ఇటుకుల పహాడ్ బొడ్రాయి పండుగ నాడు చెప్పిన ముచ్చట...

నేడు సాకారం అవుతుందా!?

  • నీటి గుంతలు పూడ్చేశారు... 
  • సరే... శాశ్వత రోడ్డు ఎప్పుడు వేస్తారు!?
  • ప్రజా పాలనలో ఇటుకుల పహాడ్ గ్రామంలో ఎమ్మెల్యే మందుల సామేలు చెప్పిన మాటను మరిచిపోయారా!?
  • మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శివుని సాక్షిగా చెప్పిన మాట అటకెక్కిందా!?
  • జయభేరి మీడియా కథనానికి స్పందించిన అధికార యంత్రాంగ గణం !
  • తూతూ మంత్రంగానే పనులు ప్రారంభం..!?

ఇటుకుల పహాడ్ బొడ్రాయి పండుగ నాడు చెప్పిన ముచ్చట...

జయభేరి, తుంగతుర్తి నియోజకవర్గం ఇటుకుల పహాడ్ :
1996 నుండి తుంగతుర్తి నియోజకవర్గంలోని శాలిగౌరారం మండలంలో ఇటుకుల పహాడ్ గ్రామ రోడ్డు పరిస్థితి ఒక్కసారిగా మీడియా కథనానికి ఉలిక్కిపడింది. ఇంకేముంది జయభేరి దినపత్రికలో వచ్చిన వార్త కథనానికి స్పందించిన ప్రజాప్రతినిధులు అధికారులు ఎవరో తెలియదు.

కానీ వెంటనే రోడ్డుపై ఉన్న నీటి గుంతలను పూడ్చివేస్తూ ఇటు పక్క, అటువైపు ఉన్న చెట్లను పూర్తిగా నరికివేసి రోడ్డును ఎలా క్లియర్ గా చేశారో మీరే చూడండి. అంటే ప్రశ్నిస్తే కానీ ఈ ప్రజాప్రతినిధులు కళ్ళు తెరవరు! అనే వాస్తవానికి ఇదొక నిదర్శనంగా మారుతుంది. 

Read More సీఆర్ పీ ఎఫ్ పాఠశాలలో ప్రారంభమైన జిల్లా స్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ సెలక్షన్ పోటీలు

ఇక వివరాల్లోకి వెళ్తే శాలిగౌరారం మండలం ఇటుకుల పహాడ్ గ్రామ రోడ్డు పరిస్థితి గురించి వచ్చిన కథనానికి స్పందించిన అధికార యంత్రాంగం వెంటనే రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్లను తొలగిస్తూ రోడ్డు మీద ఉన్న నీటి గుంతలను శుభ్రం చేసి, పూడ్చివేసే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. ఇక ఇదే విషయంపై జయభేరి దినపత్రిక ప్రచురించిన కథనానికి చలించిన అధికార యంత్రాంగ గణం ఇప్పటికైనా శాశ్వతమైన రోడ్డు వేసేందుకు రంగం సిద్ధం చేయాలని అలాగే నేషనల్ హైవే కి కూతవేటు దూరంలో ఉన్న ఈ రోడ్డును పటిష్టంగా తయారు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. 

Read More శ్రీ విష్ణు శివాలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు

నిజానికి పదేళ్ల తెలంగాణ ప్రభుత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఎన్నో అవినీతి పనులను అక్రమాలను దురాగతాలను మోసాలను అన్నింటినీ భరించిన తెలంగాణ ప్రజలు ముఖ్యంగా తుంగతుర్తి నియోజకవర్గంలో మార్పు కోసం అంటూ బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చారు. ఇక ఎమ్మెల్యేగా ఎన్నికైన మందుల సామేలు సామాజిక వర్గం నుంచి మంచి చేస్తాడు అని అనుకునే విధంగానే అన్ని పనులు చేస్తున్న ఇటుకుల పహాడ్ బొడ్రాయి పండుగకు వచ్చిన ఎమ్మెల్యే ప్రజలను ఉద్దేశించి రోడ్డు బాగు చేసే వరకు ఈ ఊరికి రాను అని చెప్పి మాట్లాడారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ ఊరు గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. 

Read More భగవాన్ సత్యసాయి పుట్టినరోజు మహిళా వృద్ధుల ఆశ్రమ నిర్మాణమునకు రు. 50,116 విరాళం 

ఇక ఇదే విషయంపై జయభేరి దినపత్రిక అనూహ్యంగా ఇటుకల పహాడ్ రోడ్డును పరిశీలించి వేసిన కథనానికి స్పందన వచ్చింది. పూర్తిగా నీటి గుంతలతో అయోమయంగా అధ్వాన స్థితిలో ఇటుకుల పహాడ్ రోడ్డు చిత్రాన్ని చూసిన అధికార యంత్రాంగం కళ్ళు తెరిచి ప్రథమ చికిత్స చేసింది కానీ సంపూర్తిగా ఎప్పుడు చేస్తారు మీడియాకు ఎవరు అందడం లేదు. 

Read More ఘనంగా దేవరకొండ మాజీ ఎమ్మెల్యే ,బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్ జన్మదిన వేడుకలు

కాంట్రాక్టర్ ఎవరో తెలియదని అతని పతక రావాలని ఎమ్మెల్యే మందుల సామేలు ప్రజా పాలనలో ఇటుకుల పహాడ్ గ్రామంలో జరిగిన సభలో ఏకంగా టెలిఫోన్ లో అధికారితో మాట్లాడుతూ... కలెక్టర్ తో నేను మాట్లాడుతాను అవసరమైతే మంత్రి సీతక్క దగ్గరికి వెళ్లి కూర్చుంటా!? మీరు కూడా రావాలి! అని చెప్పిన ఎమ్మెల్యే ఇంతవరకు ఇటుకుల పహాడ్ రోడ్డు గురించి గానీ ఊరి గురించి గానీ బాబు గురించి గానీ ఆలోచించిన పాపను పోలేదని బాహాటంగానే ఇటుకులపాడు గ్రామస్తులు పెదవి విరుస్తున్నారు. ఇక ఇదే విషయంపై జేయభేరి ప్రచురించిన కథనానికి రోడ్డు తన ముఖచిత్రాన్ని మార్చుకునే విధంగా కొంతవరకు మెరుగ్గా అయినప్పటికీ పూర్తిగా శాశ్వతమైన రోడ్డు నిర్మాణం జరగాలని అది ఎప్పుడు చేస్తారో అధికారులు మీడియాకు తెలపాలని స్థానిక ఇతుకుల పహాడ్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Read More జాతీయ స్థాయి కరాటే చాంపియన్ షిప్ పోటీల్లో విఙ్ఞాన భారతి పాఠశాల విద్యార్థుల ప్రతిభ

Latest News

విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం
జయభేరి, మేడిపల్లి : రాచకొండ పోలీస్ కమిషనరేట్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుడమి హై స్కూల్ బోడుప్పల్ లో మేడిపల్లి పోలీస్ వారి ఆధ్వర్యంలో ట్రాఫిక్...
యాద్గారపల్లి చౌరస్తా లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ నాయకులు
ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు
ప్రజా పాలన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన మొదటి సంవత్సరం అభివృద్ధి పనుల వివరాలు...
ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి 
మొద్దు నిద్రలో రేవంత్ సర్కారు