తెలంగాణలో జిఎస్‌డిపి 16 శాతం పెరిగింది: కాగ్

తెలంగాణ జిఎస్‌డిపి 2021-22తో పోలిస్తే 2022-23లో 16 శాతం పెరిగిందని, రెవెన్యూ రాబడులు గణనీయంగా 25 శాతం మేర పెరిగాయని, సొంత పన్నుల రాబడి గణనీయంగా 17 శాతం పెరిగిందని, సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.2,06,977 కోట్లకు పెరిగిందని, 2023 మార్చి నాటికి పూర్తి కావాల్సిన 20 ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరిగిందని, రూ.2749 కోట్ల మేర ద్రవ్యలోటు తక్కువ చేసి చూపించారని కాగ్ నివేదికలో పేర్కొంది.

తెలంగాణలో జిఎస్‌డిపి 16 శాతం పెరిగింది: కాగ్

హైదరాబాద్, ఆగష్టు 2 :
రెవెన్యూ రాబడుల వృద్ధి రేటు ఒక శాతం తగ్గిందని కాగ్ నివేదికలో వెల్లడించింది. 2023 మార్చితో ముగిసిన ఏడాదికి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్ నివేదిక ఇచ్చింది.

తెలంగాణ జిఎస్‌డిపి 2021-22తో పోలిస్తే 2022-23లో 16 శాతం పెరిగిందని, రెవెన్యూ రాబడులు గణనీయంగా 25 శాతం మేర పెరిగాయని, సొంత పన్నుల రాబడి గణనీయంగా 17 శాతం పెరిగిందని, సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.2,06,977 కోట్లకు పెరిగిందని, 2023 మార్చి నాటికి పూర్తి కావాల్సిన 20 ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరిగిందని, రూ.2749 కోట్ల మేర ద్రవ్యలోటు తక్కువ చేసి చూపించారని కాగ్ నివేదికలో పేర్కొంది. 2022-23లో ప్రభుత్వం ఇచ్చిన రుణాలు, అడ్వాన్స్‌లు 150 శాతం పెరిగాయని, సొంత రాబడి లేని సంస్థలకు ప్రభుత్వం రుణాలు ఏర్పాటు చేసిందని, 2022-23లో బడ్జెట్ వెలుపలి రుణాలు రూ.1,18,629 కోట్లుగా అంచనా వేసిందని, ఆయా రుణాలకు ప్రభుత్వం తదుపరి రుణాలుగా రూ.17,829 కోట్లు అందించిందన్నారు.

Read More బిఆర్ఎస్ మైనార్టీ నాయకుల ప్రత్యేక ప్రార్థనలు

రాష్ట్రాభివృద్ధి రుణాల వడ్డీపై ఖర్చు తక్కువగా అంచనా వేస్తున్నారని, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లను భారీగా అంచనా వేస్తున్నారని, ఎపి నుంచి తెలంగాణ విద్యుత్ కంపెనీలకు బకాయిలు రాలేదని, ఇళ్లు, గొర్రెల పంపిణీ, ఆయల్‌ఫామ్ పథకాల నిధులు ఖర్చు కాలేదని, దళితబంధు, రుణమాఫీ పథకాలకు కేటాయింపుల్లో భారీగా ఖర్చు కాలేదని కాగ్ తెలిపింది.

Read More యాద్గారపల్లి చౌరస్తా లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ నాయకులు

Latest News

ఫ్రెండ్ రిసెప్షన్ కి వెళ్లి.. తిరిగిరాని లోకానికి వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫ్రెండ్ రిసెప్షన్ కి వెళ్లి.. తిరిగిరాని లోకానికి వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి
జయభేరి, సైదాపూర్  : సైదాపూర్ మండల్ రామచంద్రపూర్ విలేజ్ లో నిన్న రాత్రి రోడ్డు ప్రమాదంలో పొన్నం మహేష్ అనే యువకుడు ఫ్రెండ్ రిసెప్షన్ లో పాల్గొని...
విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం
యాద్గారపల్లి చౌరస్తా లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ నాయకులు
ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు
ప్రజా పాలన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన మొదటి సంవత్సరం అభివృద్ధి పనుల వివరాలు...
ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి