కాసులే ముఖ్యంగా ఆసుపత్రులు...
ఎంబీబీఎస్ వైద్యులనుంచి ఆర్ఎంపీ వైద్యుల దాకా అందరిదీ కమర్షియల్ పంథానే.. మారుమూల పల్లెల్లో ప్రథమ చికిత్సలు అందించే ఆర్‌ఎంపీ, పీఎంపీలు పెద్ద పెద్ద ఆస్పత్రులతో సంబంధాలు పెట్టుకుని ఏజెంట్లుగా వ్యవహరిస్తూ భారీగా కమిషన్లు దండుకుంటున్నారు. చిన్న రోగమైనా ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరితే చాలు అవ సరం లేకున్నా స్కానింగులనీ, ఎక్స్‌రేలనీ, రక్తపరీక్షలనీ ఇలా రోగిని బెంబేలెత్తిస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు పట్టణాలు, మండల కేంద్రాల్లో సైతం ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది.
హైదరాబాద్, జూలై 1 :
లరా నుంచి రీసెంట్ కరోనా దాకా వైద్యులు అందించిన సేవలు వెలకట్టలేనివి.. వైద్య వృత్తిని అంకిత భావంతో నిర్వర్తిస్తూ సమాజానికి వారి వంతు సేవలను అందిస్తున్నారు. సంవత్సరానికి 365 రోజులు రాత్రి పగలు అనే తేడా లేకుండా ప్రజల ఆరోగ్యం కోసం పాటుడతారు వైద్యులు, అర్థరాత్రి తలుపుతట్టి అర్థిస్తే చీకటిని సైతం లెక్క చేయకుండా రోగి కోసం ఆలోచిస్తారు. వైద్యుడు అంటే ప్రాణాలు పోసే దేవుడిలా వైద్య సేవలందించాల్సిన డాక్టర్లు నేడు కమర్షియల్ గా డబ్బులు సంపాదించే యంత్రాలుగా తయారవుతున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కొన్ని ప్రైవేటు ఆస్పత్రులపై వైద్యశాఖాధికారులు ఇటీవల దాడులు నిర్వహించినా ఈ కమీషన్ల దందాపై మాత్రం దృష్టి కేంద్రీకరించకపోవడం గమనార్హం. దందాతో అటు ఆర్‌ఎంపీలు, పీఎంపీలతో పాటు ఆసుపత్రుల యాజమాన్యం లక్షలు గడిస్తున్నా రోగులు మాత్రం ఆర్థికంగా ఇల్లు గుల్ల చేసుకుంటున్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు రోగులను పంపడం, అక్కడ అయిన బిల్లులో రావాల్సిన కమీషన్లు తీసుకోవడం నిత్య వ్యాపారంలా మారింది. గతంలో ఉన్న ఆసుపత్రులకు తోడు ఇటీవల పుట్టుకొస్తున్న ఆసుపత్రు లు ఆర్‌ఎంపీలకు సిరి సంపదలను తెచ్చిపెడుతున్నాయి.
అటు ఆర్‌ఎంపీ, పీఎంపీలకు భారీగా కమీషన్లు ఇచ్చి ఇటు రోగుల జేబులకు చిల్లులు పొడుస్తున్నారు. రోగుల ప్రాణాలను అడ్డం పెట్టుకొని దోపిడీ చేస్తున్న వైద్య వ్య వస్థపై ప్రజల్లో తీవ్రమైన అసహనం ఉన్నప్పటికీ ఏం చేయలేని పరిస్థితి. సాధారణ జబ్బుతో ఆసుపత్రికి వెళ్తే లేని పోని భయాందోళనలు సృష్టించి రోగిని ఆసుపత్రిలో అడ్మిట్ చేస్తున్నారు. లెక్క లేని పరీక్షలు చేయడం, అ వసరం లేకున్నా అడ్డగోలుగా మందులు ఇస్తూ రోగి జేబును గుల్ల చేస్తు న్నారు. ఆరోగ్యం బాగా లేక ఆసపత్రిలో చేరుతున్న రోగులకు బిల్లులు చూ సి మానసికంగా, ఆర్థికంగా కుదేలవుతున్నారు. ఇంతటి దోపిడీ జగిత్యాల పట్టణంలోని పలు ఆసుపత్రులు మొదలుకోని జిల్లాలోని కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్, దర్మపురి వంటి పట్టణాల్లోని పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కొనసాగుతోంది.
కొన్ని ఆసుపత్రుల్లో సవ్యంగా వైద్యసేవలు అందుతున్న ప్పటికీ వ్యాపారదృక్పథంతో ఏర్పాటు చేసిన పలు ఆసుపత్రుల్లో డబ్బు సంపాదించడమే లక్ష్యంగా మారింది. జిల్లాలో పలు ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ తారాస్థాయికి చేరింది. రోగి ని దోచి ఆర్‌ఎంపీ, మద్యవర్తికి కొంత ఆసుపత్రి యాజమాన్యం మరికొంత పంచుకుంటున్నారు. ఇది వరకు కాలంలో రోగులను ఆసుపత్రులకు పంపే ఆర్‌ఎంపీలకు అడపాదడపా గిఫ్ట్‌లు ఇచ్చేవారు. కానీ గడిచిన నాలుగైదు ఏళ్లుగా ఆర్‌ఎంపీలకు కమీషన్లు అడ్డగోలుగా పెంచేశారు. పోటాపోటీగా ప్రైవేటు యాజమాన్యాలు అక్రమ సంపాదనకు ఆశపడి పలువురు ఆర్ ఎంపీలను ఏజెంట్లుగా, మద్యవర్తులుగా నియమించుకుంటున్నారు.
ఒక్కో ఆసుపత్రిలో ఒక్కో తీరుగా 15 నుంచి 20 శాతం కమీషన్లను అప్పజెపు తున్నారు. బహిరంగంగానే పలు ప్రైవేటు ఆసుపత్రులు మద్యవర్తులతో బే రసారాలు కుదుర్చుకుంటున్నాయి. జగిత్యాల పట్టణంలో పదికి పైగా, కోరు ట్ల పట్టణంలో అయిదారు, మెట్‌పల్లిలో సుమారు పది ఆసుపత్రుల్లో, ధర్మ పురి, రాయికల్ వంటి పట్టణాల్లో సైతం ఆర్‌ఎంపీలు, మద్యవర్తులకు అ డ్వాన్స్‌లు చెల్లించి ప్రోత్సహిస్తుండడం గమనార్హం. ముందుగానే డబ్బులు చెల్లించి రోగుల బిల్లుల నుంచి వచ్చే కమీషన్‌ను అందులో నుంచి మినహా యించుకుంటున్నారు.
పలువురు ఆసుపత్రుల నిర్వాహకులు విదేశాలకు ట్రిప్‌లకు సైతం పంపిస్తున్నారంటే వ్యాపారం ఏ మేరకు నడుస్తుండో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలోని పలు పల్లెలు, పట్టణాల్లో పలువురు ఆర్‌ఎంపీలు అనధికార ఆసుపత్రులను ఏర్పాటు చేసుకుంటున్నారు. పలువురు ఆర్‌ఎంపీలు ఆసుపత్రు లలో నాలుగు, అయిదు బెడ్లను ఏర్పాటు చేసుకొని వైద్యం చేస్తున్నారు. పరీక్షల పేరిట పరిచయం ఉన్న ల్యాబ్‌లకు రోగులను పంపి కమీషన్లు దండుకుంటున్నారు. రోగి పరిస్థితి కొద్దిగా తీవ్రంగా ఉంటే చాలు వెంటనే ఒప్పందం కుదుర్చుకున్న ప్రైవేటు ఆసుపత్రికి పంపడం.. అక్కడి నుంచి కమీషన్ తీసుకోవడం..ఇదీ జరుగుతోంది.
Post Comment