GHMC I శివ శివ.. హర హర...

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత జిహెచ్ఎంసి మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అవినీతి భాగోతం పూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది.

GHMC I శివ శివ.. హర హర...

జయభేరి, హైదరాబాద్ :

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత జిహెచ్ఎంసి మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అవినీతి భాగోతం పూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఇదే విషయంపై అందిస్తున్న 'జయభేరి' అక్షర యజ్ఞం కౌంటర్ విత్ కడారి శ్రీనివాస్ సమగ్ర విశ్లేషణ...

Read More మహారాష్ట్రలో పనిచేయని ఆరు గ్యారంటీలు

ఒకటి కాదు రెండు కాదు వందల కోట్లు అతని అవినీతి దాహానికి అంతులేదు. తెలంగాణ రాష్ట్ర సంపద తెలంగాణ ప్రజలకు పంచాలని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒక కుటుంబానికి అధికారం దక్కిందని జనం అన్ని వర్గాల్లో ఉద్యమం మొదలైంది. నాడు తెలంగాణ రాష్ట్రం కొరకు అన్ని వర్గాలు పనిచేసే ఉద్యోగులు, విద్యార్థులు సకలజనులు ఉద్యమిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్ర వేరుపడ్డ తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగించిన పదేండ్ల తరువాత మళ్లీ అదే పెద్ద ఎత్తున మార్పు కోసం కాంగ్రెస్కు అధికారాన్ని కట్టబెట్టింది తెలంగాణ ప్రజలే... ఈ పది సంవత్సర కాలంలో వ్యవస్థలు పూర్తిగా విధ్వంసమైన సంగతి మనందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే జిహెచ్ఎంసి డైరెక్టర్గా పనిచేసిన శివ బాలకృష్ణ అవినీతి బాగోతం కట్టలు కట్టలుగా పుంకాలు పుంకాలుగా అతని అవినీతి చిట్టాను తోడుతుంటే ఎన్నెన్నో నమ్మలేని నిజాలు కండ్లు బైర్లు కమ్మే ఆస్తులను లెక్కపెట్టడానికి పాపం ఏసీబీ అనేక తంటాలు పడుతోంది. మొత్తానికి ఈ శివ బాలకృష్ణ కథ ఇంకా ముగియలేదన్నది వాస్తవం.

Read More నీ తాటాకు చప్పులకు భయపడేది లేదు రేవంత్ రెడ్డి

శివ బాలకృష్ణ తెలంగాణ ప్రభుత్వంలో కీలకంగా పని చేసినట్టుగా సమాచారం. అతనిపై ఆఫీసరు ఆ... తో మొదలై విందా...తో ముగుస్తుంది.. అతని శివ బాలకృష్ణ ముందు నడిపి మిగతా తతంగా అంతా డైరెక్ట్గా తారకరామారావుతో కథ నడిపినట్టుగా వ్యవహారం బయట గుప్పుమంటుంది. నిజానికి శివ బాలకృష్ణ దొరికిపోయాడు కానీ అతనిపై ఆఫీసరు ఆయన గారి బాగోతం మరెప్పుడు బయట పెడతారా అని ఉద్యోగుల్లో సగం మంది అదే గుసగుసలు పెట్టుకుంటున్నారు..

Read More విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం

శివ బాలకృష్ణ దొరికిపోయిన తర్వాత కూడా ఆయన ముఖంలో గింత కూడా పశ్చాత్తాప ధోరణి కనిపించడం లేదు అంటే అతనికి బయటకు వచ్చినంక ఇంకా వేలకోట్ల ఆస్తులు బినామీల పేరు మీద ఉన్నాయనే భరోసా కాబోలు... మొత్తానికి శివ బాలకృష్ణ వందల వేలకోట్ల అవినీతి బాగోదానికి తెలంగాణ వేదిక అయింది. ఆ సొమ్ము తెలంగాణ ప్రజలది కాదా.. కాంట్రాక్టర్ ల నుంచి ఇల్లు పర్మిషన్ కోసం సెటప్ బాక్స్ పర్మిషన్ కోసం పూర్తిగా లంచాలకు మరిగిన శివ బాలకృష్ణ కాంట్రాక్టర్ల నుంచి ఎంతగా వేధించి వేధించి డబ్బులు  వసూలు చేశాడో మరి.. ఇక ఇదే విషయం తెలంగాణ సమాజంలో బాగా నానుతూ దీనికి లింకు ఎక్కడా అని వెతికితే ఇంకెవరు...

Read More భగవాన్ సత్యసాయి పుట్టినరోజు మహిళా వృద్ధుల ఆశ్రమ నిర్మాణమునకు రు. 50,116 విరాళం 

తెలంగాణ బాధ్యతని ఒకే కుటుంబం మోస్తున్న ఆ ఇంటి పెద్దలే అనే అనుమానాలకు తావు నెలకొంది.. శివ బాలకృష్ణ ఒక్కడే అంత సొమ్ము అంతగా వెనకేసుకున్నాడు అంటే మిగతా అతని పై ఆఫీసరు ఆ పై ఆఫీసర్ పైన ఇంకో ప్రజానాయకుడు ఎన్ని కోట్ల ఆస్తులు వెనకేసుకున్నారో ఆ దేవుడికే తెలియాలి.

Read More ముడుచింతలపల్లిలో గురువారం సాయిల్ హెల్త్ డే

వాస్తవానికి కల్వకుంట్ల ఫ్యామిలీ మీద అతని అనుసర గణం మీద ఏసీబీ దాడి చేయాలని తెలంగాణ ప్రజలు ఒక వర్గం కోరుకుంటున్నప్పటికీ ప్రభుత్వ అధికారి గనుక ఉద్యోగి ఆస్తిపాస్తులను అవినీతి భాగోతాన్ని ఏసిబి బట్టబయలు చేసింది కోర్టుల ద్వారా అతనికి శిక్షపడే విధంగా ఇంకా మరికొంత కాలం సోదాలు నిర్వహించే అవకాశం కనిపిస్తున్నందున ఆయన సంపాదించిన అవినీతి నగదును లెక్క వేయడంలో తల మునకలై పోతుంది ఏసీబీ..

Read More సీసీ కెమెరాల ఏర్పాటుకు హెచ్ బి ఎల్  పరిశ్రమ సహకారం

తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాల్లోనూ ప్రకృతి వనరులలోను ప్రాజెక్టుల విషయంలోనూ పూర్తిగా అవినీతి జరిగిందని శాసనసభలు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు, గంగోలై పొడుస్తున్న ప్రజలు వింటున్నారు చూస్తున్నారు కానీ వాటిపై చర్య జరగలేదని కాంగ్రెస్ ప్రభుత్వం పై గలాన్ని విప్పే అవకాశం నెమ్మది నెమ్మదిగా రాసుకుంటుంది. ఒకపక్క ఏసీబీతో శివ బాలకృష్ణను పూర్తిగా జప్తు చేస్తున్న ఇంకోవైపు ఆయనకు మించిన తిమింగలాలు రాజకీయాల్లో ఉన్నాయని వాటిని ఒక్కొక్కటిగా ఏరి పారేయాలని సీఎం రేవంత్ రెడ్డికి గట్టిగా వినిపించేలా ఆయన ముందరికి వాదన తీసుకొస్తున్నారు కొంతమంది నేతలు... వారిలో అదే కేసీఆర్ గుంపులో నుంచి ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చి గెలిచిన లీడర్లే కావడం విశేషం...

Read More వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా మొద్దునిద్ర వీడని రేవంత్ సర్కార్ 

టిఆర్ఎస్ బాగోతం అవినీతి అంతా మాకు తెలుసు మేము అక్కడి నుంచి వచ్చిన వారమే అని చెబుతున్న ఆయా నియోజకవర్గాల్లోని శాసనసభ్యులు ఆ రోజున కిమ్మనక కూర్చుని ఈ రోజున గొంతు విప్పడం విడ్డూరంగా కనిపిస్తోంది. ఒక శివ బాలకృష్ణ కాదు ఉద్యోగుల్లో బయటకు కనపడని అవినీతి జలగలు అవినీతి రాక్షసులు ఇంకా చాలానే ఉన్నాయనేది నిజమైన వాదన.. ఒక జిహెచ్ఎంసి శాఖలోనే ఇంత పెద్ద తిమింగలం ఉంటే రెవెన్యూ శాఖలో జలమండలి శాఖలో విద్యాశాఖలో ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని శాఖలలో ఇలాంటి చీడపురుగులు బాగా నాచు పట్టి కూర్చున్నాయి...

Read More పైడిపెల్లిలో  చెక్ డ్యాం నిర్మాణానికి స్థల పరిశీలన

మరి వారి పీఠాలు కదిలేది ఎప్పుడో వారి ఇళ్ళను జప్తు చేసేది ఎప్పుడు అని ఆయా శాఖలోని చిరు ఉద్యోగులు చిన్న ఉద్యోగులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.. దొరికితే దొంగ దొరకకపోతే దొర అనే నానుడి ఎవరన్నారో ఏమోగానీ మొత్తానికి శివ బాలకృష్ణ దొరికి దొంగ అయిపోయాడు దొరకని వాళ్ళు ఇంకా దొరలాగా తిరుగుతున్నారు అని తెలంగాణ ప్రజలు ఒకరిద్దరు కూడిన చోట ఇదే విషయాన్ని ముచ్చటించుకుంటున్నారు..
ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఇలా ఎవరైనా చేస్తే శివ బాలకృష్ణ గతే పడుతుంది అనే ఒక స్టేట్మెంట్ ఎలా తీసుకోవాలి అని ఆటో టిఆర్ఎస్ మాజీ నాయకులు భయభ్రాంతులకు గురవుతున్నారు. తప్పు చేసిన వారికే కదా భయం అన్నట్టుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎత్తి పొడుస్తున్నారు. మొత్తానికి టైం బాగాలేదు అందుకే తలవంచుకొని కూర్చోవాలి అన్న వాదనతో టిఆర్ఎస్ నాయకులు ఉంటే... మీ అవినీతిని  బయటపెడతాం, మీ బాగోతం అంతా బట్ట బయలు చేస్తాం అని కాంగ్రెస్ నేతలు చెబుతుండడం శాసనసభ పర్వం పూర్తిగా గడిచిపోయింది.. ఇక ఇప్పటికైనా శోభాల కృష్ణ లాంటి అవినీతి ఉద్యోగులు ఎక్కడెక్కడ ఏ శాఖలో ఉన్నారో ఏసీబీకి తెలవకపోయినా అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలను అడిగితే పూర్తిగా సమాచారం పక్కగా లభించవచ్చు అని అంటున్నారు తెలంగాణ జనం...

Read More బిఆర్ఎస్ మైనార్టీ నాయకుల ప్రత్యేక ప్రార్థనలు

రాను రాను కేంద్రంలో సిఐడి ఏసీబీ ఐటీ దాడులు సర్వసాధారణమైపోయాయి. అలా రైడ్ చేస్తే నాలుగు రోజులు జైల్లో కూర్చుని మళ్లీ మన ఉద్యోగాన్ని సంపాదించుకోవచ్చు కోల్పోయిన ఆస్తులను మళ్లీ తిరిగి సంపాదించుకోవచ్చు అనే ఒక వాదన ఉండడంతో ఏదైనా అవినీతికి పాల్పడుతూ ఏసీబీకి పాటుపడుతూ తిరిగి ఉద్యోగంలో చేరుతూ మళ్లీ అవినీతిని చేస్తూ ఇదొక అలవాటుగా మారిపోయింది కనుకనే ఇలాంటి అవినీతి తిమింగలాలు రోజురోజుకు ఎక్కువగా పుట్టుకొస్తున్నాయి... చట్టంలో ఉన్న లొసుగులను వాడుకొని ఇలాంటి అవినీతిపరులు చట్టానికి దొరకకుండా ఆస్తులు గడించి పూర్తిగా అవినీతికి అలవాటు పడిపోయి కరెన్సీ వాసనకు బానిస అయిపోయిన ఇలాంటి ఉద్యోగులను సమాజం నుంచే వెలివేయాలని తెలంగాణ ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు...ఆదిశగా వాగ్దానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న జనానికి రానున్న రోజుల్లో మరి ఎలాంటి అవినీతి తిమింగలాలను పట్టిస్తారు ప్రతిపక్షంలో ఉన్న టిఆర్ఎస్ నాయకులు తిన్న అవినీతి కూడును కక్కిస్తారా లేదా అన్న రీతిగా తెలంగాణ ప్రజలు ఆలోచనలు సాగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి అన్న మాటలను బట్టి చూస్తే గడిచింది కాదు ఇప్పుడు అలా ఎవరైనా చేస్తే శివ బాలకృష్ణకు పట్టిన గతే పడుతుంది అని చెప్పడంలో గతాన్ని తోడుతారా వర్తమానాన్ని వెంటాడుతారా అనేది ప్రశ్నార్ధకంగా మారుతుంది.

Read More యాద్గారపల్లి చౌరస్తా లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ నాయకులు

...కడారి శ్రీనివాస్ 
కాలమిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, కవి, రచయిత

Latest News

ఫ్రెండ్ రిసెప్షన్ కి వెళ్లి.. తిరిగిరాని లోకానికి వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫ్రెండ్ రిసెప్షన్ కి వెళ్లి.. తిరిగిరాని లోకానికి వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి
జయభేరి, సైదాపూర్  : సైదాపూర్ మండల్ రామచంద్రపూర్ విలేజ్ లో నిన్న రాత్రి రోడ్డు ప్రమాదంలో పొన్నం మహేష్ అనే యువకుడు ఫ్రెండ్ రిసెప్షన్ లో పాల్గొని...
విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం
యాద్గారపల్లి చౌరస్తా లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ నాయకులు
ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు
ప్రజా పాలన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన మొదటి సంవత్సరం అభివృద్ధి పనుల వివరాలు...
ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి