మున్సిపాలిటీలో ప్లాస్టిక్ ను పూర్తిగా అరికట్టండి బాలు నాయక్ ఎమ్మెల్యే
దేవరకొండ : దేవరకొండ పట్టణంలో ప్లాస్టిక్ అమ్మకాలను, వాడకాన్ని పూర్తిగా అరికట్టాలని శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ మున్సిపల్ కమిషనర్ ఎం భాస్కర్ రెడ్డికి ఆదేశించారు. గురువారం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన స్వచ్ఛతనం పచ్చదనం ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవరకొండ పరిశుభ్రత, పచ్చదనం, నియోజకవర్గ ప్రజల ఆరోగ్యమే తన లక్ష్యమని అన్నారు. ప్లాస్టిక్ అమ్మకాలను పూర్తిగా నిషేధిస్తే వాడకం తగ్గుతుందని తెలిపారు. ప్లాస్టిక్ అమ్మకాలపై ఎంతటి వారైనా ఉపేక్షించకుండా తగు చర్యలు వెంటనే తీసుకోని, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని పిలుపునిచ్చారు.
ఇమ్మడి భద్రయ్య, సీనియర్ ఎల్ఐసి ఏజెంట్, సమాజ సేవకులు... : ప్లాస్టిక్ వాడకం నిత్య జీవితంలో ఒక భాగమైందని, ఏ ఇంట్లో చూసినా ఇవి ఎక్కువగా కనబడుతున్నాయన్నాని అన్నారు. రీ సైక్లింగ్‌కు ఉపయోగపడని ప్లాస్టిక్ సంచులు అతిగా వాడి ఎక్కువగా పడేస్తున్నారన్నారని, దీంతో భవిష్యత్తులో చాలా ప్రమాదం సంభవిస్తుందని పర్యావరణ హితులు హెచ్చరిస్తున్నారన్నారని అన్నారు. స్వచ్ఛంద సంస్థలు ప్రజాసేవతోపాటు ప్లాస్టిక్ నిషేధానికి అవగాహనా కల్పిస్తూ తోడ్పటూ అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్లాస్టిక్ నిషేదించి,పర్యావరణాన్ని కాపాడాలని అన్నారు.
Post Comment