ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పించాలి..
జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
ఆయా పాఠశాలల్లో చేపట్టిన పనులను జూన్ 20వ తేదీ వరకు పూర్తిచేయాలని ఆదేశించారు. చేపట్టిన మరమ్మత్తు పనులకు అదనపు నిధులు కొరకు ప్రతిపాదనలు అందచేయాలని అన్నారు. పాఠశాలల్లో మంచినీరు, విద్యుత్, మరుగుదొడ్లు, హ్యాండ్ వాష్ లేని పాఠశాలలు ఉండొద్దని అన్నారు.
జయభేరి, జయశంకర్ భూపాలపల్లి :
ప్రభుత్వ పాఠశాలలు ఆధునికతను సంతరించుకొని ఆహ్లాదకరంగా తయారు చేసేందుకు చేపట్టిన మరమ్మత్తు పనులను సకాలంలో పూర్తి చేయుటకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు.
కెజిబివిల్లో బాలికల రక్షణ కోసం చుట్టూ ప్రహారి గోడ నిర్మాణం ఆగష్టు 15 వరకు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారు లను ఆదేశించారు. ఈ సందర్భంగా పనులు చేపట్టిన గ్రామ సమాఖ్యలతో మాట్లాడుతూ.. ఆయా పాఠశాలల్లో చేపట్టిన పనులను జూన్ 20వ తేదీ వరకు పూర్తిచేయాలని ఆదేశించారు. చేపట్టిన మరమ్మత్తు పనులకు అదనపు నిధులు కొరకు ప్రతిపాదనలు అందచేయాలని అన్నారు. పాఠశాలల్లో మంచినీరు, విద్యుత్, మరుగుదొడ్లు, హ్యాండ్ వాష్ లేని పాఠశాలలు ఉండొద్దని అన్నారు. పాఠశాలలు పున:ప్రారంభానికి ముందు పూర్తిస్థాయిలో చేపట్టిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని విఓలను ఆదేశించారు.
ఇంజినీరింగ్ అధికారులు పనుల్లో వేగం పెంచడంతో పాటు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పనులు పూర్తి అయ్యేలా చొరవ చూపాలన్నారు. పనుల్లో ఆలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అనంతరం మహాదేవపూర్ ఎంపిడిఓ కార్యాలయంలో పాఠశాలల్లో జరుగుతున్న పనుల పురోగతిని పనులు పూర్తిచేసే గడువును మండలంలోని ఆయా పాఠశాలల హెడ్ మాస్టర్లు, కాంట్రాక్టు పనులు చేపట్టిన వివోలతో సమీక్ష నిర్వహించారు. మహాదేవపూర్ మండలంలో మొత్తం 26 ప్రభుత్వ పాఠశాలల్లో 3 జడ్పి హెచ్ యస్, ఒక కేజిబివి ఉండగా 26 పాఠశాలల్లో ఒక కోటి నాలుగు లక్షల రూపాయలతో మరమ్మత్తు పనులు చేపట్టినట్లు తెలిపారు.
పెండింగులో ఉన్న పనులను వేగవంతం చేసి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని పాఠశాలలు ప్రారంభం అయ్యే నాటికి రెండు రోజుల ముందే పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు. వచ్చే ఆగస్టు15 వరకు జిల్లాలోని అన్ని పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసి రాష్ట్రంలోనే ఆదర్శ జిల్లాగా పేరుపొందేలా పాఠశాలలను తయారు చేయాలని అన్నారు. పాఠశాలలు తనిఖీకి ఎప్పుడైనా సెంట్రల్ టీం వచ్చినా పిల్లలకు అన్ని వసతులను ఏర్పాటు చేశామని గర్వంగా చెప్పుకునేలా ఉండాలని కలెక్టర్ అన్నారు. అదనంగా పాఠశాలల్లో తరగతి గదులు గాని కిచెన్ షెడ్స్ కానీ ఇతరత్రా ఏ పని అయిన సెకండ్ ఫేస్ లో కవర్ చేస్తామని అన్నారు.
అంతకుముందు రెండు పాఠశాలల్లో స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా కుట్టించిన స్కూలు యూనిఫామ్స్ ధరించి చిన్నారులు జిల్లా కలెక్టర్ కు పూలతో స్వాగతం పలికారు. డి ఆర్ డి ఓ నరేష్, డిఈఓ రాంకుమార్, తహసిల్దార్ ప్రహ్లాద్, ఎంపిడిఓ వెంకటేశ్వర్లు, పంచాయతీ రాజ్ డిఈ సాయిలు, ఏఈ రవీందర్ పాఠశాలల హెడ్ మాస్టర్లు,
విఓలు తదితరులు పాల్గొన్నారు.
Post Comment