Congress I లెక్కలు తేల్చాల్సిందే...

తెలంగాణ రాష్ట్రంలో తాజాగా కుల గణన అంశం తెరకెక్కింది.. కుల గణన చేయడం ద్వారా ఎవరికి లాభం?

Congress I లెక్కలు తేల్చాల్సిందే...

- జయభేరి, హైద‌రాబాద్ :

తెలంగాణ రాష్ట్రంలో తాజాగా కుల గణన అంశం తెరకెక్కింది.. కుల గణన చేయడం ద్వారా ఎవరికి లాభం? ఎవరికి నష్టం ? రాజకీయ పార్టీలకు ఏమైనా చెంపపెట్టు అవుతుందా? అభివృద్ధి సంక్షేమ ఫలాలకు ఆటంకం వాటిల్లుతుందా!? కులగణన చేయడం ద్వారా ఎలాంటి వ్యతిరేక ప్రభావం ఆయా ప్రభుత్వాలపై చూపనుంది? అన్న అనేక ప్రశ్నలు ఇప్పుడు కులగణన అంశంపై రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'జయభేరి' పాఠకులకు సీనియర్ జర్నలిస్ట్ అక్షరంతో కౌంటర్ విత్ కడారి శ్రీనివాస్ సమగ్ర రాజకీయ విశ్లేషణ...

Read More కాంగ్రెస్ గెలుపుపై గజ్వేల్ లో సంబరాలు

1850, 60 ఆ ప్రాంతంలో బ్రిటిష్ గవర్నమెంట్ కుల గణన వ్యవహారాన్ని మొదలు పెట్టింది. ఆ తర్వాత దేశం నలుమూలల 1872 నుంచి 1931 వరకు కులాల జనాభా లెక్కలు చేయకుండా పక్కన పెట్టేశారు.. 1953 జాతీయ బీసీ కమిషన్ కాక కలెక్టర్ ఆధ్వర్యంలో కులగణన చేయాలని తేల్చినప్పటికీ 1961లో నాటకీయంగా కుల అధికారిక కమిటీ చేయూతను అందివ్వలేకపోయింది. స్థానిక సంస్థల రిజర్వేషన్ ప్రకారం కులాల లెక్కలు తేల్చాలని ఆయా రంగాల్లో ఉన్న బడుగు బలహీన వర్గాల ప్రజలకు సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో సంక్షేమ అభివృద్ధి జరగడానికి 1951లో కులాల లెక్క ప్రస్తావన విపరీతంగా చోటుచేసుకుంది..

Read More తెలంగాణ భవన్లో ఘనంగా దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ జన్మదిన వేడుకలు

ఇది చరిత్ర కానీ దేశంలో 50 శాతం కంటే ఎక్కువ బడుగు బలహీన వర్గాలు ఆర్థిక సామాజిక న్యాయం కోసం డిమాండ్ చాలా అని పెరిగిందని చెప్పాలి... అందుకోసం రాహుల్ గాంధీ కులగణన లెక్కలు తేల్చాలి అంటూ డిమాండ్ ను తెరపైకి తీసుకువచ్చారు.. రాజ్యసభల్లో శాసనసభల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కులగలను చేపట్టింది... ఈ నేపథ్యంలో దేశంలోని బీహార్ ఒరిస్సా మహారాష్ట్ర హర్యానా, చత్తిస్ ఘడ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఓ 8 రాష్ట్రాల్లో కులగనలను చేపడుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇదిలా ఉంటే 2011లో జనాభా లెక్కలు జరిగాయి.. క్యాస్ట్ సన్ సెక్ట్ ను ఆ జనాభా లెక్కల్లో బయట పెట్టలేకపోయారు. 2015 తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే అనే ఒక సర్వేను చేయించి నప్పటికీ ఆ సర్వే వివరాలను అందులో పొందుపరిచిన అంశాలను బయట పెట్టలేకపోయారు.

Read More టిటిడి బోర్డ్ సభ్యులు మహేందర్ రెడ్డి ఎన్నికవడం పట్ల హర్షం

ఆర్టికల్ 246 ప్రకారం అలాగే 14 48 ఆర్టికల్స్ ప్రకారం  కులగణన చేయాల్సి ఉండగా, రాజ్యాంగం అమలు తర్వాత కులగణను ఆపేశారు. ఈ సెక్షన్ల ప్రకారం జనాభాలో ఎక్కువ శాతం ఉన్నవాళ్లకి విద్య ఉద్యోగ రాజకీయ హక్కులు కలిగించాలని 1947 నల 51నుండీ ఎస్సీ ఎస్టీ కులాల గణన చేసినప్పటికీ, బీసీ కుల గణన చేయలేకపోయారు.. స్థానిక రాజకీయ లలో బీసీలకు 34 శాతం పెట్టాలని నాడు సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉంది. మొత్తానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏడు సార్లు కుల గణన చేసినప్పటికీ బీసీ కులగణన చేయలేకపోవడంపై బీసీ సామాజిక వర్గాల్లో బలంగా కుల గణన చేయాల్సిందే అన్న డిమాండ్ ఎక్కువగా వస్తుంది.

Read More ప్రజా పాలనపై కళాయాత్ర ప్రదర్శనలు

ప్రధానంగా ఇప్పుడు కులగణన చేయాల్సిందే అనే డిమాండ్ వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చింది అనే విషయం సర్వత్ర ఆసక్తిని రేఖిస్తుంది... ఇక బిజెపి ప్రభుత్వం అయోధ్య రామ మందిరం ఇలాంటి మతపరమైన రాజకీయానికి తెల లేపగా చేసేది ఏం లేక కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన ప్రస్తావన తీసుకువచ్చింది.

Read More ప్రజా పాలన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన మొదటి సంవత్సరం అభివృద్ధి పనుల వివరాలు...

నిజమే కుల గణన బీహార్లు జరిగిన తర్వాత అక్కడి పరిణామాలు ఏంటి!? అనేది ఒకసారి తెలుసుకుందాం... బీహార్లో కుల గణన చేసిన తర్వాత స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ వైద్య ఉద్యోగాల్లో వెనుకబడిన తరగతులకు బీసీలకు 63 శాతం వేషం పెట్టాల్సి ఉండగా ప్రస్తుతం బీహార్లు 30 శాతం మేరకే అమలు అవుతూ విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో వెనుకపాటు తను ఉందని తేలింది..

Read More క్రియాశీల సభ్యత్వం పొందిన దయాకర్ రెడ్డి 

బీసీలకు 12 శాతం రిజర్వేషన్ కేటాయిస్తుండగా వారికి రావలసినది 18 శాతం రిజర్వేషన్ రావాలి అని తేలింది. అలాగే ఓబిసి 25 శాతానికి రిజర్వేషన్ ఉండగా వారికి 18 శాతానికి అమలవుతోంది. అలాగే ఎస్సీలకు 20 శాతం రిజర్వేషన్ ఉండాల్సి ఉండగా వారికి 15 శాతం రిజర్వేషన్ అమలవుతోంది ఇలాంటి ఎన్నో అవకతవకలు జనాభా లెక్కలు చేయడం ద్వారా అన్ని సమస్యలను సరి చేయడానికి ఒక మంచి అవకాశం గా మారింది.. బీహార్ రాష్ట్రంలో మొత్తానికి రిజర్వేషన్ 75 శాతానికి పెరిగింది అంటే కేవలం కుల గణన చేయడం ద్వారానే ఈ సమస్యల పరిష్కారానికి జవాబు దొరికింది. అయితే కొన్ని రాజకీయ శక్తుల పథకం ప్రకారం కులాల లెక్కల తేలిస్తే కేంద్ర రాష్ట్రాల మధ్య సంయోగ్య చెడిపోతుంది చీలికలు వస్తాయి వ్యతిరేక ప్రభావాలు ఏర్పడతాయి అని చెప్పడం రాజకీయ కుట్రే అంటున్నారు బీసీ సామాజిక వర్గానికి చెందిన మేధావులు...

Read More పైడిపెల్లిలో  చెక్ డ్యాం నిర్మాణానికి స్థల పరిశీలన

బీహార్ జాతీయ కులగణన అధికారిక లెక్కల ప్రకారం అక్కడ జనాభా 13 కోట్లకు పైగా ఉన్న ఆ రాష్ట్రంలో జనాభా లెక్కల తరువాత కుల గణన తరువాత ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో మంచి మార్పు వచ్చింది. అలాగే ఆ రాష్ట్ర బడ్జెట్లో ఏ కులానికి ఎంత బడ్జెట్ పెట్టాలి అనే విషయం అయింది.. 

Read More గూగుల్ తో తెలంగాణ సర్కార్ ఒప్పందం

సంక్షేమం అభివృద్ధి నిజమైన బడుగు బలహీన వర్గాలకు లబ్ధి చేకూరేలా దారి సుగమయింది. కుల గణన తర్వాత అసమానతలు పూర్తిగా తొలగిపోయాయి. మొత్తానికి బీహార్ రాష్ట్రంలో కుల గణన చేయడం ద్వారా ఉన్నత వర్గాల్లో ఉన్న పేదవారికి ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో వెలుసుబాటు కలిగింది.. మొత్తానికి ఏ వర్గం ఏ కులంలో ఎంత జనాభా ఉందో తెలుసుకోవడం ద్వారా అక్కడి జనాభాలో 34 శాతం నెలసరి ఆదాయం 6000 కంటే తక్కువగా ఉందని తేల్చి చెప్పేసింది ఆ ప్రభుత్వం. తద్వారా ఎంబీసీ బీసీలకు 63 శాతం రిజర్వేషన్ ఉండగా 33 శాతాన్ని ఇస్తున్నారు కుల గణన తర్వాత 43 శాతానికి పెంచారు.. అలాగే ఎస్సీ 20 శాతం రిజర్వేషన్ లభించింది..మొత్తానికి వెనుకబడిన తరగతుల వారికి కుల గణన తరువాత అధికారికంగా వారి జనాభా నిష్పత్తి ప్రకారం రాజకీయ సామాజిక ఆర్థిక విద్య ఉద్యోగ సంక్షేమ అభివృద్ధి రంగాల్లో నిజమైన బడ్జెట్ను కేటాయించే అవకాశం లభించింది...

Read More ములుగు జిల్లా చల్పాక ఎన్ కౌంటర్ పై హైకోర్టులో నేడు విచారణ!

బీహార్ రాష్ట్రంలో కుల గణన చేయడం ద్వారా ఇలాంటి ఎన్నో చిక్కు ప్రశ్నలకు సమాధానం లభించిందని కుల గణన చేయడం ద్వారా కేంద్ర రాష్ట్ర మధ్య వ్యత్యాసం భిన్నాభిప్రాయాలు ఏమీ రావని దీని ద్వారా మనకు అర్థమవుతుంది... 2018 ముందు 102 సార్లు రాజ్యాంగ సవరణ బిజెపి చేసింది ఆర్టికల్ 15 (4)16 (4)ప్రకారం బీసీ లను వేరు చేయాలి. అందుకని రాష్ట్రాలు బీసీ కుల గణన కచ్చితంగా చేయాలి కానీ కొన్ని రాష్ట్రాలు ఈ కుల గణను వ్యతిరేకిస్తున్నాయి.

Read More ప్రపంచం కమ్యూనిస్టుల వైపు చూస్తున్నది... 

పది సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంటూ మూడవసారి అధికారంలోకి రావాలని ఉద్దేశంతో అయోధ్య రామ మందిరం మతం రామ పాలన అంటూ మతాన్ని ముందర వేస్తూ రాజకీయ లబ్ధి కోసం చూస్తున్న తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన అనే అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి కచ్చితంగా కుల గణన చేసి బీసీలకు పట్టం కట్టాలి అనే ఆలోచనలతో కుల గణన చేయాల్సిందే అంటూ బీహార్ రాష్ట్రంలో కుల గణన జరిగిన తర్వాత ఆ పరిణామాలను తెరపైకి తీసుకువస్తుంది...

నిజానికి మహిళా బిల్లును ప్రవేశపెట్టిన బిజెపి ప్రభుత్వం కేంద్రంలో మహిళ మంత్రిత్వ శాఖ ఉన్న మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ తక్కువగా ఉంది... మరి కులగణన చేయడం ద్వారా బిజెపికి వచ్చిన నష్టం కూడా ఏమీ లేదు.. త్వరలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ను కేటాయించే సమయంలో కులగణన చేయడం ద్వారా జనాభా నిష్పత్తి ప్రకారం ఏ కులానికి ఎంత ఆర్థిక రాజకీయ సామాజిక న్యాయం అభివృద్ధి సంక్షేమం అందివ్వాలి సులువుగా తెలిసిపోతుంది..

ఏది ఏమైనప్పటికీ ఆయా రాష్ట్రాల్లోని ప్రజలు బిసి కుల గణన చేయాల్సిందే అంటూ బీసీలకు జరుగుతున్న అన్యాయం నీ వివరిస్తూ మా వాటా మాకు కావాల్సిందే అంటూ తమ గొంతును వినిపిస్తున్నారు... స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి ఎస్సీ ఎస్టీ కులగలను చేస్తూ రిజర్వేషన్లు కేటాయిస్తూ వస్తున్న తరుణంలో కచ్చితంగా ఈసారి దేశం మొత్తం కులగణనం జరిపించి జనాభా నిష్పత్తి ప్రకారం వారికి రిజర్వేషన్లను అమలు చేయాలని అన్ని రంగాల్లో అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయాన్ని కలిగించాలనే డిమాండ్ వస్తోంది... ఏది ఏమైనా బిజెపి వేసిన మతపరమైన రాజకీయ ఎత్తుగడలకు కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన అనే అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి రానున్న ఎన్నికల్లో బిజెపికి చెక్ పెట్టాలని చూస్తోంది... మొత్తానికి సమాజంలోని అన్ని సామాజిక కులల జనాభా నిష్పత్తి ప్రకారం సామాజిక ఆర్థిక న్యాయ విద్య ఉద్యోగ భద్రత అభివృద్ధి సంక్షేమం సమపాళ్లల్లో అందాల్సిందే ఇది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు....

...-  కడారి శ్రీనివాస్
 కాలమిస్ట్, కవి, సీనియర్ రాజకీయ విశ్లేషకులు
9848 962 799

Latest News

ఫ్రెండ్ రిసెప్షన్ కి వెళ్లి.. తిరిగిరాని లోకానికి వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫ్రెండ్ రిసెప్షన్ కి వెళ్లి.. తిరిగిరాని లోకానికి వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి
జయభేరి, సైదాపూర్  : సైదాపూర్ మండల్ రామచంద్రపూర్ విలేజ్ లో నిన్న రాత్రి రోడ్డు ప్రమాదంలో పొన్నం మహేష్ అనే యువకుడు ఫ్రెండ్ రిసెప్షన్ లో పాల్గొని...
విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం
యాద్గారపల్లి చౌరస్తా లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ నాయకులు
ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు
ప్రజా పాలన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన మొదటి సంవత్సరం అభివృద్ధి పనుల వివరాలు...
ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి