Drugs : యువతను పట్టి పీడించే మహమ్మారి డ్రగ్స్
డ్రగ్స్ మహమ్మారిపై ఎలా నిర్మూలించాలి అన్న విషయంపై "జయభేరి" కౌంటర్ శ్రీనివాస్ సమగ్ర విశ్లేషణ...
తెలంగాణ రాష్ట్రంలోని రాజధానిలో డ్రగ్స్ మహమ్మారి యువతను పట్టిపీడిస్తోంది. ఇలాంటి డ్రగ్స్ మహమ్మారిపై ఎలా నిర్మూలించాలి అన్న విషయంపై "జయభేరి" కౌంటర్ శ్రీనివాస్ సమగ్ర విశ్లేషణ...
లేలేత ప్రాయంలోనే విలాసాలకు అలవాటు పడ్డ యువత, అనతి కాలంలోనే జీవితాన్ని బుగ్గిపాలు చేసుకుంటుంది. తాజాగా హైదరాబాదులోని సనత్ నగర్ ఎండిఎం ఏ డ్రగ్స్ ముఠాను రాజేంద్రనగర్ ఎస్ఓటి పోలీస్ టీం సీజ్ చేసింది. ఈ సందర్భంగా డ్రగ్స్ అరికట్టాలంటే మనం ఏం చేయాలి !?తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి!? ముందు కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉందా!? లేదా!? అందరూ ప్రశ్నించుకుంటూ పోతే మరి సమాధానం ఎవరు చెప్పాలి. రాజకీయ లబ్ధి కోసం రాజకీయ నాయకులు రాజకీయాన్ని చేస్తున్న సామాజిక బాధ్యతను ఎవరు తీసుకోవాలి!? ప్రశ్నల పరంపర కొనసాగితే సమాధానం కరువైపోతుంది. అందుకే ఆ బాధ్యతను జయభేరి న్యూస్ గురుతర బాధ్యతగా తీసుకొని సమస్యల ప్రశ్నల పరిష్కారానికి నడుం కట్టింది. సమాజంలో పరిష్కారం కానీ ఎన్నో విషయాలపై ఖచ్చితమైన సమాధానాన్ని అందించే భాగంగా ప్రయత్నిస్తుంది.
భారతీయ సనాతన ధర్మంలో ఎన్నో విషయాలు ఆధ్యాత్మిక ప్రబోధనల ద్వారా యువతకి సమాజానికి అందరికీ ఒక మంచి మెసేజ్ ను అందజేసింది. కానీ మారుతున్న కాలానికి మనుషులు మారుతున్న నేటి సమాజంలో, యువతను పట్టిపీడించేది డ్రగ్స్ గంజాయి గాంజా ...ఇలా ఏ పేరుతో పిలిచిన అది ఒక మత్తు పదార్థం.... పేర్లు వేరయినప్పటికీ ముఖ్యంగా యువతను పట్టి పీడిస్తున్న భూతాల్లో డ్రగ్స్ ఒకటి అని కచ్చితంగా చెప్పక తప్పదు. ముఖ్యంగా డ్రగ్స్ క్రయ విక్రయాలు చట్ట విరుద్ధమని తెలిసినప్పటికీ, కొంతమంది దుండగులు డబ్బు సంపాదన ధ్యేయంగా ఎంచుకొని, యువతకు గురిపెడుతూ, ఈజీగా డబ్బు సంపాదించడానికి అలవాటు పడిపోతున్నారు. యువతను డ్రగ్స్ మత్తు పదార్థాలకు అలవాటు చేసి నాశనం చేసే ఒక వైరస్ గా డ్రగ్స్ భూతం యువతను పట్టిపీడిస్తోంది.
ముఖ్యంగా మన భారతదేశంలో కుటుంబ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంటుంది. అలాంటి మనదేశంలోని ప్రతి ఒక్క కుటుంబం కష్టపడి పని చేస్తూ పిల్లల్ని చదివించాలనే ఆలోచనలతో 80% మంది కుటుంబాలు ఉంటున్న.. మిగతా కుటుంబాల్లో వ్యాపార అభివృద్ధి తో పాటు విలాసాలకు విందులకు అలవాటు చేసే కుటుంబాలు లేకపోలేదు. పిల్లలు ఎప్పుడైతే కుటుంబ వ్యవస్థలో నుంచి క్రమశిక్షణ పద్ధతి నేర్చుకుంటారో, సమాజంలోకి వచ్చిన తర్వాత తోటి స్నేహితులకు తో విలాసాలకు అలవాటు పడి మారకద్రవ్యాల వలలో నేటి యువత పడుతోంది.
ఒకవైపు కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండి కుటుంబంలో మంచి అలవాట్లే అలవర్చుకున్న అది విద్య వ్యవస్థలోకి వచ్చిన తర్వాత, తోటి స్నేహితులు విద్యా కళాశాల పరిసర ప్రాంతాలు కలుషితమై పోవడం, విద్యార్థులు విలాసాలతో తమ జీవితాన్ని మొదలు పెట్టుకోవడానికి ఎక్కువ అలవాటు పడుతుంటారు... దీని ద్వారా యువత లేలేత ప్రయాణంలోనే విలాసాలతో తమ జీవితాన్ని ప్రారంభించుకొని మారకద్రవ్యాల మత్తు ఉచ్చులో నేటి యువత తమ జీవితాలను తామే బుగ్గి చేసుకుంటుంది.. ఎదిగే వయస్సులోని మత్తుకు బానిసై జీవితాన్ని బలి పెట్టుకుంటుంది నేటి యువత.
రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ అన్ని వ్యవస్థలో పతనం అయిందని రాజకీయ నాయకులు చెబుతున్నప్పటికీ కొంతమేర అభివృద్ధి జరిగిందనేది సత్యం. ప్రతిదీ మనం ప్రశ్నించుకుంటూ పోతే సమాధానం ఎవరు చెప్పాలి!? ప్రశ్నలు వేయడమే జీవితం కాదు సమాధానాలు వెతికి ఆ ప్రశ్నలకు మనమే ఒక సమాధానం అయితే ఆ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. నిజానికి విద్యార్థి దశలో ప్రాథమికంగా తల్లిదండ్రుల భయం, పాఠశాలల్లో టీచర్ల భయం, ఎక్కువగా ఉన్నప్పటికీ కళాశాల విద్యా వ్యవస్థలోకి వచ్చేసరికి యువత మత్తు వలయంలో చిక్కుకుంటుంది. దీని నుంచి కాపాడుకోవాలి అని అంటే ముఖ్యంగా యువత తమకు తామే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లల పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే తల్లిదండ్రులు కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా పడి పిల్లలను కొంతమంది తల్లిదండ్రులు పట్టించుకోరు. దీని ద్వారా పిల్లలు చెడు అలవాట్లకు అలవాటు పడే స్నేహితులు ఎక్కువగా ఉండటం వల్ల, విద్యార్థి పరిస్థితి విషమించే వరకు చాలామంది తల్లిదండ్రులు వారి గురించి పట్టించుకోరు కనీసం మందలించరు. ఇలా చేస్తే కచ్చితంగా పిల్లల ఎదుగుదల పూర్తిగా నిలిచిపోయి అనది కాలంలోనే జీవితాన్ని బలి పెట్టుకోవాల్సి ఉంటుంది ఇది ఆదిలోనే మనం గుర్తించాల్సిన అవసరం ఉంది.
గంజాయి క్రయవిక్రయాలు దేశంలోనే కాదు మన నగరం నలుమూలల ఎక్కువగా క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన దగ్గర నుంచి డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టే వరకు ఊరుకోకూడదు. కఠిన నిర్ణయాలు తీసుకోండి. అని చెప్పిన ఇప్పటికే ఆయా పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే... ఒకవైపు పోలీసు వ్యవస్థ రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉంటున్న ఊహలకు అందకుండా మారకద్రవ్యాల సేవనం దాదాపు యువత ప్రాణాలు బలి తీసే వరకు దారితీస్తోంది. అందుకనే కనీసం తల్లిదండ్రులు కచ్చితంగా ప్రతిరోజు పిల్లల కదలికలను గమనిస్తూ ఉండాలి.
అందుకు తగ్గ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికే ఆయా కుటుంబాల్లో పిల్లలు డ్రగ్స్ కలవాటు పడి విచిత్రంగా ప్రవర్తిస్తుండడం వలన ఆ కుటుంబాలు ఆ వేదన ఆ బాధ వర్ణనతీతంగా అనుభవిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాదులో గంజాయి పూర్తిగా విస్తరించి రాష్ట్రంలో ప్రాంతాల్లో యువత మత్తుకు బానిస అయిపోయి సరదాగా సిగరెట్లు మద్యం తో చిన్న చిన్నగా మొదలై క్రమంగా మారకద్రవ్యాలు స్వీకరించే వరకు ఇది అలవాటు చేస్తోంది. దీని ద్వారా యువతలో ఆలోచన శక్తి మందగించి పూర్తిగా మత్తు వలయంలో చిక్కుకొని ప్రాణాలను పోగొట్టుకునే అవకాశం ఉంటుంది.
రంగారెడ్డి జిల్లా దుండిగల్ లో గంజాయి, పలు రకాలైన మొత్తం మందులను గతంలో పోలీసులు పట్టుకున్నారు. అలాగే ఈ కేసులో ముగ్గురిని అరెస్టు కూడా చేశారు. మొత్తానికి పోలీసులు తక్కువ టైంలో ఎక్కువ గంజాయి ముఠాలను పట్టుకుంటున్న యువతులు మాత్రం ఏ మాత్రం మార్పు రావడం లేదు. దీనికి ముఖ్యమైన కారణం అనతి కాలంలోనే ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతో కొంతమంది కేటుగాళ్లు గంజాయి దందాకు తెర లేపుతున్నారు. దీని ద్వారా యువతను టార్గెట్ చేసుకొని మొదటగా సిగరెట్లలో పెట్టి ఆ తర్వాత మద్యంతో అలవాటు చేసి కొద్ది కొద్దిగా అలవాటు చేస్తుంది ఈ ముఠా...
ఈ విషయం అర్థం కాక ఎంతోమంది యువత విలాసాలకు విందులకు సంతోషాలకు అలవాటు పడి పూర్తిగా డ్రగ్స్ యువతపై ప్రభావం పడి పరిస్థితి విషమించే వరకు చూడకుండా ముఖ్యంగా వ్యవస్థలోని కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. ఆ తర్వాత విద్య వ్యవస్థలోని కళాశాల వ్యవస్థ కూడా చుట్టూ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే విధంగా ఉండాలి.
సరదాగా మొదలైన ఎన్నో చెడు అలవాట్లు మానవ జీవన విధానంపై పూర్తిగా దెబ్బతీసి పతనం చేస్తోంది. ఇలాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలంటే ముందుగా కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. రక్షణ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ ఎంత పనిచేసిన ముందుగా సమాజంలోని ప్రతి ఒక్క వ్యక్తి బాధ్యతగా తీసుకొని అది ప్రభుత్వానికి తోడ్పాటును అందించే విధంగా ఉండాలి. అలాగే కళాశాల ఆవరణలో కూడా పూర్తిగా విద్యార్థులకు మత్తు పదార్థాలు అందించకుండా ఉండేవిధంగా కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. మత్తు పదార్థాలకు అలవాటు పడితే చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయి అని తెలిసే విధంగా పలు సోషల్ మీడియాలో అవగాహన కార్యక్రమాలు ఎక్కువగా కల్పించాలి. ఇలా అనేక ప్రశ్నలకు సమాధానాలను మనమే వెతికి సమాజాభివృద్ధికి సమాజ హితానికి మనమే మొదటి మెట్టు అవ్వాలి. ప్రశ్నించుకుంటూ పోతే సమాజంలో అన్ని ప్రశ్నలే మిగులుతాయి. కానీ సమాధానాలు వెతుక్కుంటూ పోతే ఆ జీవితం ఎంతో హాయిగా ఆరోగ్యవంతమైన సమాజాన్ని మనమే నిర్మించగలుగుతాం....
- కడారి శ్రీనివాస్
కాలమిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, కవి, రచయిత
గాయకులు, సామాజిక ఉద్యమకారులు
Post Comment