Tet : టెట్ పై మళ్లీ గందరగోళం
- ఈ క్రమంలో మే 20 నుంచి జూన్ 3 వరకు టెట్ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని ఇప్పటికే విద్యాశాఖ అధికారులు ప్రకటించడంతో అసలు ఆయా తేదీల్లో పరీక్షలు ఇంటాయో.. లేదోనని అభ్యర్ధులు గందరగోళంలో పడ్డారు.
హైదరాబాద్, ఏప్రిల్ 26 :
తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్ 2024) ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన తేదీలు కూడా ఇప్పటికే విద్యాశాఖ విడుదల చేసింది. సార్వత్రిక ఎన్నికల అనంతరం మే 20 నుంచి జూన్ 3 వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. ఈసారి ఆన్‌లైన్ విధానంలో టెట్ పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ పేర్కొంది. ఇక జూన్ 12న టెట్ 2024 ఫలితాలు కూడా ప్రకటిస్తామని షెడ్యూల్‌లో పేర్కొంది. దీంతో నిరుద్యోగులు టెట్ ప్రిపరేషన్‌లో మునిగిపోయారు. అయితే సార్వత్రిక ఎన్నికల గండం గడిచినా.. మ్మెల్సీ ఉప ఎన్నిక ప్రభావం టెట్ పరీక్షపై పడుతుందేమోనని పలువురు ఆందోళన చెందుతున్నారు.
Latest News
విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం
11 Dec 2024 15:37:30
జయభేరి, మేడిపల్లి : రాచకొండ పోలీస్ కమిషనరేట్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుడమి హై స్కూల్ బోడుప్పల్ లో మేడిపల్లి పోలీస్ వారి ఆధ్వర్యంలో ట్రాఫిక్...
Post Comment