సూర్యప్రభ వాహనంపై గోవిందరాజస్వామి కటాక్షం
సూర్యుడు తేజోనిధి, సకలరోగ నివారకుడు, ప్రకృతికి చైతన్యప్రధాత. వర్షాలు, వాటివల్ల పెరిగే సస్యాలు, చంద్రుడు, అతని వల్ల పెరిగే ఓషధులు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి. అట్టి సూర్యప్రభను అధిష్టించి స్వామి ఊరేగడం ఆనందదాయకం.
జయభేరి, తిరుపతి :
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన బుధవారం ఉదయం 7 గంటలకు గోవిందరాజస్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులను కటాక్షించారు.
అనంతరం ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు శ్రీభు సమేత గోవిందరాజస్వామివారికి స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, చందనంతో అభిషేకం చేశారు.
Read More రోజుకు 2.14 లక్షల మందికి అన్నదానం
Latest News
ఫ్రెండ్ రిసెప్షన్ కి వెళ్లి.. తిరిగిరాని లోకానికి వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి
27 Dec 2024 10:14:56
జయభేరి, సైదాపూర్ : సైదాపూర్ మండల్ రామచంద్రపూర్ విలేజ్ లో నిన్న రాత్రి రోడ్డు ప్రమాదంలో పొన్నం మహేష్ అనే యువకుడు ఫ్రెండ్ రిసెప్షన్ లో పాల్గొని...
Post Comment