BRS I మీకు మీరే.. మాకు మేమే.!?

వాస్తవానికి మైనంపల్లి అక్కడ ఎమ్మెల్యేగా పనిచేసి తన కొడుక్కి టికెట్ ఇవ్వకపోవడంతో ఇక్కడ డి అంటే డి అనే పోటీకి సిద్ధ పడ్డారు..

BRS I మీకు మీరే.. మాకు మేమే.!?

జయభేరి, మల్కాజ్గిరి :  మల్కాజ్గిరి లో రాజకీయ పోరు రసవత్తరంగా సాగనున్న నేపథ్యంలో మల్కాజ్గిరి లోని ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారు అనే సందేహం ఇప్పుడు అందరిని ఆలోచింపచేస్తోంది... వాస్తవానికి మైనంపల్లి అక్కడ ఎమ్మెల్యేగా పనిచేసి తన కొడుక్కి టికెట్ ఇవ్వకపోవడంతో ఇక్కడ డి అంటే డి అనే పోటీకి సిద్ధ పడ్డారు..

నిజానికి మైనం పెల్లికి ఇక్కడ ఎదురు లేదు కానీ ఆయనపై అనేక ఆరోపణలు..ఇప్పుడు గట్టిగావినపడుతున్నాయి.. సమస్య ఎక్కడుంటే నేనక్కడుంటా అని పరిగెత్తే మైనం పెల్లి కి అధికారం కోసం ఎందుకు పాకులాడుతున్నాడు... ఎలాగూ తనకు ఎమ్మెల్యే పదవి అనుభవిస్తున్నప్పటికీ తన కొడుకుకు కూడా ఎమ్మెల్యే పదవిని కట్టబెట్టడానికి ఎందుకు తహతహలాడుతున్నాడు..అనే వాదన మల్కాజ్గిరి నియోజకవర్గంలో బలంగా వినపడుతోంది..

Read More పైడిపెల్లిలో  చెక్ డ్యాం నిర్మాణానికి స్థల పరిశీలన

ఇక ఇది ఇలా ఉంటే తాజాగా బీఆర్ఎస్ కోసమే పని చేస్తాము అంటూ అక్కడ కార్పొరేటర్లు మూకుమ్మడిగా మైనంపల్లికి ఎదురు తిరిగి మాట్లాడడం మైనంపల్లి ఓటమికి దారులు పడుతున్నాయని అనుకోవచ్చు.. ఇన్ని రోజులు అధికార పార్టీలో పదవి అనుభవించి ఇప్పుడు మొఖం చూడకుండా మమ్మల్ని ఇష్ట రీతిగా తిడుతున్నాడు బెదిరిస్తున్నాడు అని కార్పొరేటర్లు మీడియా ముందు చెప్పుకోవడం అంటే మామూలు విషయం కాదు లోలోపల వాళ్ళు ఎంత నలిగి నలిగిపోయారో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే ఖచ్చితంగా అధికార పార్టీలో ఉన్న మర్రి రాజశేఖర్ రెడ్డి కే మా సపోర్ట్ చేస్తామంటూ మూకుమ్మడి రాజీనామాతో మైనంపెల్లి కి ముచ్చెమటలు పడుతున్నాయి..
మర్రి రాజశేఖర్ రెడ్డి గతంలో ఎంపీగా పోటీ చేసి ఓటమిని అనుభవించినప్పటికీ ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసి తన జాతకాన్ని పరీక్షించుకోబోతున్నాడు.. మైనంపల్లి వర్సెస్ మర్రి రాజశేఖర్ రెడ్డి అంటే మల్కాజ్గిరి లోనే ప్రజలు అధికార పార్టీ అందజేసిన పథకాలను అనుభవిస్తూ అధికార పార్టీకే ఓటేస్తారా లేదంటే మార్పు కోసమే ఎక్కువ ముగ్గు చూపుతారా అనేది అధికార పార్టీ కార్పొరేటర్లు వేసిన దెబ్బకు అబ్బ అనే లాగున కనిపిస్తోంది..

Read More ప్రజా పాలనపై కళాయాత్ర ప్రదర్శనలు

అధికార పార్టీలో ఇన్నాళ్లు పనిచేసి ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రతి గడపకు తీసుకెళ్లిన మైనంపల్లికి మర్రి రాజశేఖర్ రెడ్డి దెబ్బకు బలైపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నయి.
ప్రజల అంచనాలను ఎవరు లెక్క వేయగలరు.!?

Read More ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఎన్నిక 

మర్రి రాజశేఖర్ రెడ్డి స్వయన మంత్రి మల్లారెడ్డి అల్లుడు కావడం మంత్రి మల్లారెడ్డి పై ఉన్న ఆరోపణలు తనపై కూడా రావడం ఇప్పుడు మర్రి రాజశేఖర్ రెడ్డిని ఒకంత కలవరానికి గురిచేస్తుంది.. అధికార పార్టీపై ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో విముఖత ఎదురవుతున్నప్పటికీ మల్కాజిగిరిలోని ప్రజలు ఎక్కువగా బి.ఆర్.ఎస్ పార్టీకే మొగ్గు చూపుతున్నారనే నమ్మకంతో కాబోలు మర్రి రాజశేఖర్ రెడ్డి తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నరు. ఇటు మైనంపల్లి తన రాజకీయ పదక రచనలతో మండల బూత్ స్థాయి నుంచి అధికారం కోసం తన అనుచరులను పరుగు పెట్టిస్తున్నాడు.. మంత్రి మల్లారెడ్డి తన అల్లుని గెలిపించుకోవడానికి ఎంతటికైనా దిగజారే ప్రయత్నం చేయక మానడు అలా అని మైనంపల్లి దెబ్బకు మామ అల్లుళ్ళు మామ అంటారా లేకపోతే గులాబీ జెండా నిగరేస్తారా అన్నది ప్రజలే నిర్ణయించాలి...

Read More మొద్దు నిద్రలో రేవంత్ సర్కారు

ఏదిఏమైనా అటు మైనంపల్లి ఇటు మర్రి రాజశేఖర్ రెడ్డి పోటాపోటీగా ఎన్నికల సమరం జరుగుతూనే ఉంది. దినికి తోడు ఎలక్షన్ లో ఎలాగూ మద్యం మాంసం మనీ పంపకాలు జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఈసారి మల్కాజిగిరి నియోజకవర్గం ప్రజలకు ఎన్నికల పండగ మత్తు గమ్మత్తుగా సాగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది...

Read More పోటీ ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు అన్ని రంగాల్లో ప్రావీణ్యం సంపాదించాలి

మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజిగిరి నియోజకవర్గం లో ప్రతి గడపకు తెలుసా అంటే తెలియదు అనే అనుమానాలు ఉన్నప్పటికీ అటు మైనంపల్లి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల కష్టాలను తెలుసుకొని అనుకూల ప్రతికూల సమయాల్లో కూడా అతివృష్టి అనావృష్టి సమయాల్లో కూడా ప్రజలతో ఉంటూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ జననేతగా ఎదిగిన మైనంపల్లి ముందు మర్రి రాజశేఖర్ రెడ్డి విజయాన్ని సాధించగలడా!?
ఇక అధికారం కోసం ఎలాగైనా గెలవాలని ఉద్దేశంతో మర్రి రాజశేఖర్ రెడ్డి చేయని ప్రయత్నాలు లేకపోలేదు. మరి ప్రజలు ఎలా ఆశీర్వదిస్తారో ప్రజాక్షేత్రంలో ఎవరు నెగ్గుతారో ఎవరు ఓటమిని అంగీకరిస్తారో కాలమే నిర్ణయిస్తుంది. ఎంతైనా దొందడుగు స్వభావం గల మైనంపల్లి తన నోటిని అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది అని గుసగుసలు గుప్పును వినిపిస్తున్నాయి... తొందరపాటు దుందుడుకు స్వభావం రాజకీయాల్లో ఎప్పటికీ పనిచేయవు కదా అయినా రాజకీయంలో పెద్దగా మిత్రులు ఉండరు శత్రువులు ఉండరు అందుకనే కాబోలు రాజకీయం అని అన్నారు కాబోలు..!

Read More ఫ్రెండ్ రిసెప్షన్ కి వెళ్లి.. తిరిగిరాని లోకానికి వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి


... కౌంటర్ విత్ కడారి శ్రీనివాస్
సీనియర్ జర్నలిస్ట్

Read More వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా మొద్దునిద్ర వీడని రేవంత్ సర్కార్ 

Latest News

ఫ్రెండ్ రిసెప్షన్ కి వెళ్లి.. తిరిగిరాని లోకానికి వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫ్రెండ్ రిసెప్షన్ కి వెళ్లి.. తిరిగిరాని లోకానికి వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి
జయభేరి, సైదాపూర్  : సైదాపూర్ మండల్ రామచంద్రపూర్ విలేజ్ లో నిన్న రాత్రి రోడ్డు ప్రమాదంలో పొన్నం మహేష్ అనే యువకుడు ఫ్రెండ్ రిసెప్షన్ లో పాల్గొని...
విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం
యాద్గారపల్లి చౌరస్తా లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ నాయకులు
ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు
ప్రజా పాలన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన మొదటి సంవత్సరం అభివృద్ధి పనుల వివరాలు...
ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి