బక్రీద్ పండుగకు సెలవును ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

నెలవంక జూన్ 7న కనిపిస్తే బక్రీద్ జూన్ 17 ఉంటుంది. లేకుంటే జూన్ 18న ఉంటుంది.బక్రీద్ పండుగకు ముందే వివిధ దుకాణాలలో అమ్మకాలు ఊపందుకున్నాయి. బక్రీద్ కు ముందే పశు వర్తకులు ఆంధ్రప్రదేశ్, కర్నాటక, యూపీ, మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ కు వస్తున్నారు.

బక్రీద్ పండుగకు సెలవును ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

జయభేరి, హైదరాబాద్, జూన్ 3 :
ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు చేసుకునే బక్రీద్ పండుగ సెలవును తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం ఈ పండుగ జూన్ 17న ప్రకటించింది. అయితే అర్ధచంద్రాకార నెలవంక దర్శనంపైనే పండుగ తేదీ నిర్ధారణ కానున్నది. 

నెలవంక జూన్ 7న కనిపిస్తే బక్రీద్ జూన్ 17 ఉంటుంది. లేకుంటే జూన్ 18న ఉంటుంది.బక్రీద్ పండుగకు ముందే వివిధ దుకాణాలలో అమ్మకాలు ఊపందుకున్నాయి. బక్రీద్ కు ముందే పశు వర్తకులు ఆంధ్రప్రదేశ్, కర్నాటక, యూపీ, మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ కు వస్తున్నారు. వారంతా తాత్కాలిక మార్కెట్లలో తమ జీవాలను అమ్ముతున్నారు.బక్రీద్ పండుగకు సెలవు ఇవ్వడంతో పాటు జూన్ 25న వచ్చే ఈద్-ఈ-ఘదీర్ కు కూడా తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. 

Read More Horoscope - Rashi Palalu : మార్చి 29 రాశి ఫలాలు.. నిరుద్యోగులకు మంచి ఆఫర్..!

ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం 12వ నెల ధుల్ హిజ్ఝా 10 రోజున బక్రీద్ పండుగ చేసకుంటారు. నాడు మసీదులు, ఈద్గాల వద్ద ముస్లింలు నమాజ్ చేస్తారు. గత ఏడాది ఖుర్బానీకి జంతువుల డిమాండ్ బాగా ఉండింది. నెలవంక దర్శనం మీద బక్రీద్ ఏ రోజనేది ఆధారపడి ఉంటుంది కనుక బక్రీద్ పండుగ రోజును అటుయిటుగా తెలంగాణ ప్రభుత్వం మార్చే అవకాశం కూడా ఉంది. ముస్లింలు బక్రీద్ ను ‘ఈద్ అల్-అధా’ అని కూడా పిలుస్తారు.

Read More Rasi Phalalu : ఏప్రిల్ 2, నేటి రాశి ఫలాలు 02-04-2024

Latest News

విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం
జయభేరి, మేడిపల్లి : రాచకొండ పోలీస్ కమిషనరేట్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుడమి హై స్కూల్ బోడుప్పల్ లో మేడిపల్లి పోలీస్ వారి ఆధ్వర్యంలో ట్రాఫిక్...
యాద్గారపల్లి చౌరస్తా లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ నాయకులు
ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు
ప్రజా పాలన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన మొదటి సంవత్సరం అభివృద్ధి పనుల వివరాలు...
ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి 
మొద్దు నిద్రలో రేవంత్ సర్కారు

Social Links

Post Comment