నగరంలో బతికేది ఎలా..

ఐటీ ఆఫీసులకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లోని అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ హౌస్‌లు హాట్ కేకుల్లా మారాయి. కరోనా తర్వాత ఇంటి అద్దెలు కొన్నిచోట్ల రెట్టింపు అయ్యాయి. గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో ఇంటి అద్దెలు ఆరు నెలల కాలంలో 15 శాతానికి పైగా పెరిగాయి. 

నగరంలో బతికేది ఎలా..

జయభేరి, హైదరాబాద్ :
హైదరాబాద్‌ మహా నగరంలో ఇంటి అద్దెలు బాగా పెరిగిపోయాయి. నగరంలోనే కాదు… నగర శివార్లలోనూ ఇదే పరిస్థితి. విద్యాసంస్థలు, ఐటీ కంపెనీలు, ఆస్పత్రులు, ప్రైవేట్ కంపెనీలకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో అద్దె ఇళ్లకు డిమాండ్‌ బాగా పెరిగింది. ఒక ఏరియాకు ఇది పరిమితం కాలేదు. ప్రతి ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి. దీంతో ఎక్కడ చూసినా అద్దె ఇంటికి డిమాండ్‌తో పాటు రెంట్లు విపరీతంగా పెరిగాయి. 

కరోనా సమయంలో ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఉండడంతో చాలామంది సొంత ఉళ్ళకు వెళ్లిపోయారు. దీంతో నగరంలో చాలావరకు టూలెట్ బోర్డులు కనిపించేవి. అయితే ఆ తర్వాత ఉద్యోగులు తిరిగి ఆఫీసులకు హాజరవుతున్నారు. దీంతో ఐటీ ఆఫీసులకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లోని అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ హౌస్‌లు హాట్ కేకుల్లా మారాయి. కరోనా తర్వాత ఇంటి అద్దెలు కొన్నిచోట్ల రెట్టింపు అయ్యాయి. గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో ఇంటి అద్దెలు ఆరు నెలల కాలంలో 15 శాతానికి పైగా పెరిగాయి. 

Read More విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి

బేగంపేట్, ప్రకాష్ నగర్, సోమాజిగూడ, పంజాగుట్ట బోయిన్పల్లి, మారేడుపల్లి, అల్వాల్ ప్రాంతాల్లో 20 నుండి 25శాతం అద్దెలు పెరిగాయి. ఎప్పటికప్పుడు పెరుగుతున్న ఇంటి అద్దెలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. జీతాలు తప్ప అన్ని పెరుగుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేసే సగటు జీవి… ఈ రెంట్‌ షాక్ తట్టుకోలేక శివారు ప్రాంతాలకు వెళితే… అక్కడ కూడా అద్దెలు పెంచేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.ఓ అధ్యయనం ప్రకారం కొన్ని ప్రాంతాల్లో ఇంటి రెంట్లు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంలోనే పది నుంచి పదిహేను శాతం పైగా పెరిగాయి. 

Read More ములుగు జిల్లా చల్పాక ఎన్ కౌంటర్ పై హైకోర్టులో నేడు విచారణ!

గతంలో 10, 15 వేలకు నగరంలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అద్దెకు లభించేవి కానీ ఇప్పుడు 20 నుంచి 25 వేల పైగా ఖర్చు చేస్తే దొరకని పరిస్థితి.నగర శివారు ప్రాంతాల్లో… సింగిల్ బెడ్ రూం ఇంటి అద్దె ప్రస్తుతం 7 వేల నుంచి 9 వేల రూపాయల వరకు ఉంది. డబుల్ బెడ్ రూం అద్దె 11 వేల నుంచి 15 వేల వరకు ఉంది. మధ్యతరగతి ప్రజలు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవాళ్లు అద్దెలు తక్కువగా ఉన్న ప్రాంతాలకు మారుతున్నారు. శివారు ప్రాంతాలైన బోడుప్పల్, పీర్జాదిగూడ, హయత్ నగర్, ఎల్బీనగర్, నిజాంపేట్, బండ్లగూడ జాగీర్ తదితర ప్రాంతాల్లో అద్దె ఇళ్ళకి డిమాండ్ పెరిగింది.

Read More పోటీ ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు అన్ని రంగాల్లో ప్రావీణ్యం సంపాదించాలి

శివారు ప్రాంతాల నుంచి ఐటీ ఆఫీసులకు వెళ్లడం కష్టమని భావించిన కొందరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు విదేశాల్లో మాదిరిగా డబుల్ , ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లను పంచుకుంటున్నారు. ఒకే ఇంట్లో రెండు, మూడు కుటుంబాలతో ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరికొందరు పేయింగ్ గెస్ట్‌లుగా ఉంటూ అద్దె భారాన్ని తప్పించుకుంటున్నారు. అద్దె ఇళ్లకు డిమాండ్ పెరగడంతో యజమానులు ఏటా అద్దెలు పెంచుతున్నారు. భవిష్యత్తులో ఔటర్ రింగ్ వెలుపల కూడా అద్దెకు ఇళ్లు దొరకడం కష్టంగా మారే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Read More పరకాల ఏజీపీగా లక్కం శంకర్

Latest News

విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం
జయభేరి, మేడిపల్లి : రాచకొండ పోలీస్ కమిషనరేట్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుడమి హై స్కూల్ బోడుప్పల్ లో మేడిపల్లి పోలీస్ వారి ఆధ్వర్యంలో ట్రాఫిక్...
యాద్గారపల్లి చౌరస్తా లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ నాయకులు
ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు
ప్రజా పాలన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన మొదటి సంవత్సరం అభివృద్ధి పనుల వివరాలు...
ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి 
మొద్దు నిద్రలో రేవంత్ సర్కారు