అమ్మ ఆదర్శ పాఠశాలల్లో అభివృద్ధి పనులు నూటికి నూరు శాతం పూర్తి కావాలి..

ఇది మాస్కూల్ అని బావించి పనులు చేపట్టాలి... రేపటి కొరకు ఇప్పుడే సంసిద్దంగా కావాలి....

విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ పాఠశాలలను బడిబాట కార్యక్రమం కొరకు ముందుగానే సంసిద్దంగా ఉండాలన్నారు. జిల్లాలో 345 పాఠశాలల్లో అమ్మఆదర్శపాఠశాల పనులకు శ్రీకారం చుట్టగా కొన్ని పాఠశాలలో పనులలో నిర్వహించే పనులలో విద్యాశాఖ అధికారుల ప్రమేయం ఉండడం లేదని, పనులను పూర్తిచేయడంలో అధికారులు పూర్తి నిబద్దతతో వ్యవహరించాలని  సూచించారు... అమ్మఆదర్శపాఠశాల పనుల పురోగతిపై సమీక్షించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

అమ్మ ఆదర్శ పాఠశాలల్లో అభివృద్ధి పనులు నూటికి నూరు శాతం పూర్తి కావాలి..

జయభేరి, కరీంనగర్ :
పాఠశాలలో ఎటువంటి లోపాలు లేకుండా విద్యార్థులకు అన్ని వసతులు, సౌకర్యాలతో కూడిన విద్యను అందించే దిశగా ప్రభుత్వం చేపడుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి పనులు నూటికి నూరు శాతం పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ పమేలా సతపతి అధికారులను ఆదేశించారు.

కలెక్టరేట్ ఆడిటోరియంలో విద్యాశాఖ, ఆర్ ఆండ్ బి. ప్రత్యేకాధికారులతో అమ్మ ఆదర్శపాఠశాల అభివృద్ధి పనుల ప్రగతి, మంచినీటి సరఫరా, విద్యార్థుల ఏకరూప దుస్తుల తయారీ తదితర అంశాలపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తొ కలిసి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్షించారు.

Read More విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం

ఈ సందర్బంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ... విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ పాఠశాలలను బడిబాట కార్యక్రమం కొరకు ముందుగానే సంసిద్దంగా ఉండాలన్నారు. జిల్లాలో 345 పాఠశాలల్లో అమ్మఆదర్శపాఠశాల పనులకు శ్రీకారం చుట్టగా కొన్ని పాఠశాలలో పనులలో నిర్వహించే పనులలో విద్యాశాఖ అధికారుల ప్రమేయం ఉండడం లేదని, పనులను పూర్తిచేయడంలో అధికారులు పూర్తి నిబద్దతతో వ్యవహరించాలని సూచించారు.. మొదటి ప్రాధాన్యతగా మౌలిక సౌకర్యాలైన మంచి నీరు, టాయిలెట్స్ మరమ్మత్తులు, విద్యుత్తు పనులను చేపట్టి సత్వరం పూర్తయ్యేలా మండల ప్రత్యేక అధికారుల నిత్యం పర్యవేక్షించాలని ఆదేశించారు.

Read More విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి

91 (2)

Read More ప్రజా సంక్షేమమే కాంగ్రేస్ ప్రభుత్వ లక్ష్యం...  ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి

పనుల్లో ఖచ్చితమైన నాణ్యత ప్రమాణాలను పాటించాలన్నారు. పాఠశాల గదులు, ప్రాంగణాలు ఆక్రమణకు గురికాకుండా నిత్యం పర్యవేక్షించాలని ఆదేశించారు. అమ్మఆదర్శ పాఠశాల పనుల కొరకు నిధులను సమకూర్చడం జరిగిందని,వాటిని సక్రమంగా వినియోగించి చేపట్టిన పనులు, తద్వారా వినియోగించిన నిధుల వివరాలను యంఈఓ లు, హెచ్.ఎం. లు దృవీకరించాలని ఆదేశించారు. అదేవిధంగా పనుల నిర్వహణలో నిర్లక్ష్య్రంగా వ్యవహరిస్తూన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో ఎంతమాత్రం ఉపేక్షించనని హెచ్చరించారు.  ప్రభుత్వం సంకల్పించి చేపడుతున్న పాఠశాలల అభివృద్ది పనులను మీకు సంబంధించినవి గానే భావించాలని అప్పుడే నిర్దేశించుకున్న విజయాన్ని సాధించగలమని పేర్కోన్నారు.  

Read More పేకాట స్థావరంపై పోలీసుల దాడి...

పాఠశాలల్లో చేపట్టే ప్రతి పని అది ఎంత వరకు పూర్తిచేయడం జరిగింది ఆనే వివరాలను రికార్డులలో నమోదు చేయాలని ఆదేశించారు.  పాఠశాల అభివృద్ది కొరకు జరిగే ప్రతి పనిని తమ స్వంత పనిగా బావించి ప్రదానోపాద్యాయులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలన్నారు.  విద్యార్థిని విద్యార్థులకు సంబంధిత పాఠశాలలో తీసుకున్న కొలతల ఆధారంగా ఎకరూప దుస్తుల తయారు కావాలని వాటిని  హెచ్ ఎం లు పర్యవేక్షించాలని.  దుస్తుల తయారీలో నాణ్యతను తప్పక పాటించాలని  సూచించారు.  జూన్ 10 లోగా పనులు పూర్తి చేయాలని ఈ సందర్బంగా అధికారులకు సూచించారు.  

Read More సీసీ కెమెరాల ఏర్పాటుకు హెచ్ బి ఎల్  పరిశ్రమ సహకారం

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ... అమ్మఆదర్శ పాఠశాలలకు సంబంధించిన ప్రతి పనిని రికార్డులలో నమోదు చేయాలన్నారు. వేసవి సెలవులు పూర్తిచేసుకొని తిరిగి పున ప్రారంభం అయ్యే నాటికి ఏ పని పెండింగ్ లేకుండా ఉండాలన్నారు. సివిల్ త్వరగా పనులు పూర్తిచేసినట్లయితే, పెయింటింగ్ పనులు ఎజేన్సిలు చేపడతాయని తెలిపారు.  పాఠశాలల వద్ద బయో ఫెన్సింగ్ చేపట్టాలని తెలిపారు. పాఠశాలలు, స్థలాలు అన్యాక్రాతం కాకుండా పకడ్బందీగా వ్యవహరించాలని ఆదేశించారు. ఇంకా ఏవైన సమస్యలు ఉన్నట్లయితే మా దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఈఓ జనర్దన్ రావు, ఈఈ ఆర్ ఆండ్ బి శ్రీనివాస్, ప్రత్యేకాధికారులు, విద్యాశాఖ అధికారులు పాల్గోన్నారు.

Read More నేత్రపర్వం నాచగిరి క్షేత్రం...

Latest News

విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం
జయభేరి, మేడిపల్లి : రాచకొండ పోలీస్ కమిషనరేట్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుడమి హై స్కూల్ బోడుప్పల్ లో మేడిపల్లి పోలీస్ వారి ఆధ్వర్యంలో ట్రాఫిక్...
యాద్గారపల్లి చౌరస్తా లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ నాయకులు
ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు
ప్రజా పాలన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన మొదటి సంవత్సరం అభివృద్ధి పనుల వివరాలు...
ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి 
మొద్దు నిద్రలో రేవంత్ సర్కారు