రైతు రాజ్యమే కాంగ్రెస్ లక్ష్యం... రుణమాఫి చారిత్రాత్మక నిర్ణయం

రేవంత్ సర్కారు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుంది.. మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్

రైతు రాజ్యమే కాంగ్రెస్ లక్ష్యం... రుణమాఫి చారిత్రాత్మక నిర్ణయం

రైతు రాజ్యమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి నేతృత్వం లోని కాంగ్రెస్ పార్టీ సర్కారు పనిచేస్తుందని మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్ అన్నారు. గురువారం నాడు మేడ్చల్ లోని రాయిలాపుర్ రైతు వేదిక వద్ద నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతు రుణమాఫి కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎం చిత్రపటానికి పాలాబిషేకం నిర్వహించి మొక్కలు నాటారు.

IMG-20240718-WA2374

Read More ముడుచింతలపల్లిలో గురువారం సాయిల్ హెల్త్ డే

అనంతరం వజ్రెష్ యాదవ్ మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి తీసుకున్న రుణమాఫి నిర్ణయం చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు.రైతు రుణమాఫిని దశల వారీగా రెండు లక్షల రుణమాఫిని ఆగష్టు నెలలోపే పూర్తి చేస్తామని ఇచ్చిన హామీని కచ్చితంగా నేరవేరుస్తారని అన్నారు. అదే విధంగా ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని రేవంత్ సర్కారు పూర్తి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మేడ్చల్ మండల్ అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శిలు,సీనియర్ నాయకులు,మాజీ ప్రజా ప్రతినిధులు,మాజీ ఎంపీటీసీలు సర్పంచులు,కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

Read More సీఆర్ పీ ఎఫ్ పాఠశాలలో ప్రారంభమైన జిల్లా స్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ సెలక్షన్ పోటీలు

Latest News

ఫ్రెండ్ రిసెప్షన్ కి వెళ్లి.. తిరిగిరాని లోకానికి వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫ్రెండ్ రిసెప్షన్ కి వెళ్లి.. తిరిగిరాని లోకానికి వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి
జయభేరి, సైదాపూర్  : సైదాపూర్ మండల్ రామచంద్రపూర్ విలేజ్ లో నిన్న రాత్రి రోడ్డు ప్రమాదంలో పొన్నం మహేష్ అనే యువకుడు ఫ్రెండ్ రిసెప్షన్ లో పాల్గొని...
విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం
యాద్గారపల్లి చౌరస్తా లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ నాయకులు
ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు
ప్రజా పాలన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన మొదటి సంవత్సరం అభివృద్ధి పనుల వివరాలు...
ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి