మూడు చింతల పల్లి మండలంలో పర్యటించిన కలెక్టర్
- స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో నడుస్తున్న కుట్టు శిక్షణ కేంద్రాన్ని పరిశిలీంచిన కలెక్టర్ గౌతమ్
- పాఠశాలల పున ప్రారంభం నాటికి అన్ని సదుపాయాలు కల్పించాలి
జయభేరి, మే 23:
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సదుపాయాలు కల్పించాలని, అదేవిధంగా పాఠశాలల ప్రారంభానికి ముందే విద్యార్థిని, విద్యార్థులకు యూనిఫాంలు అందించాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ అధికారులను ఆదేశించారు.
ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాల నుండి వచ్చిన నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పాఠశాలల్లో పెండింగ్ లో ఉన్న మరమ్మతు పనులను సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. అదేవిధంగా పాఠశాలల్లో ఎల్ ఈ డీ బల్బులను వాడాలన్నారు. ప్రైవేట్ కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యా బోధన జరిగేలా ఉపాధ్యాయులు కృషి చేసి మెరుగైన ఫలితాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అంతే కాక తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపేలా కమిటీ సభ్యులు విద్యార్థుల తల్లిదండ్రులను ప్రోత్సహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో తాసిల్దార్ వెంకట నర్సింహారెడ్డి, రెవిన్యూ ఇన్స్పెక్టర్ రాఘవ,ఎంపిడివో వత్సల దేవి, మెప్మా అధికారి అనిల్ కుమార్, డిపిఎం సురేఖ, అసిస్టెంట్ డైరెక్టర్ లింగానందం, ఎయంవో రవీంద్ర రాజ్, పంచాయితీ రాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వేణుగోపాల్, ఏ ఈ శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు సుబ్బారావు, అమ్మ ఆదర్శ పాఠశాల ఛైర్మన్ సులోచన, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
Post Comment