రజలు స్వగ్రామాలకు వస్తారని అన్నారు. మొహరం పండుగ రోజు మొక్కుకున్నావారు కోరికలు తీరిన వాళ్లు పీర్లకు వెండి బంగారం గొడుగులు ఉయ్యాలలు దట్టీలు సమర్పించుకుంటారని పీర్ల ను పట్టుకునే వారి శరీరంలో దేవుడు ప్రవేశిస్తాడని వారు చెప్పే మాటలు నిజమవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇరగ దిండ్ల శ్రీశైలం ఫకీర్, జబ్బు శ్రీశైలం, ఓర్సు యుగంధర్, పగిడిమర్రి రవీందర్, మాతంగి దేవేందర్, సారంగి వెంకటేష్, ఎండి మజ్జు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Post Comment