Kamareddy I పది గణితంలో 10 జిపిఏ మనదే...

మొదటిసారి బోర్డు పరీక్షలు రాస్తున్న పదవ తరగతి విద్యార్థులకు సూచన… ప్రముఖ గణిత శాస్త్ర ఉపాధ్యాయులు శ్రీ విజయగిరి రామకృష్ణ గారి సూచనలు సలహాలు…

Kamareddy I పది గణితంలో 10 జిపిఏ మనదే...

జయభేరి, కామారెడ్డి జిల్లా బ్యూరో :

పదవ తరగతి వార్షిక పరీక్షలు రాస్తున్న విద్యార్థులలో కొందరు ముఖ్యంగా గణితం ఒకటి కఠినతరమైన సబ్జెక్ట్ అని,అది నేర్చుకోవడం చాలా కష్టమని భావించేవారు ఉన్నారు.ఇటువంటి వారే గణితం పై ఉన్న భయాన్ని విడనాడి సాధన చేస్తే 10 జీపీఏ పొందడం చాలా సులువు అని విజయపథం పుస్తకంలోని గణిత భాగ రచయిత మరియు ప్రముఖ ప్రశ్నాపత్ర విశ్లేషకులు అయిన కామారెడ్డి జిల్లా చిన్న మల్లారెడ్డి బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన గణిత శాస్త్ర విషయ నిపుణులు శ్రీ విజయగిరి రామకృష్ణ తెలిపారు.ముందుగా మిమ్మల్ని మీరు నమ్మండి విద్యార్థులు ఇప్పటికే మీరు గణితంలో చాలా పాఠశాల పరీక్షలతోపాటు ఫ్రీ ఫైనల్ పరీక్ష కూడా రాసి ఉన్నారు.కనుక  మీకు ప్రశ్నాపత్రంపై ఒక అవగాహన వచ్చి ఉంటుంది. అయినా పరీక్షలు అంటే భయపడే విద్యార్థులు ముందుగా మీరు భయాన్ని వీడండి.ఉపాధ్యాయులు చెప్పిన విషయాలను ఒక పద్ధతి ప్రకారం సాధన చేస్తే గణితం అన్ని విషయాల కంటే కూడా చాలా సులువు అవుతుంది.గణితంలో ముఖ్యంగా ఒక సమస్య లో ఏమి ఇవ్వబడింది (దత్తాంశము),మనం ఏం కనుక్కోవాలి( సారాంశం)  గ్రహించడం చాలా అవసరం. తర్వాతనే దీని కోసం మనం సూత్రాన్ని వాడాలి ఇది విషయ భావన కు సంబంధించింది,విలువలు ఎలా ప్రతిక్షేపించి తగిన సోపానాల ద్వారా తుది ఫలితాన్ని ఎలా రాబట్టాలో తెలుసుకోవాలి.

Read More ఘనంగా మాజీ ఎమ్మెల్యే శ్రీ రామావత్ రవీంద్ర కుమార్ దేవరకొండ పుట్టినరోజు వేడుకలు

ప్రశ్నాపత్ర విధానం

Read More క్రియాశీల సభ్యత్వం పొందిన దయాకర్ రెడ్డి 

80 పార్కులకు రాసే ప్రశ్నాపత్రంలో పార్ట్ - కు 60 మార్కులు 2 1/2 o,పార్ట్ - బి లోని బహుళైచిక ప్రశ్నలకు 20 మార్కులు 1/2o.కేటాయించబడింది.పార్ట్- లోని ప్రశ్నలు మూడు సెక్షన్లుగా ఉంటాయి.సెక్షన్ -I లో 6 అతి స్వల్ప సమాధాన ప్రశ్నలుఉంటాయి ప్రతిదానికి రెండు మార్కులు.అన్ని సమస్యలకు సమాధానాలు రాయాలి.సెక్షన్ -2 లో 6 స్వల్ప సమాధాన ప్రశ్నలుఉంటాయి ప్రతిదానికి 4 మార్కులు.అన్ని సమస్యలకు సమాధానాలు రాయాలి.సెక్షన్ 3 లో ఆరు మార్కుల ప్రశ్నలు ఆరు ఇస్తారు వీటిలో మనం నాలుగు సమస్యలను సాధించాలి. సెక్షన్లో అంతర్గత ఛాయిస్ ఉంటుంది.ఇక పార్ట్-బి లో ఇప్పుడు ఒక ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 20 ప్రశ్నలు ఇస్తున్నారు.ఇవి దాదాపుగా సులభంగా చేసేవి గానే ఉంటున్నాయి.కేటాయించిన అరగంట సమయంలోనే 20 ప్రశ్నలు సాధించుకోవడానికి వినియోగించుకోవడం నేర్చుకోవాలి.ఎస్సీఈఆర్టీ వారి ప్రశ్నాపత్రం యొక్క బ్లూ ప్రింట్ ప్రకారమే మనకున్న అకాడమిక్ సామర్ధ్యాలను దృష్టిలో ఉంచుకొని ప్రశ్నాపత్రం తయారు చేయబడుతుంది.10 జీపీఏ కోసం కష్టపడే విద్యార్థులు అన్ని చాప్టర్స్ ని ప్రిపేర్ కావాలి.అంటే అంతర్గత మార్కులను కలుపుకొని 100 కి 92 కు పైగా మార్కులు తెచ్చుకోవాలి.కొంత అకాడమిక్ సామర్థ్యాల ప్రకారము వివిధ చాప్టర్స్ నుండి స్టాండర్డ్స్ కి సరిపోయే ప్రశ్నలు ఏవి ఉన్నాయో చూసుకొని ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది.

Read More కాంగ్రెస్ గెలుపుపై గజ్వేల్ లో సంబరాలు

 ఏం చదవాలి?

Read More రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులకు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు  కలెక్టర్

ముందుగా గణితాన్ని కాస్త ఇబ్బందిగా అనుకునే విద్యార్థులు 6 మార్కుల ప్రశ్నలపై ఎక్కువ ప్రాక్టీస్ చేయండి.మనం సాధించాల్సినవి నాలుగు ప్రశ్నలే.వీటిలో ముఖ్యంగా మనకు ఆరు ప్రశ్నలలో రెండు ప్రశ్నలు పట చిత్రాలకు సంబంధించినవి ఉంటాయి.అవే ఒకటి గ్రాఫ్, మరొకటి నిర్మాణాల కు సంబంధించింది.గ్రాఫ్ లో భాగంగా ముఖ్యంగా బహుపదులలోని పరావలయాన్ని గీసి శూన్యాలను కనుగొనడం,రేఖీయ సమీకరణాల జత రేఖాచిత్రం గీసి సాధించడం,ఓజీ వక్రం.నిర్మాణాలలో స్వరూప త్రిభుజాలలోని నిర్మాణాలు మరియు వృత్తానికి స్పర్శ రేఖ గీయడం తప్పనిసరిగా నేర్చుకోవాలి.అలాగే సాంఖ్యాక శాస్త్రంలోని సగటు,మధ్యగతం మరియు బహుళకం కి సంబంధించిన ప్రశ్నల సాధన నేర్చుకోవాలి. సూత్రాలే కాకుండా శ్రేడులు,క్షేత్రమితి లోని ఒక సూత్రం రాసి అందులోని పదాలను వివరించడం అను సమస్య నాలుగు మార్కులకు వచ్చే అవకాశం కలదు.అలాగే ఎత్తులు దూరాల నుండి ఒక సమస్య, ఒక దత్తాంశానికి సరిపోయే పటాన్ని గీయడం మరియు త్రికోణమితి నుండి నిరూపించడం లేదా విలువలను కనుగొనడం అను ప్రశ్నలు, సమితుల నుండి సమితి నిర్మాణ రూపం లో ఇవ్వబడిన రెండు సమి తులు ,బిల సమ్మేళనము మరియు చేదనం, - బి లను కనుకోవడం మరియు వీటితోపాటు  .సి.బి వెన్ చిత్రాలను గీయడం ,ఒక రూపం నుండి మరొక రూపం లోకి సమితులను మార్చడం,కరణీయ సంఖ్య అని నిరూపించే సమస్యలు,సంభావ్యతంలోని ప్రశ్నలను చాలా సులువుగా నేర్చుకోవచ్చు.అదేవిధంగా క్షేత్ర మితిలో ఒక రూపంలోని ఆకారాన్ని మరొక రూపంలోకి మార్చే సమస్యలు,నిరూపక రేఖ గణితంలో ఉన్న కేవలం నాలుగు సూత్రాలపైనే ప్రశ్నలు ఉంటాయి. కనుక వీటిని బాగా నేర్చుకోవాలి.కానీ 10 జీపీఏ కోసం కష్టపడే విద్యార్థులు ఉపాధ్యాయులు ఇచ్చిన అన్ని చాప్టర్స్ లోని ముఖ్యమైన ప్రశ్నలు మరియు ఎస్సీఈఆర్టీ వారి అభ్యాస దీపిక,జిల్లా విద్యాశాఖ వారు అందించిన విజయపథం లోని గణిత మాదిరి ప్రశ్నావళి,నమూనా ప్రశ్నాపత్రాలు మరియు ప్రీ ఫైనల్ పేపర్లను ఎక్కువగా సాధన చేయండి.

Read More ములుగు జిల్లా చల్పాక ఎన్ కౌంటర్ పై హైకోర్టులో నేడు విచారణ!

 ఎలా చదవాలి?

Read More రామాలయంలో సీసీ కెమెరాలు ప్రారంభించిన పేట్ బషీరాబాద్ ఏసిపి

ముఖ్యంగా ఇచ్చిన ప్రశ్న ఏంటి,ఏం అడుగుతున్నారు,ఏం కనుగొనాలి దాని కోసం ఫార్ములా వాడాలి,ఇది చాప్టర్ కి సంబంధించింది సాధన చేసేటప్పుడు దానిలో ఎక్కడో ఒకచోట ఒక మెయిన్స్ స్టెప్ ఉంటుంది దాని పైననే సాధారణంగా మొత్తం సాధన ఆధారపడి ఉంటుంది దానిపై పూర్తి అవగాహన కలిగి ఉండడం అవసరం.ఉత్తమ జిపిఏ పొందుటకు సెల్ఫ్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం లేదా  మీ మిత్రులకి సమస్యని వివరించడం చేయండి.అప్పుడు మీకు పూర్తి పట్టు వస్తుంది అది బాగా గుర్తుంటుంది.చాప్టర్ల వారీగా ముఖ్యమైన ప్రశ్నలను ఏమున్నాయో ఒకసారి లిస్ట్ అవుట్ చేసుకోండి. సాధన చేసే కొద్ది పట్టు లభిస్తుంది మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది.చాప్టర్ల వారీగా సూత్రాలను వ్రాసుకోవడం చేయాలి.ఎంతో అనుభవం ఉన్న మన  ఉపాధ్యాయులు చెప్పినటువంటి ప్రశ్నలను ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు అనుకున్న 10 జీపీఏ రావడం పెద్ద కష్టమేమీ కాదు. ప్రాక్టీస్ కి మించింది మరొకటి లేదు.గణితం బట్టి పట్టాల్సిన దానికంటే కూడా దానిలోని కాన్సెప్ట్ అర్థం చేసుకునే దానిపై దృష్టి పెట్టాలి.పరీక్ష రాసేటప్పుడు గుర్తుంచుకోవాల్సినవి.మొదటగా ఇచ్చిన ప్రశాపత్రాన్ని 15 నిమి ప్రశాంతంగా ఒత్తిడి లేకుండా చదవడం అలవాటు చేసుకోండి.ప్రశ్నాపత్రం ఇవ్వగానే గబగబా సమాధానాలు రాసేయకండి.మీరు ఎంచుకున్న,బాగా చేయగలిగిన ప్రశ్నలకు సమాధానాలు ముందుగా రాయండి.సూత్రాలని హైలెట్ చేయండి రేఖాచిత్రాలను  పెన్సిల్ తో మాత్రమే గీయండి.పైన సూచికలు రాయండి.అదేవిధంగా శూన్యాలను బాక్స్ లో రాయండి నిర్మాణాలు చేసేటప్పుడు చిత్తుపటం వేయడం మర్చిపోవద్దు.అదేవిధంగా నిర్మాణ క్రమం రాయాలి.మార్చిన్లు గీయడం చిత్తు పనిని మార్జిన్ అవతల రాయడం చేయండి.ప్రతి ప్రశ్నకు సెక్షన్ నంబర్ ప్రశ్న యొక్క సంఖ్యను తప్పకుండా రాయాలి.పరీక్ష రాయడం అయిపోయినాక ఒకసారి మీ పేపర్ ను క్షుణ్ణంగా పరిశీలించుకోండి.త్రిబుల్ ఐటీ ధ్యేయంగా ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు మాత్రం కచ్చితంగా గణితంలో 10 జీపీఏ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది.ఎందుకనగా విద్యార్థులకు సమాన మార్కులు వచ్చిన పరిస్థితిలో మొదటగా వారి గణితంలోని మార్కుల ప్రాతిపదికన ఎంపిక చేయబడతారు కనుక.ఫోటో రైట్ అప్ వసతి గృహంలో చదువుకునే పదో తరగతి విద్యార్థులకు విజయస్ఫూర్తి పేరిట ప్రశ్నాపత్రంపై అవగాహన కల్పిస్తున్న శ్రీ రామకృష్ణ.

Read More పరకాల ఏజీపీగా లక్కం శంకర్

Latest News

ఫ్రెండ్ రిసెప్షన్ కి వెళ్లి.. తిరిగిరాని లోకానికి వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫ్రెండ్ రిసెప్షన్ కి వెళ్లి.. తిరిగిరాని లోకానికి వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి
జయభేరి, సైదాపూర్  : సైదాపూర్ మండల్ రామచంద్రపూర్ విలేజ్ లో నిన్న రాత్రి రోడ్డు ప్రమాదంలో పొన్నం మహేష్ అనే యువకుడు ఫ్రెండ్ రిసెప్షన్ లో పాల్గొని...
విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం
యాద్గారపల్లి చౌరస్తా లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ నాయకులు
ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు
ప్రజా పాలన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన మొదటి సంవత్సరం అభివృద్ధి పనుల వివరాలు...
ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి