చంద్రబాబు ఆహ్వానిస్తే ప్రమాణానికి వెళతాను

ఏపీలో ఎన్డీయే కూటమి సంచలన విజయంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. చంద్రబాబు ఆహ్వానిస్తే ఆయన ప్రమాణ స్వీకారానికి తప్పకుండా వెళ్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ సూచనల మేరకే తాను నడుచుకుంటానని అన్నారు.

చంద్రబాబు ఆహ్వానిస్తే ప్రమాణానికి వెళతాను

జయభేరి, హైదరాబాద్, జూన్ 5 :
ఏపీలో ఎన్డీయే కూటమి సంచలన విజయంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. చంద్రబాబు  ఆహ్వానిస్తే ఆయన ప్రమాణ స్వీకారానికి తప్పకుండా వెళ్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ సూచనల మేరకే తాను నడుచుకుంటానని అన్నారు.

ఏపీలో ఏ ప్రభుత్వం వచ్చినా సామరస్యంగానే రాష్ట్ర సమస్యలు పరిష్కరించుకుంటామని గతంలోనే చెప్పినట్లు గుర్తు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా అనేది చట్టబద్ధతతో కూడుకున్న హామీ అన్న రేవంత్.. రాహుల్ గాంధీ విస్పష్టంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి కట్టుబడి ఉన్నారని తెలిపారు. ఈ విషయంపై తమ పార్టీలో చర్చించాక చంద్రబాబుతో మాట్లాడతానని అన్నారు.తెలంగాణలో వంద రోజుల్లో గ్యారెంటీలను అమలు చేశామని.. లోక్ సభ ఎన్నికల్లోనూ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను ఆశీర్వదించారని సీఎం రేవంత్ తెలిపారు. హైదరాబాద్‌లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన నచ్చితేనే ఓటు వేయాలని ప్రచారంలో కోరామని.. తమ పార్టీ అభ్యర్థులు 8 మంది గెలిచారని చెప్పారు. వంద రోజుల పాలన తర్వాత కాంగ్రెస్‌కు 41 శాతం ఓట్లు వచ్చాయని అన్నారు. 'అసెంబ్లీ ఓట్ల శాతం కంటే ఎక్కువగా లోక్ సభ ఎన్నికల్లో వచ్చాయి.

Read More ములుగు జిల్లా చల్పాక ఎన్ కౌంటర్ పై హైకోర్టులో నేడు విచారణ!

ఈ ఫలితాలతో కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని మేం భావిస్తున్నాం. 8 మంది ఎంపీలను గెలిపించి ఆశీర్వదించారు. కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేసిన నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు. 2019 ఎన్నికల్లో తమకు 3 సీట్లు వేస్తే.. ఇప్పుడు ఆ సంఖ్య 8కి చేరింది. బీఆర్ఎస్ 7 సీట్లలో డిపాజిట్ కోల్పోయింది. ఆ స్థానాల్లో బీజేపీని గెలిపించి అవయవదానం చేశారు. బీఆర్ఎస్ నుంచి బలహీన అభ్యర్థులను పెట్టి బీజేపీ నేతలు గెలుపు కోసం కేసీఆర్ కృషి చేశారు. మెదక్‌లో కాషాయ పార్టీ విజయానికి హరీశ్ రావు సహకారం అందించారు.' అంటూ రేవంత్ తీవ్ర విమర్శలు చేశారు.అటు, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డిని టీపీసీసీ కార్యవర్గం సభ్యులు అభినందించారు.

Read More క్రియాశీల సభ్యత్వం పొందిన దయాకర్ రెడ్డి 

GPTOii1WMAAIjoC

Read More ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి 

గతంలో 3 పార్లమెంట్ స్థానాలకే పరిమితమైన హస్తం పార్టీ .. ఇప్పుడు 8 స్థానాలకు చేరుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి కృషి ఫలితంగానే కాంగ్రెస్ 8 స్థానాలు గెలుచుకుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, హర్కర వేణుగోపాల్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, మల్లు రవి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, ఫహీం ఖురేషి ఇతరులు పాల్గొన్నారు.అటు, కాంగ్రెస్ ఎంపీలు సీఎం రేవంత్ రెడ్డిని బుధవారం ఉదయం ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఎంపీలు కడియం కావ్య, చామల కిరణ్ కుమార్ రెడ్డి సీఎంను కలిసి సన్మానించారు. వారితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు.

Read More విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి

ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన వారిని రేవంత్ అభినందించారు. రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరిలో తన సమీప ప్రత్యర్థి బూర నర్యయ్య గౌడ్‌పై 2,22,170 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అటు, సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య వరంగల్ నుంచి 2,20,339 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

Read More ముడుచింతలపల్లిలో గురువారం సాయిల్ హెల్త్ డే

Latest News

విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం
జయభేరి, మేడిపల్లి : రాచకొండ పోలీస్ కమిషనరేట్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుడమి హై స్కూల్ బోడుప్పల్ లో మేడిపల్లి పోలీస్ వారి ఆధ్వర్యంలో ట్రాఫిక్...
యాద్గారపల్లి చౌరస్తా లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ నాయకులు
ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు
ప్రజా పాలన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన మొదటి సంవత్సరం అభివృద్ధి పనుల వివరాలు...
ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి 
మొద్దు నిద్రలో రేవంత్ సర్కారు