మనిషి మనుగడకు పచ్చని చెట్లు తల్లిలాంటివి:- ఎంపీ ఈటల
గుండ్లపోచంపల్లి వన మహోత్సవంలో పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి..
మేడ్చల్ : మనిషి మనగడకు పచ్చని చెట్లు తల్లి లాంటివాని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. గురువారం గుండ్లపోచంపల్లిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డితో కలిసి ఈటల పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల మాట్లాడుతూ ఆరోగ్యకరమైన వాతావరణం కోసం మొక్కలు నాటాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
రుణమాఫీ ఫై విలేకరులు అడిగిన ప్రశ్నలకు స్పందించిన ఈటల రాజేందర్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ రైతులకు ఒకే దఫాలో అన్ కండిషనల్ గా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారో దానికి కట్టుబడి రుణమాఫీ చేయాలి తప్ప అనేక రకాల నిబంధనలు పెట్టి అందరిని ఎగరగొట్టే ప్రయత్నం చేయిద్దని విమర్శించారు. 34 వేల కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉండగా ఏదో ఐదు ఆరు వేలకోట్ల రూపాయలు ఇచ్చి దాన్ని పండుగలాగా, ఏదో చారిత్రాత్మక దినం లాగా వర్ణించే పిచ్చి ప్రయత్నం చేస్తున్నారని ఎంపీ ఆరోపించారు. భారతదేశంలో రుణాలు ఎగవేతకు గురైన రైతులు ఎక్కడున్నారంటే తెలంగాణలో ఉన్నారు అనే అపకీర్తి గత ప్రభుత్వం తెచ్చిపెట్టింది. ప్రస్తుత ప్రభుత్వం భేషజాలకు పోకుండా అన్ కండీషనల్ గా రైతాంగానికి చెప్పిన విధంగా రుణమాఫీ చేసి, రైతులను రుణవిముక్తులను చేయాలని డిమాండ్ చేశారు.
పచ్చదనానికి కేర్ ఆఫ్ తెలంగాణ:- ఎమ్మెల్యే మల్లారెడ్డి.... పచ్చదనానికి కేర్ ఆఫ్ అడ్రస్ తెలంగాణ రాష్ట్రమని మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. భారతదేశంలోనే ఎక్కడలేని పచ్చదనం తెలంగాణ రాష్ట్రంలో ఉందన్నారు. మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో నర్సరీలు ఏర్పాటుచేసి హరితహారం పేరుమీద మొక్కలు నాటారన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామానికి తాగునీరు సాగునీరు అందించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుందన్నారు. చాపలు పంపిణీ కార్యక్రమంతో బెస్త సంఘం వారు, ముదిరాజ్ కులస్తులు ధనికులు అయ్యారని తెలిపారు. ఇప్పుడు ఎక్కడ చూసినా కరువే ఏర్పడిందని వర్షాలు పడటం లేదని ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న కుక్కల దాడులపై ప్రతి మున్సిపాలిటీలో, గ్రామాల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి కుక్కల దాడుల జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మద్దుల లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఛైర్మన్ ప్రభాకర్, కౌన్సిలర్లు భేరి బాలరాజు, అమరం జైపాల్ రెడ్డి, దొడ్ల మల్లికార్జున్, అమరం సరస్వతి, సముద్రాల హంసా రాణి, అమరం హేమంత్ రెడ్డి, చింత పెంటయ్య, మాజీ సర్పంచ్ మద్దుల శ్రీనివాస్ రెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ అమరం మోహన్ రెడ్డి, నాయకులు ఉషిగారి శ్రీనివాస్, సంజీవ్ గౌడ్, సురేందర్ గౌడ్, కృష్ణగౌడ్, సుధాకర్, ఫిలిప్స్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, డిఈ దుర్గ ప్రసాద్, మేనేజర్ శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post Comment